Home » Non-Vegetarian » chicken seekh kabab


 

 

చికెన్ షిక్ కభాబ్

 

 

 

కావలసినవి:
చికెన్‌: 500 గ్రాములు
అల్లం: 1/2 ముక్క
యాలకలు: 4,
దాల్చిన చెక్క: 1/2
ఉప్పు: రుచికి సరిపడా
జీలకర్ర: 1 స్పూన్లు 
లవంగాలు: 4
నూనె: 1 చెంచాడు
పచ్చిమిర్చి: 4
పుదీనా: 1 కట్ట
కొత్తిమీర ఆకులు: 1 
నెయ్యి: 2 స్పూన్లు
ఉల్లిపాయ: 1 
వెల్లుల్లి: 5 పాయలు
కారం: 1 స్పూన్
శెనగపిండి: 2 స్పూన్లు 

 

తయారు చేయు విధానం:
ముందుగా స్టౌ మీద పాన్‌ పెట్టి, సన్నని మంట మీద ఉల్లిపాయ ముక్కలను వేసి వేయించుకోవాలి. తర్వాత చల్లారనివ్వాలి. ఉల్లిపాయ ముక్కలు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి, అల్లం, వెల్లుల్లి, పచ్చిమిర్చి కూడా వేసి మెత్తగా పేస్ట్‌ చేసుకోవాలి. తరువాత యాలకులు, దాల్చినచెక్క, లవంగాలు, జీలకర్ర, ఇవన్నీ పాన్‌లో వేసి సన్నని మంట మీద వేయించి పెట్టుకోవాలి. ఈ మసాలా దినుసులు చల్లారిన తర్వాత మిక్సీలో వేసి పొడి చేసుకొని  ఉల్లిపాయ పేస్ట్‌లో కలుపుకోవాలి. ఈ మిశ్రమాన్ని శుభ్రం చేసిపెట్టుకొన్న చికెన్‌ ముక్కల్లో వేసి కలుపాలి. అలాగే ఉప్పు, నెయ్యి, కారం,  పుదీనా,కొత్తిమీర తరుగు కూడా వేసి బాగా కలిపి పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు రెండు చెంచాల శెనగపిండి కూడా చికెన్‌ మిశ్రమంలో వేసి బాగా కలుపుకోవాలి. ఈ అన్నీ కలిపి పెట్టుకొన్న చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి రెండు గంటలు ఉంచాలి. వండేందుకు ముందు ఫ్రిజ్‌లో నుండి బయటకు తీసి పక్కన పెట్టుకోవాలి. తర్వాత చికెన్‌ ముక్కలను ఉన్న గిన్నెలోనే చికెన్‌ మద్యలో ఖాళీ ప్రదేశం ఉండేలా గిన్నెలో రౌండ్‌గా సర్దుకోవాలి. ఖాలీగా ఉన్న ఆ ప్రదేశంలో బాగా కాలుతున్న బొగ్గుముక్కలను వుంచాలి. దాంతోనే కబాబ్స్‌కు మంచి వాసన వస్తుంది. అరగంట తర్వాత కాలిన చికెన్‌ ముక్కలను ఒక ఇనుప కడితో గుచ్చి పైకి తీసుకొని, బొగ్గులను ఆర్పేయాలి. ఇప్పుడు ఆ కడ్డీకున్న చికెన్‌ ముక్కలకు కొద్దిగా నెయ్యి రాయాలి. ఈ చికెన్‌ గుచ్చిన షీకర్స్‌ను మైక్రోవోవెన్‌లో పెట్టి 30-60 డిగ్రీ ఉష్ణోగ్రతలో బేక్‌ చేయాలి. ఈ షీకర్స్‌ తిరుగుతుండేలా చూసుకోవాలి. అప్పుడే చికెన్‌ అన్నివైపులా బాగా ఫ్రై అవుతుంది. బాగా బేక్‌ అయిన తర్వాత వొవెన్‌ ఆఫ్‌ చేసి పది నిముషాల తర్వాత బయటకు తీసి సర్వింగ్ ప్లేట్  లో పెట్టి గార్నిష్ చేసుకోవాలి. అంతే చికెన్‌ షీక్‌ కబాబ్‌ రెడీ.

 

 

 


Related Recipes

Non-Vegetarian

చిల్లీ చికెన్

Non-Vegetarian

చికెన్ సుక్కా

Non-Vegetarian

పెప్పర్ చికెన్ గ్రేవీ!

Non-Vegetarian

బ్రోకలీ 65 రెసిపి

Non-Vegetarian

చెట్టినాడ్ చికెన్ బిర్యానీ

Non-Vegetarian

Kaju Chicken Fry

Non-Vegetarian

Stir Fried Chicken with Vegetables

Non-Vegetarian

Chicken Chermoula