Home » Latest News »  తిరుమలలో భక్తుల రద్దీ సాధారణం


తిరుమలలో భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. బుధవారం (జనవరి 29) ఉదయం శ్రీవారి దర్శనం కోసం భక్తులు క్యూ కాంప్లెక్స్ లో వేచి ఉండాల్సిన అవసరం లేకుండా నేరుగా అనుమతిస్తున్నారు. టోకెన్లు లేని భక్తులకు శ్రీవారి సర్వదర్శనానికి ఎనిమిది గంటల సమయం పడుతోంది.

ఇక మంగళవారం శ్రీవారిని మొత్తం 70 వేల 610 మంది దర్శించుకున్నారు. వారిలో 17 వేల 310 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. శ్రీవారి హుండీ కానుకల ఆదాయం 3 కోట్ల 78 లక్షల రూపాయలు వచ్చింది.