Home » Non-Vegetarian » Chicken Fry Recipe
చికెన్ ఫ్రై రెసిపి
కావలసినవి:
చికెన్ - అర కేజీ
అల్లం వెల్లుల్లి పేస్ట్ - మూడు స్పూన్లు
ఉప్పు - తగినంత
ఉల్లిపాయలు - 4
టమాటాలు - రెండు
నూనె - సరిపడా
ధనియాలు - రెండు స్పూన్లు
అనాసపువ్వు - ఒకటి
మరాఠీ మొగ్గ - ఒకటి
జీలకర్ర - 1/2 టీ స్పూన్
ఎండుమిర్చి - ఆరు
మిరియాలు - అర టీ స్పూన్
కరివేపాకు - కొద్దిగా
కొత్తిమీర - ఒక కట్ట
తయారు చేసే విధానం:
ముందుగా చికెన్ కడిగి అందులో ఉప్పు,పసుపు వేసి కలిపి కొద్దిసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు మసాలా దినుసులు అన్నిటిని తీసుకుని కొద్దిగా ఫ్రై చేసి మిక్సిలో వేసి మెత్తగా పేస్ట్ చేసి పెట్టుకోవాలి . పేస్ట్ నూ రెండు సగాలు చేసి పెట్టుకుని ఒక సగం చికెన్ లో వేసుకుని కుక్కర్ ఉడికించుకోవాలి .(విజిల్ తీసిన తరువాత నీరు లేకుండా మొత్తం ఇంకిపోయేలా ఒకసారి స్టవ్ పైన ఉంచాలి) ఇప్పుడు స్టవ్ వెలిగించుకుని పాన్ లో ఆయిల్ వేసి చికెన్ ముక్కల్నివేయించి తీసి ప్లేట్ లో పెట్టుకోవాలి.అదే పాన్ లో ఉల్లిపాయముక్కలు,అల్లంవెల్లుల్లి పేస్ట్,మిగిలిన మసాలా పేస్ట్ వేసి వేయించుకుని ఐదు నిముషాలు వేగాక టమాటా ముక్కలు కూడా వేసి కొంచం మగ్గనివ్వాలి. ఇప్పుడు వేయించి పెట్టుకున్న చికెన్ ముక్కలు కూడా వేసి బాగా ఫ్రై గా అయ్యేవరకు వేయించి సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుని కరివేపాకు కొత్తిమీర తో అలంకరించుకోవాలి.. అంతే టేస్టీ చికెన్ ఫ్రై రెడీ...