Home » Articles » నైవేద్యం ...

నైవేద్యం ...

 

Information about navarathri naivedyam nine types of naivedyam for dasara navaratri in south india goddess Kalika devi

 

జీలకర అన్నం

కావలసిన పదార్థాలు :
బియ్యం... ఒక కేజీ
జీలకర్ర... 50 గ్రా.
కొత్తిమీర... ఒక కట్ట
ఉల్లిపాయ... ఒకటి
నూనె.. వంద గ్రా.
వేడినీళ్లు... రెండున్నర లీటర్లు
ఉప్పు... రుచికి సరిపడా

తయారీ విధానం :
బియ్యాన్ని కడిగి వేడినీటిలో నానబెట్టాలి. 15 నిమిషాల తరువాత నీటిని వంపేసి బియ్యాన్ని పక్కన ఉంచాలి. పెద్ద పాత్రలో నూనె వేసి వేడయ్యాక జీలకర్ర వేసి చిటపటలాడిన తరువాత తరిగిన ఉల్లిపాయ ముక్కలు వేసి సన్నటి మంటమీద వేయించాలి. అందులోనే ఉప్పు, వడబోసి ఉంచిన బియ్యాన్ని వేసి ఉల్లిపాయ ముక్కలు, జీరా బియ్యంలో కలిసేవిధంగా కలిపి అర నిమిషంపాటు అలాగే ఉంచి బియ్యంమీద మూడంగులాల ఎత్తుదాకా నీటిని పోసి మంటను పెంచి, కలిపి మూతపెట్టాలి. బియ్యం ఉడకటం మొదలయ్యాక కొత్తిమీరను తరుగు వేసి కలిపి మంట తగ్గించాలి. మూడు నుంచి ఐదు నిమిషాలు అలాగే ఉంచి, అన్నం ఉడికిందో లేదో చూసి దించేయాలి. అంతే జీరా రైస్ రెడీ అయినట్లే..!