Home » Vegetarian » బీట్ రూట్ కొబ్బరి కూర!


బీట్ రూట్ కొబ్బరి కూర! 

 

 

కావలసిన పదార్ధాలు :

* కొబ్బరి కోరు-1/2 కప్పు 

* పోపు కొరకు-ఎండు మిర్చి, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, కరివేపాకు, ఇంగువ , 

 

* పసుపు-1/4 స్పూన్ 

* ఉప్పు-1/2 స్పూన్ 

* చాట్ మసాలా-1/4 స్పూన్ 

* నూనె-కొద్దిగా 

* నిమ్మరసం-2 స్పూన్ 

తయరుచేసుకునే విధానం :

* ముందుగా దుంపల తోక్కతిసి చిన్నపాటి క్యూబ్ గా తరుగుకోవాలి. కొబ్బరి కోరు సిద్ధంగా ఉంచుకోవాలి.

* ఇప్పుడు ఓ దళసరి గిన్నెలో కొద్దిగా నీరు తీసుకొని అందులో బీట్ రూట్ ముక్కలు వేసి మూతపెట్టి చిన్న మంటపై  8 నుండి 10 నిమిషాలు ఉడికించుకోవాలి. 

* తరువాత పాన్ పెట్టుకుని అందులో కొద్దిగా నూనె వేసి వేడిఎక్కివెంటనే  మినపప్పు , ఆవాలు, పచ్చిమిర్చి, జీలకర్ర, ఎండుమిర్చి, ఇంగువ చివరగా కరివేపాకు వేసి.. పోపు దోరగా వేగే సమయంలో కొబ్బరి కోరువేసి కొద్దిగా వేయించాలి. మరీ ఎక్కువగా వేయిస్తే కొబ్బరి కమ్మదనం పోయి పీచుగామారుతుంది. 

*కొబ్బటి  తాజా సువాసనగా ఉండగా ఉడికి ఉమ్మగిల్లిన రూట్ ముక్కల్ని వేసి ఉప్పు, పసుపు జోడించాలి. 

*చిన్న మంటపై  మూతపెట్టి  2,3 నిమిషాలు ఉంచి స్టవ్ ఆఫ్ చేసి.. కూరలో చాట్ మసాలా చల్లి నిమ్మరసం పై నుండి పోస్తూ కలపాలి. చాలా చాలా రుచిగా తియ్యగా, కమ్మగా మధ్యలో పులుపు తగులుతూ ఈ కూరని అలాగే తినేయ్యచు ....వేడి అన్నంలో రోటితో చాలా బావుంటుంది. 

 


Related Recipes

Vegetarian

పెరుగు బెండకాయ మసాలా కర్రీ

Vegetarian

మస్త్ మస్త్ మలై పన్నీర్ కర్రీ

Vegetarian

పాలక్ పరోటా

Vegetarian

Kaju Mushroom Masala Recipe

Vegetarian

Aloo Vankaya Curry

Vegetarian

How to Make Caesar Salad Veg

Vegetarian

Healthy and delicious Veg Hakka Noodles

Vegetarian

How to Make Tomato and Basil Sauce with Vegetables