Home » Vegetarian » Kaddu Kofta Curry Recipe


 

 

కద్దూ కోఫ్తా కర్రీ 

 

 

 

కావలసిన పదార్ధాలు:

సొరకాయ - ఒకటి
సెనగపిండి - రెండు కప్పులు
పచ్చిమిర్చి - నాలుగు

 

తయారు చేసే విధానం:
ముందుగా సొరకాయ(అనపకాయ)ను చెక్కు తీసి తురిమి పెట్టుకోవాలి. ఆ తురుములో సెనగపిండి, ఉప్పు, మెత్తగా గ్రైండ్ చేసిన అల్లం, వెల్లుల్ల్లి, పచ్చిమిర్చి పేస్టుని కూడా వేసి కలపాలి. సొరకాయలో నీరు వుంటుంది కాబట్టి ఆ తడి సరిపోతుంది. గట్టిపకోడిల పిండి మాదిరిగా రావాలి. ఇప్పుడు చిన్న చిన్న ఉండలుగా చేసి వేడి నూనెలో ఎర్రగా వేయించి, గ్రేవీలో వేసి ఓ పదినిమిషాలు మగ్గిస్తే కద్దూ కోఫ్తా కర్రీ  రెడీ అయినట్టే ఈ కూర చపాతిలలోకి బాగుంటుంది.

 

 

గ్రేవీ తయారీకి:
ఉల్లిపాయలు - నాలుగు
అల్లంవెల్లుల్లి ముద్ద - ఒక స్పూను
ధనియాలపొడి - ఒక స్పూను
గసగసాలు - నాలుగు స్పూన్లు 
పచ్చికొబ్బరి - చిన్న కప్పుతో
టమాటాలు - మూడు 
పెరుగు - ఒక కప్పు
కారం - రెండు  స్పూన్లు
పసుపు - చిటికెడు
నూనె - ఒక కప్పు
ఉప్పు - తగినంత

 

 

 

గ్రేవీ తయారు చేసే విధానం:
ఒక గిన్నెలో నూనె పోసి వేడిచేశాకా ముందుగా ఉల్లిపాయలు ముక్కల్ని ఎర్రగా వేయించండి. ఆ తరువాత అల్లంవెల్లుల్లి ముద్ద, కారం, పసుపు, ధనియాలపొడి కలపాలి. అలాగే టమాట ముక్కల్ని కూడా వేసి కాసేపు వేయించాలి. ఆ తరువాత గసగసాలు, కొబ్బరి కలిపి మెత్తగా గ్రైండ్  చేసి ఆ ముద్దని కూడా చేర్చాలి. దించే ముందు పెరుగుని వేసి సన్నని మంట మీద ఓ ఐదు నిమిషాలు ఉంచితే గ్రేవీ సిద్దమయినట్టే.  

 

 

 

-రమ 

 


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Healthy and delicious Veg Hakka Noodles

Vegetarian

పన్నీర్ క్యాప్సికమ్ కర్రి

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!