Home » Vegetarian » Gummadikaya Gujju Pulusu & Dondakaya Curry


గుమ్మడికాయ గుజ్జు పులుసు

 

తయారు చేయు విధానం:

ముందుగా స్టవ్ మీద ఒక బాణలి పెట్టుకుని, అందులో తగినన్ని నీళ్ళు పోసి అందులో గుమ్మడికాయ ముక్కలను వాటితో పాటు ఉల్లిపాయ ముక్కలను వేసి కాసేపు ఉడకనివ్వాలి . ఆ తరవాత టమాట ముక్కలను వేసి అవి ఉడికాక అందులో చింతపండు గుజ్జు వేయాలి.  ఆ తరువాత ఉప్పు , పసుపు, కారం, బెల్లం వేసి మూతపెట్టి కాసేపు ఉడకనివ్వాలి .

దానిలోపు ఒక గిన్నె తీసుకుని 2 స్పూన్ ల బియ్యపు పిండి, 1 స్పూన్ శనగ పిండి వేసి ఉండల్లేకుండా కలుపుకుని ఉడికిన గుమ్మడికాయ మిశ్రమంలో వేసి కాసేపు ఉడకనివ్వాలి.

అది ఉడికేలోపు ఇంకో గిన్నెలో నూనె వేసి అది వేడయ్యాక శనగపప్పు, మినప్పప్పు, జిలకర, ఆవాలు, ఇంగువ, ఎండుమిర్చి వేసి తాళింపు వేసుకొని ఉడికిన గుమ్మడి కాయ మిశ్రమంలో కలిపి, కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటే గుమ్మడికాయ గుజ్జు పులుసు రెడీ.  

దొండకాయ కూర

 

తయారు చేయు విధానం :

ముందుగా ఒక బాణాలి తీసుకుని అందులో తగినంత నీళ్ళు పోసుకుని అందులో దొండకాయలు వేసి ఉడకపెట్టుకోవాలి. అవి ఉడికేలోపు మరో స్టవ్ పై గిన్నె పెట్టుకుని అందులో కాస్త నూనె, శనగపప్పు, మినప్పప్పు , ఎండుమిర్చి వేసి వేయించి దించాక అందులో ధనియాలపొడి , ఉప్పు వేసి గ్రైండ్ చేసుకోవాలి.

ఇప్పుడు స్టవ్ పై బాణలి పెట్టుకుని తగినంత నూనె వేసి జిలకర వేసి వేయించాక, ఉడికిన దొండకాయలు , కాస్త చింతపండు గుజ్జు, పసుపు, చిటికెడు కారం దానితో పాటు ఇంతకుముందు గ్రైండ్ చేసుకున్న మిశ్రమాన్ని వేసి బాగా కలిపి దించేయాలి . అంతే దొండకాయ కూర రెడీ.


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

Healthy and delicious Veg Hakka Noodles

Vegetarian

పన్నీర్ క్యాప్సికమ్ కర్రి

Vegetarian

క్రీమ్ పొటాటో సలాడ్!