Home » Non-Vegetarian » చెట్టినాడ్ చికెన్ బిర్యానీ


 

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ!

 

కావాల్సిన పదార్ధాలు:

భాస్మతి బియ్యం - 2కప్పులు

చికెన్ -500గ్రాములు

ఉల్లిపాయ ముక్కలు -2

టమోటాలు - 2 తరిగినవి

పచ్చిమిర్చి ముక్కలు -2

వెల్లుల్లి, లవంగాలు - 3

పెరుగు - పావు కప్పు

అల్లం- ఒక అంగుళం ముక్క

కారం- 1 టీస్పూన్

సాన్ఫ్ - 1 స్పూన్

లవంగాలు- 3

యాలకులు -3

ధనియాల పొడి - 1 స్పూన్

నూనె-  2 స్పూన్లు

ఉప్పు -రుచికి సరిపడా

నెయ్యి - 1 స్పూన్

కొత్తమిర -గార్నిష్ కోసం

పసుపు -1 టీస్పూన్

తయారీ విధానం:

1.ముందుగా బియ్యాన్ని బాగా కడిగి 20-30 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టాలి. వడపోసి పక్కన పెట్టుకోవాలి. 

2.చికెన్‌ని మ్యారినేట్ చేయడానికి, అల్లం-వెల్లుల్లి పేస్ట్, పెరుగు, పసుపు, కారంపొడి, ఉప్పును ఒక గిన్నెలో వేయండి. చికెన్ ముక్కలను వేసి బాగా కలపాలి. కనీసం గంటసేపు పక్కన పెట్టుకోండి. 

3.ఇప్పుడు మందపాటి అడుగు ఉన్న పాన్‌లో నెయ్యి వేడి చేయండి. సాన్ఫ్, లవంగాలు, దాల్చిన చెక్క,  ఏలకులు జోడించండి. బాగా వేగించండి. ఉల్లిపాయలు, అల్లం, వెల్లుల్లి వేసి, ఉల్లిపాయలు బంగారు గోధుమ రంగు వచ్చేవరకు వేయించాలి. 

4.దీనికి, మ్యారినేట్ చేసిన చికెన్ ముక్కలను వేసి మరికొన్ని నిమిషాలు ఉడికించాలి. తరిగిన టమోటాలు, పచ్చిమిర్చి,  మిరపకాయలు పసుపు వేయండి. బాగా కలుపండి. 

5.తరువాత, పెరుగు, కొత్తిమీర వేయండి. ఇప్పుడు అన్నింటిని కలిపండి.  సుమారు 4-5 నిమిషాలు ఉడికించాలి. 

6.ఇప్పుడు, ఈ చికెన్ మసాలాను వండిన అన్నంతో కప్పి, పైన వేయించిన ఉల్లిపాయలు, జీడిపప్పులు, ఎండుద్రాక్ష వేయండి. గాలి బయటకు రాకుండా మూతను కవర్ చేయండది.  అది 15-20 నిమిషాలపాటు సన్నని మంటమీద ఉడికించాలి.

 


Related Recipes

Non-Vegetarian

చిల్లీ చికెన్

Non-Vegetarian

చికెన్ సుక్కా

Non-Vegetarian

పెప్పర్ చికెన్ గ్రేవీ!

Non-Vegetarian

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ

Non-Vegetarian

Kaju Chicken Fry

Non-Vegetarian

Stir Fried Chicken with Vegetables

Non-Vegetarian

Chicken Chermoula

Non-Vegetarian

Chicken Soup