Home » Non-Vegetarian » Prawns Biryani


ప్రాన్స్ బిర్యానీ

 

 

 

కావలసిన పదార్ధాలు:

 

రొయ్యలు -  అరకేజీ

పెరుగు -  ఒక టేబుల్ స్పూన్ 

అల్లంవెల్లుల్లి పేస్ట్ -  ఒక టీ స్పూన్ 

గరంమసాలాపొడి -  ఒక టీ స్పూన్ 

పచ్చిమిర్చి -  రెండు 

ఉప్పు, కారం, పసుపు  -  తగినంత

బాస్మతి రైస్ - అరకేజీ

పుదీనా - ఒక కట్ట

కొత్తిమీర - కొద్దిగా

లవంగాలు - 6

చెక్క - సరిపడా

యాలకులు - 4

షాజీరా - కొద్దిగా

అనాసపువ్వు - 1

మరాటీమొగ్గ - 1

జాపత్రి - 2

బిర్యానీ ఆకు - 2

ఉల్లిపాయ - ఒకటి 

టమాటా - అరకప్పు ప్యూరీ

నూనె - 3 స్పూన్లు  

నెయ్యి - 2 స్పూన్లు  

తయారు చేసే విధానం:

ముందుగా పెరుగులో అల్లంవెల్లుల్లి పేస్ట్, గరం మసాలా, ఉప్పు, కారం, పదార్ధాలు కలిపి, శుభ్రం చేసిన రొయ్యలు వేసి కొంచంసేపు  నాననివ్వాలి.

బాస్మతి రైస్ కడిగి పక్కనపెట్టుకోవాలి. స్టవ్ వెలిగించుకుని  వెడల్పాటి గిన్నెతీసుకుని  అందులో సరిపడా నీళ్ళు పోసి మరిగించి, లవంగాలు, చెక్క, యాలకులు, షాజీరా, అనాసపువ్వు, మరాటీమొగ్గ, జాపత్రి, బిర్యానీ ఆకు, పుదీనా,  కొత్తిమీర, కొంచెం ఉప్పు, కడిగిన రైస్ కూడా వేసి ఉడికించాలి.

మూడు వంతులు ఉడికించాలి... ఇప్పుడు  పాన్ తీసుకుని రెండు టేబుల్ స్పూన్స్ నూనె వేసి తరిగిన ఉల్లి, మిర్చి వేయించాలి.

ఇందులో టమాటా ప్యూరీ, అల్లంవెల్లుల్లి పేస్ట్ వేసి వేయించాలి. ఇప్పుడు నానబెట్టుకున్నరొయ్యలు వేసి కలిపి, గరంమసాలాపొడి, తరిగిన పుదీనా, కొత్తిమీర వేసి ఉడికించాలి.

గ్రేవీ కొంచెం చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చెయ్యాలి. కుక్కర్ పెట్టి కొంచం ఆయిల్ వేసి  సగం రైస్ వేసి దానిమీద కర్రీ వేసి మొత్తం ఇలానే రెడీ చేసుకుని పైన నెయ్యి వేసుకుని కొంచం ఫుడ్ కలర్ వేసుకుని కొత్తిమిర, పుదీనా వేసి కొంచం సేపు మగ్గనివ్వాలి. అంతే ప్రాన్స్ బిర్యాని రెడీ..

 


Related Recipes

Non-Vegetarian

గోంగూర ఎండు రొయ్యలు

Non-Vegetarian

పెప్పర్ ఫ్రాన్స్ ఫ్రై

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ

Non-Vegetarian

కుండ బిర్యాని

Non-Vegetarian

Chicken Nuggets

Non-Vegetarian

Chicken Dum Biryani (Ramzan Special)

Non-Vegetarian

Chicken Haleem (Ramzan Special)