Home » Others » Ariselu - Sankranthi Special


 

 

 

అరిసెలు - సంక్రాతి స్పెషల్

 

 

 

కావలసిన పదార్ధాలు :

 

బియ్యం - 1 కిలో

బెల్లం - ముప్పావు కిలో

నూనె - అరిసెలు వేయించుకోటానికి సరిపడా

నువ్వులు - 50 గ్రాములు

యాలకులు -  4

 

 

తయారు చేసే విధానము:


అరిసెలు చెయ్యడానికి ఒక రోజు ముందు రాత్రి బియ్యం నాన బెట్టుకోవాలి. మరుసటి రోజు అరిసెలు చేసుకొనే ముందు బియ్యం లో నీరు అంతా తీసేసి కాసేపు పక్కన పెట్టుకోవాలి.నీరు అంతా పోయేవరకు ఉంచాలి , కాని బియ్యం మాత్రం కొంచెం తడిగానే ఉండాలి.

 

ఇప్పుడు బియ్యాన్ని మిక్సీ లో వేసి బాగా గ్రైండ్ చేసుకొని తరువాత జల్లించు కోవాలి. జల్లించిన పిండి ఆరిపోకుండా పిండి అంతా ఒక దెగ్గరకు తీసి నొక్కుతూ ఉండాలి.

 

ఇప్పుడు ఒక దళసరి గిన్నెలో బెల్లం తీసుకొని అది మునిగే వరకు నీరు పోసి గ్యాస్ మీద పెట్టాలి. ఒక ప్లేట్ లో నీరు పోసుకొని పక్కన పెట్టుకుంటే పాకం వచ్చిందో లేదో అందులో వేసి చూసుకోవచ్చు.

 

బెల్లం పాకం దగ్గర పడుతుంటే కొంచెం పాకం తీసి మనం పెట్టు కున్న ప్లేట్ లో వేసి చూసుకోవాలి. అది ఉండ చేసేలాగా దగ్గరకి వస్తుంటే దోరగా వేయించి పెట్టుకున్న నువ్వులు, యాలకులపొడి, బియ్యంపిండి వేసి ఉండకట్టకుండా కలిపి కొంచెం జారుగా ఉండేలా చూసుకుని  గ్యాస్ కట్టెయ్యాలి. (అరిసెలు గట్టిగా కావాలి అనుకునే వాళ్ళు కొంచెం ముదురు పాకం పట్టుకోవాలి.)

 

ఇప్పుడు గ్యాస్ మీద ఒక బాణీ పెట్టి నూనె పోసి కాగనివ్వాలి. ఒక ప్లాస్టిక్ పేపర్ కాని అరటి ఆకు కానీ తీసుకొని , దానికి కొంచెం నూనె రాసి , కొంచెం పిండి తీసుకొని గుండ్రంగా చేత్తో మనకు కావలసిన అంత సైజులో అరిసెలు వత్తుకోవాలి. ఇప్పుడు వాటిని నూనెలో వేయించు కోవాలి.

 

తరువాత వాటికి ఉన్న నూనెను అంతా తీసేయ్యటానికి ఒక పరికరం ఉంటుంది. ఒకవేళ అదిలేకపోయినా రెండు దళసరి గరిటెల మధ్య వేగిన అరిసెను పెట్టి గట్టిగా నొక్కాలి. పేపర్ మీద వేసి చల్లారాక డబ్బాలో పెట్టుకోవాలి. అంతే...నోరూరించే అరిసెలు తయారు.

 

- Vissa Nagamani


Related Recipes

Others

Paneer Tikka

Others

Roasted Pepper and Tomato Soup Recipe

Others

కఠోరి చాట్ తయారుచేయు విధానం

Others

స్వీట్ కట్టర్ పానీ పూరి

Others

సజ్జప్పాలు

Others

Pea Salad

Others

Janthikalu (Mothers Day Special Recipes)

Others

Bobbarla Vada - Sankranti Special