Home » Others » తమలపాకు బజ్జీలు


తమలపాకు బజ్జీలు

కావాల్సిన పదార్థాలు:

తమలపాకులు - 10

శనగపిండి - 1/4kg

ఉప్పు - రుచికి సరిపడా వాము -1

స్పూన్ కారం - అర స్పూన్

వంటసోడా- చిటికెడు

నూనె - వేయించటానికి సరిపడా

ఉల్లిపాయ- 1

చట్ మసాలా - చిటికెడు

నిమ్మకాయ- 1

తయారీ విధానం:

ముందుగా తమలపాకును తీసుకుని వాటిని బాగా కడిగి ఆరబెట్టుకోవాలి. ఇప్పుడు ఒక గిన్నె తీసుకుని అందులో శనగపిండి, కారం, సోడా, వాము, నీరు వేసి బజ్జీ పిండి వలే కలుపుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని పక్కన పెట్టుకుని...డీప్ ఫ్రై చేసుకునేందుకు ఒక కడాయి తీసుకుని అందులో నూనె పోసి వేడి చేయాలి. ముందుగా ఆరబెట్టుకున్న తమలపాకులు తీసుకుని..ఒక్కొక్కటిగా బజ్జీ పిండిలో రెండు వైపులా ముంచి నూనెలో వేయండి. ఎర్రగా రెండు వైపులా వేగనివ్వాలి. తర్వాత బయటకు తీసి ఒక ఉల్లిపాయను తీసుకుని సన్నగా కట్ చేసుకుని కాస్త కారం, చాట్ మసాలా , ఉప్పు , నిమ్మకాయ వేసుకుని బజ్జీ మధ్యలో కట్ చేసి పెట్టండి. మిగిలిన తమలపాకులను కూడా ఇదే మాదిరిగా చేయండి. చలికాలంలో వేడి వేడి చాయ్ తోపాటు తమలపాకు బజ్జీలను తింటే మస్తు మజా ఉంటుంది.


Related Recipes

Others

తమలపాకు బజ్జీలు

Others

Aratikaya Bajji