Home » Non-Vegetarian » ఉల్లికారం..కోడిగుడ్డు వేపుడు


ఉల్లికారం..కోడిగుడ్డు వేపుడు

కావ‌ల్సిన ప‌దార్థాలు:

ముక్క‌లుగా త‌రిగిన ఉల్లిపాయ‌లు - 3

వెల్లుల్లి రెబ్బ‌లు - 8

కారం -3 టీ స్పూన్స్

ఉప్పు - త‌గినంత‌

నూనె - 2 టేబుల్ స్పూన్స్

జీల‌క‌ర్ర - అర టీ స్పూన్

క‌రివేపాకు - ఒక రెమ్మ‌

ధ‌నియాల పొడి -ఒక టీ స్పూన్

ప‌సుపు - పావు టీ స్పూన్

గ‌రం మ‌సాలా -పావు టీ స్పూన్

ఉడికించిన కోడిగుడ్లు - 3

త‌రిగిన కొత్తిమీర -తగినంత

తయారీ విధానం:

ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు తయారు చేసే ముందు జార్ లో ఉల్లిపాయలు, వెల్లుల్లి, కారం, ఉప్పు వేసి మెత్తగా కాకుండా కచ్చపచ్చగా పట్టుకోవాలి. తర్వాత ఒక బాణాలిలో నూనెపోసి వేడి చేయాలి. తర్వాత జీలకర్ర, కరివేపాకు వేసి వేయించుకోవాలి. తర్వాత మిక్సీ పట్టుకుని ఉల్లిపాయ కారం వేసి వేయించాలి. నూనె పైకి తేలే వరకు వేయించాలి. తర్వాత ధనియాల పొడి, పసుపు, గరంమసాలా వేసి కలుపుకోవాలి. చిన్నమంటపై ఒక నిమిషం పాటు వేయించాలి. తర్వాత కోడి గుడ్లను ముక్కలుగా చేసి అందులో వేయాలి. వీటిని అంతా కలిసేలా కలుపుకుని మరో రెండు నిమిషాలు పాటు వేయించుకుని స్టవ్ ఆఫ్ చేయాలి. ఇలా చేస్తే ఎంతో రుచికరంగా ఉండే ఉల్లికారం కోడిగుడ్డు వేపుడు రెడీ అవుతుంది.


Related Recipes

Non-Vegetarian

ఉల్లికారం..కోడిగుడ్డు వేపుడు