Home » Day Eight » నైవేద్యం - మినప గారెలు

 

 

మినప గారెలు

 



కావలసినవి :

మినపపప్పు - అరకేజీ
పచ్చిమిర్చి - 5
ఉల్లిపాయలు - 1
ఉప్పు - సరిపడ
నూనె - అరకేజీ
అల్లం - చిన్నముక్క
జీలకర్ర - 2 స్పూన్స్

తయారివిధానం :

నాలుగుగంటల  ముందు మినపపప్పును నానబెట్టాలి. నానిన ఈ పప్పును బాగా కడిగి    బరకగా, గట్టిగా  ఉండేలా  గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిర్చి,  ఉప్పు,  జీలకర్రలను  మిక్సీచేసి  పై  మిశ్రమంలో  కలపాలి. ఇప్పుడు స్టవ్ వెలిగించి బాండి  పెట్టి  నూనె  పోసి  వేడిచేయాలి. ఈ పిండిని కొద్దికొద్దిగా తీసుకోని వడల్లా చేసి మధ్యలో  రంద్రం  పెట్టి  కాగిన  నూనెలో  వేసి  గోల్డ్ కలర్ వచ్చే  వరకు  వేయించి బౌల్ లోకి తీసుకోవాలి.