సిద్ధ శ్రీ మహాకాళి అష్టధాతు కవచం
.png)
మాతేశ్వరి మహాకాళిని శీఘ్ర ప్రసన్నం చేసుకునేందుకు ఈ ఇహలోక మహాశక్తివంతమైన కవచాన్ని మెడలో ధరించి తీరాల్సిందే. పిల్లలు, వృద్ధులు, మహిళలు, పురుషులు ప్రతి ఒక్కరికీ సమాన లాభాన్ని అందించే కవచం ఇది. సృష్టి చక్రాన్ని, సంపూర్ణ బ్రహ్మాండాన్ని నడిపించేది, పోషించేది నిరాకారరూపమైన, మహాశక్తిరూపమైన మాతేశ్వరి మహాకాళి అమ్మవారు. బ్రహ్మ, విష్ణు, మహేశ్వరుడు, సర్వ దేవదేవతలు, మానవులు, రాక్షసులు, గ్రహాలు, నక్షత్రాలను, సంపూర్ణ త్రైలోక్య సృష్టికి, లయకారకానికి కారణం మహాకాళి అమ్మవారు. అందరిలోనూ కాళి తొలి విభూతి విశేష అవతారం. ఈ పూర్తి బ్రహ్మాండంలో మహాకాళికి మించిన శక్తి మరేదిలేదు. ఈ తల్లి సృష్టిలోని సర్వబలానికి ప్రతీక. సృష్టిలో ఉన్న మంద లక్షణం, జడత్వం, సోమరితనం ఇవేవి ఆమెకు పడవు. తన వీరత వల్ల అసమ లక్షణాన్ని తొలగించి అంతటినీ దివ్యభావ వాసయోగ్యంగా చేస్తుంది. రిద్ధి, సిద్ధి, ధనం, శ్రేయస్సు, ఆనందం, శాంతి మరియు ముక్తి పొందదలచేవారు మాతేశ్వరి మహాకాళి అమ్మవారి సిద్ధ శ్రీ మహాకాళి కవచధారణ ద్వారానూ సాధ్యమౌతుంది. తద్వారా ఆమె కృపకు పాత్రులౌతారనడంలో ఏ మాత్రం సందేహంలేదు. ఇది అన్ని మంచి కోరికలను తీర్చే కవచం.

ధారణ విధి – సిద్ధ శ్రీ మహాకాళి కవచాన్ని శనివారం ప్రాతఃకాలం పచ్చిపాలతో శుభ్రపరచి, కుంకుమ దిద్ది “శ్రీ కాళికాయై నమః” అనే మహాకాళి ధ్యాన మంత్రాన్ని 108 మార్లు పఠిస్తూ ధారణ చేస్తే శుభదాయకం.
ఈ కవచధారణ ద్వారా కలిగే లాభాలు.
1. సోమరిలు తప్పక ధరించవలసిన కవచం. వారికి నూతనోత్సాహాన్ని, చురుకును అందిస్తుంది.
2. “నాయమాత్మా బలహీనేన లభ్య” అని వేదం అంటున్నది. బలం సాధించాలి, బలం ద్వారా పరమాత్మను సాధించాలి. మన శరీరంలోని మూలాధారంలో కుండలనీ శక్తిగా నిద్రాదశలో ఉంటుంది కాళికాదేవి. ఈ సాధన దశలో ఆమె మేల్కొని సాధకులకు అనంత శక్తిని అందిస్తుంది. కనుక యోగమార్గంలో సాగేవారందరూ ఈ కవచాన్ని ధరిస్తే ఆమె అనుగ్రహం ద్వారా యోగశక్తిని ఇట్టే గ్రహించగలుగుతారు.
3. సృష్టి, లయకారకం కాళికామాతే కనుక సంతానం లేని వారు ఈ కవచాన్ని ధారణచేస్తే దోషాలు తొలగి సంతాన భాగ్యం కలుగుతుంది.
4. కాళి కవచాన్ని ధరించి కాళిమాతను ఆరాధించేవారికి పేదరిక సమస్యలుండవు. ఇక వారి జీవితంలో స్వర్ణకాలమే. అష్టలక్ష్ముల కటాక్షం కలుగుతుంది. విద్యాసంపద మెండుగా లభిస్తుంది. భయం తొలగి ధైర్యసాహసవంతులౌతారు.
5. ఈ సిద్ధ శ్రీ మహాకాళి అష్టధాతు కవచాన్ని ధరించి రాజకీయ నాయకులు ప్రజల్లో పలుకుబడి సంపాదించవచ్చు. పదవులు చేజిక్కించుకోవచ్చు. అన్ని రకాల పోరాటాలు సమసిపోతాయి.
6. మరణభయంతో బాధపడేవారు సిద్ధ శ్రీ మహాకాళి అష్టధాతు కవచాన్నిధరించడం మంచిది. ఎందుకంటే దశ మహా విద్యలలో మొదటిది కాళి. సృష్టిలోని సమస్తమైన శక్తికి కేంద్ర బిందువు కాళిక. కాలాన్ని నడిపించేది, మృత్యు భయాన్ని పోగొట్టేది ఈమే.
7. కాళి కవచధారణ మూలకంగా వృత్తి, వ్యాపారం చేసేవారికి లాభాలు పెరిగి సుఖమైన జీవితం తథ్యం. శాస్త్ర జ్ఞానం పెరుగుతుంది. చేసే పనిలో సూక్ష్మజ్ఞానం పెరుగుతుంది. మంత్ర తంత్రాలన్నీయు మంచి కార్యాలకు ఉపయోగపడుతుంది.
8. కాలా అంటే చీకటి అని అర్థం. కాళి అంటే ఆ చీకటిని తనలోకి స్వీకరించేది అని అర్థం. భక్తితో ప్రార్థించేవారిలోని మలిన్యాన్ని తాను స్వీకరించి తన భక్తులను స్వచ్ఛంగా తీర్చిదిద్దుతుంది కాళిమాత.




