Home » Day Eight » కాశీపంచకం

 

కాశీపంచకం

 

 


మనో నివృత్తిః పరమోపశాంతిః స తీర్థవర్యా మణికర్ణికా త్ర
జ్ఞానప్రవాహో విమలాదిగంగా సా కాశికాహం నిజబోధరూపా || 1 ||

యస్యామిదం కల్పితమింద్రజాలం చరాచరం భాతి మనోవిలాసం
సచ్చిత్సుఖైకా పరమాత్మరూపా కా కాశికాహం నిజబోధరూపా || 2 ||

కోశేషు పంచస్వభిరాజమానా బుద్ధిర్భవానీ ప్రతిగేహగేహం
సాక్షీ శివః సర్వగతోంతరాత్మా కా కాశికాహం నిజబోధరూపా || 3 ||

కాశ్యాంతు కాశతే కాశీ కాశీ సర్వప్రకాశికా
సా కాశీ విదితా యేన తేన ప్రాప్తా హి కాశికా || 4 ||

కాశీక్షేత్రం శరీరం త్రిభువనజననీ వ్యాపినీ జ్ఞానగంగా
భక్తి శ్రద్ధా గయేయం నిజగురుచరణధ్యానయోగః ప్రయాగః
విశ్వేశోzయం తురీయః సకలజనమనః సాక్షిభూతోంతరాత్మా
దేహే సర్వం మదీయే యది వసతి పునస్తీర్థమన్యత్కిమస్తి || 5 ||

పై శ్లోకములలో శ్రీ శంకరులు కాశికను ఆత్మజ్ఞానపరముగా భావించి వివరించినారు. ఆచార్యులవారి దృష్టిలో కాశీ నగరము అద్వైత విద్యకు ఒక ప్రతీకగా కన్పించినది. ముముక్షువునకు బహిర్భూతముగా కాశీ లేదు. అందుచేతనే కాశీకి వేదములలో ప్రధానస్థానము కన్పించుచున్నది.