Home » Others » వైభవంగా బెజవాడ కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ


ఇంద్రకీలాదిపై కొలువై ఉన్న కనకదుర్గమ్మ గిరి ప్రదక్షిణ బుధవారం (నవంబర్ 5) తెల్లవారు జామును అత్యంత వైభవంగా జరిగింది. కార్తీకపౌర్ణమి సందర్భంగా జరిగిన ఈ గిరి ప్రదక్షిణకు ముందు ఆలయ ఈవో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం సంప్రదాయ  కళా ప్రదర్శనలతో ఆధ్యాత్మిక వాతావరణంలో వేలాది మంది భక్తులతో గిరిప్రదక్షిణ జరిగింది.

ఈ గిరి ప్రదక్షిణలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు.  తెల్లవారు జామునే వేలాది మంది భక్తులు అమ్మవారి గిరిప్రదక్షిణలో పాల్గొని అమ్మవారిని దర్శించుకున్నారు.  కార్తీక పౌర్ణమి రోజున ఇంద్రకీలాద్రి చుట్టూ గిరి ప్రదక్షిణ చేయడం వల్ల కోరికలు నెరవేరి, సుఖసంతోషాలు కలుగుతాయన్నది భక్తుల విశ్వాసం.