Home » Sweets N Deserts » Carrot Burfi Recipe


 

 

క్యారెట్ బర్ఫీ రెసిపి

 

 

కావలసిన పదార్థాలు :

పచ్చికోవా : పావు కేజీ

క్యారెట్లు: అర కేజీ

పాలు: అర లీటర్.

జీడిపప్పు: 30 గ్రాములు .

పంచదార: 350 గ్రాములు .

నెయ్యి: 50 గ్రాములు .

 

తయారీ విధానం :

క్యారెట్‌ను సన్నగా తురుముకోవాలి.

ఒక గిన్నేలో పాలు ,క్యారెట్ తురుము కలిపి ఉడికించాలి.

పాలు పూ ర్తిగా ఇగిరిపోయాక అందులో నెయ్యి వేసి కాసేపు కలపాలి.

తరువాత పంచదార వేసి మరికాసేపు ఉడకనివ్వాలి. ఇలా ఉడికించగా అందులో పాకం వస్తుంది.

ఈ పాకం కొంచం దగ్గరికి వచ్చాక కోవాను పొడిగా చేసి పైన వెయ్యాలి .

తరువాత అది బాగా దగ్గరికి వచ్చి ముద్దలా అయ్యాక దించేయాలి.

ఇప్పుడు ప్లేట్ కి నెయ్యి రాసి క్యారెట్ బర్ఫిని అందులో వేసి జీడిపప్పు తో అలంకరించుకుంటే

టేస్టీ & హెల్తీ క్యారెట్ బర్ఫీ రెడీ....

 


Related Recipes

Sweets N Deserts

బనానా బర్ఫీ

Sweets N Deserts

కొబ్బరి, బెల్లంతో బర్ఫీ

Sweets N Deserts

క్యారెట్ హల్వా

Sweets N Deserts

కోవా నువ్వుల లడ్డు

Sweets N Deserts

Carrot Halwa

Sweets N Deserts

Coconut Slice Cake Indian

Sweets N Deserts

Special Chocolate Mawa for this Diwali

Sweets N Deserts

Coconut Buns