Home » Non-Vegetarian » Rajasthani Chicken Curry


 

 

రాజస్థానీ చికెన్ కర్రీ

 

 

 

 

కావలసినవి :
చికెన్ - అరకేజీ
ఉల్లిపాయలు - రెండు
పెరుగు - ఒక కప్పు
అల్లం పేస్ట్ - ఒక స్పూన్
వెల్లుల్లి పేస్ట్ - ఒక స్పూన్
ఎండు మిర్చి - నాలుగు
లవంగాలు - ఐదు
బిర్యానీ ఆకు - 1
దాల్చిన చెక్క - అంగుళం ముక్క
మిరియాలు - 8
జీరా -  ఒక స్పూన్
కొత్తిమిర పౌడర్ - 3 స్పూన్లు
సాల్ట్ సరిపడా
కారం - 4స్పూన్లు
పసుపు - అరస్పూన్
చికెన్ మసాలా- ఒక స్పూన్
నిమ్మరసం - ఒక స్పూన్
ఆయిల్- సరిపడగా

 

తయారీ :
ముందుగా చికెన్ ను శుభ్రంగా కడిగి నిమ్మరసం,సాల్ట్ వేసి కలిపి పక్కన పెట్టుకోవాలి. తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి వేడి చేసి లవంగాలు,మిరియాలు,జీరా, దాల్చిన చెక్క,ఎండుమిర్చి,ఉల్లిపాయ ముక్కలు వేసి బ్రౌన్ కలర్ వచ్చె వరకు వేయించి చల్లారక వాటిని మిక్సిలో వేసి గ్రైండ్ చేసుకోవాలి.  తరువాత స్టవ్ వెలిగించి పాన్ పెట్టి ఆయిల్ వేసి చికెన్ వేసి అందులో పసుపు, కారం, కొత్తిమిర పౌడర్ అల్లం, వెల్లుల్లి పేస్ట్ వేసి వేగనివ్వాలి. పది నిముషాల తరువాత గ్రైండ్ చేసుకున్నమసాలా పేస్ట్ వేసి కొద్దిసేపు వేయించి అందులో పెరుగు, చికెన్ మసాలా వేసి కలిపి మూతపెట్టి ఒక పదినిముషాలు ఉడకనివ్వాలి. ఆయిల్ పైకి తేలిన తరువాత స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని కొత్తిమిరతో గార్నిష్ చేసుకుని చపాతితో కాని, రైస్ తో కాని సర్వ్ చేసుకోవాలి

 

 

 


Related Recipes

Non-Vegetarian

గోంగూర ఎండు రొయ్యలు

Non-Vegetarian

చిల్లీ చికెన్

Non-Vegetarian

చికెన్ సుక్కా

Non-Vegetarian

పెప్పర్ చికెన్ గ్రేవీ!

Non-Vegetarian

ఎగ్ మసాలా కర్రీ

Non-Vegetarian

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ

Non-Vegetarian

Kaju Chicken Fry

Non-Vegetarian

Stir Fried Chicken with Vegetables