Home » Vegetarian » గ్రీన్ పీస్ సోయా కర్రీ


గ్రీన్ పీస్ సోయా కర్రీ

 

 

కావలసిన పదార్ధాలు:

సోయా గ్రాన్యూల్స్ - ఒక కప్పు

పచ్చిమిర్చి - రెండు

కరివేపాకు - ఒక రెమ్మ

ఉప్పు - సరిపడా

కారం - ఒకటిన్నర స్పూన్

పసుపు - అరస్పూన్

నూనె - తగినంత

కొత్తిమీర - కొద్దిగా

అల్లంవెల్లుల్లి పేస్ట్ - ఒక టీ స్పూన్

పచ్చి బటానీలు - ఒక కప్పు

టమాటాలు - రెండు

ఉల్లిపాయ - ఒకటి

గరంమసాలాపొడి - అర టీ స్పూన్

తాలింపు దినుసులు - ఆవాలు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఎండు మిర్చి

 

తయారీ:
ముందుగా బఠానీలను కుక్కర్లో ఉడికించుకోవాలి. తరువాత సోయా గ్రాన్యూల్స్ ను మరిగే నీటిలో వేసి రెండు మూడు నిముషాలు ఉడికించి చల్లారక వడపోసి చల్లని నీళ్ళతో రెండుసార్లు కడిగి నీరు పిండేసి పక్కన పెట్టుకోవాలి.

 

తరువాత పాన్ పెట్టి నూనె వేడి చేసి తాలింపు వేసి సన్నగా తరిగిన ఉల్లి, మిర్చి, కరివేపాకు వేయించాలి.

 

ఇప్పుడు అల్లంవెల్లుల్లి ముద్ద వేసి వేయించి టమాటా ముక్కలు వేయాలి. టమాటా బాగా ఉడికిన తరువాత సోయా గ్రాన్యూల్స్, తగినంత ఉప్పు, కారం, పసుపు వేసి  వేయించాలి.

 

చివరగా ఉడికించిన బఠానీలు, కొత్తిమీర, మసాలా పొడి కూడా వేసి బాగా కలిపి ఒక పది నిముషాలు ఉడికాక  స్టవ్ ఆఫ్ చేసి సర్వింగ్ బౌల్ లోకి తీసుకుని రైస్ తో కాని చపాతీతో కాని సర్వ్ చేసుకోవాలి..


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

లెమన్ ఫ్రైడ్ రైస్

Vegetarian

పన్నీర్ క్యాప్సికమ్ కర్రి

Vegetarian

Bottle Gourd Sweet Curry with Milk

Vegetarian

Panasa Pottu Kura

Vegetarian

Tangy Eggplant Curry