చెమట పట్టినా మేకప్ గంటల తరబడి చెక్కుచెదరకూడదంటే.. ఈ చిట్కాలు పాటించండి!

వేసవి కాలంలో వేడి అమ్మాయిలను ఎంతో ఇబ్బంది పెడుతుంది. ముఖ్యంగా మేకప్ వేసుకోవడం, ఫ్యాసన్ దుస్తులు ధరించడం, స్టైల్ గా రెఢీ అవ్వడం వంటివి అమ్మాయిల సహనానికి పరీక్షలు పెడతాయి. అన్నింటి కంటే ముఖ్యంగా నేటికాలంలో మేకప్ లేకుండా బయటకు అస్సలు వెళ్లడం లేదు. ఒకవేళ మేకప్ వేసుకుని వెళితే.. ఎండ, చెమట కారణంగా మేకప్ చెదిరిపోవడం, చర్మం జిడ్డుగా మారడం వల్ల మేకప్ గడ్డలుగా మారడం, మచ్చలుగా కనిపించడం వంటివి జరుగుతాయి. కానీ చెమట పట్టని సరైన మేకప్‌ను ఉపయోగించడం ద్వారా మేకప్ వేసుకున్న తర్వాత గంటల తరబడి మేకప్ తాజాగా, అప్పుడే వేసుకున్నట్టు కొత్తగా, కాంతివంతంగా ఉంటుంది. ఆ టిప్స్ ఏంటో తెలుసుకుంటే..
చెమట కారణంగా వేసవిలో మేకప్ చెదరకుండా ఉండేందుకు సూపర్ టిప్స్..
చర్మాన్ని సరిగ్గా శుభ్రం చేయాలి..
మేకప్ వేసుకునే ముందు ముఖాన్ని డీప్ గా శుభ్రం చేసుకోవాలి. చర్మం తేమగా ఉండేందుకు నూనె లేని మాయిశ్చరైజర్‌ను రాయాలి. ఐస్ క్యూబ్స్‌తో ముఖాన్ని మసాజ్ చేయడం వల్ల చెమట తగ్గుతుంది. సన్‌స్క్రీన్ తప్పకుండా రాయాలి, కానీ తేలికైన, జిడ్డు లేని దానిని ఎంచుకోవాలి.
ప్రైమర్..
చెమట పట్టని మేకప్ కోసం, మ్యాట్ ప్రైమర్‌ను అప్లై చేయాలి. ఇది ముఖంపై ఉండే చర్మ రంధ్రాలను మసకబరుస్తుంది , నూనెను నియంత్రిస్తుంది. ముఖ్యంగా టి-జోన్ ప్రాంతంలో ప్రైమర్ అప్లై చేయడం వల్ల మేకప్ ఎక్కువసేపు నిలిచి ఉంటుంది. సిలికాన్ ఆధారిత ప్రైమర్లు వేసవిలో మెరుగైన ఫలితాలను ఇస్తాయి.
లైట్ మేకప్..
వేసవిలో మందపాటి ఫౌండేషన్ త్వరగా కరిగిపోతుంది. బిబి క్రీమ్, స్కిన్ టింట్ లేదా తేలికపాటి మ్యాట్ ఫౌండేషన్‌ను ఎంచుకోవాలి. బ్యూటీ బ్లెండర్‌తో అద్దుతూ మేకప్ వేసుకోవాలి. అతిగా లేయరింగ్ చేయడం వల్ల ముఖం మేకప్ మెత్తినట్టు, చాలా ఎబ్బెట్టుగా కనిపించవచ్చు.
వాటర్ ప్రూఫ్..
వాటర్‌ప్రూఫ్ కాజల్, మస్కారా , ఐలైనర్‌ను ఎంచుకోవాలి. .క్రీమ్ బ్లష్‌కు బదులుగా పౌడర్ బ్లష్ వాడాలి. వేసవిలో మ్యాట్ లిప్‌స్టిక్ ఎక్కువసేపు ఉంటుంది. ఎక్కువసేపు నిలిచే మేకప్ ఉత్పత్తులు చెమట పట్టినా కూడా చెదరవు.
సెట్టింగ్ స్ప్రే.. బ్లాటింగ్ పేపర్..
మేకప్ పూర్తి చేసిన తర్వాత, సెట్టింగ్ స్ప్రేను అప్లై చేయాలి. ఇది మేకప్‌ను చెక్కుచెదరకుండా ఉంచి, చాలా సేపటి వరకు తాజాగా కనిపించేలా చేస్తుంది. అలాగే చెమట పట్టినప్పుడు, రుద్దడానికి బదులుగా బ్లాటింగ్ పేపర్ ఉపయోగించాలి. ఇది చెమను పీల్చుకుంటుంది. తర్వాత కాంపాక్ట్ పౌడర్‌తో తేలికగా టచ్-అప్ చేయాలి. ఇలా చేస్తే వేసవిలో మేకప్ చెక్కు చెదరకుండా ఎక్కువసేపు నిలిచి ఉంటుంది.
*రూపశ్రీ


