Home » Fashion » హాట్ సమ్మర్ లో కూల్ కలర్స్.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఫ్యాషన్‌గా ఉంటూనే కూల్‌గా కనిపిస్తారు!

హాట్ సమ్మర్ లో కూల్ కలర్స్.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఫ్యాషన్‌గా ఉంటూనే కూల్‌గా కనిపిస్తారు!

హాట్ సమ్మర్ లో కూల్ కలర్స్.. ఈ రంగు దుస్తులు ధరిస్తే ఫ్యాషన్‌గా ఉంటూనే కూల్‌గా కనిపిస్తారు!

 దుస్తుల రంగు  శరీర ఉష్ణోగ్రతను నేరుగా ప్రభావితం చేస్తుందని చాలామందికి తెలియదు. ముదురు రంగులు సూర్యుని వేడిని ఎక్కువగా గ్రహించగా, లేత , మృదువైన రంగులు వేడిని పరావర్తనం చెందించి,  చల్లగా ఉండేలా చేస్తాయి. అందుకే వేసవిలో లేత రంగుల దుస్తులు ధరించమని సిఫార్సు చేస్తారు. కేవలం వేసవి అనే కాదు.. సాధారణ రోజుల్లో కూడా కొందరికి నలుపు రంగులు దుస్తులు ధరిస్తే.. ఒంట్లో బాగోకపోవడం,  శరీరం అసౌకర్యంగా అనిపించడం వెనుక కూడా ఇదే కారణం ఉంటుంది.  ఇకపోతే.. ఈ వేసవి సీజన్‌లో  స్టైలిష్‌గా, చల్లగా ఉండాలనుకుంటే శరీరాన్ని కూల్ గా ఉంచే రంగులను ధరించడం చాలా ముఖ్యం.  అటు ఫ్యాషన్ గా కనిపించేలా చేస్తూనే.. ఇటు శరీరాన్ని కూల్ గా ఉంచే కలర్స్ గురించి తెలుసుకుంటే..

సమ్మర్ లో కూల్ గా ఉంచే రంగులు..

తెలుపు..

తెలుపు వేసవిలో అందరికీ ఇష్టమైన రంగు. ఇది సూర్యకిరణాలను ప్రతిబింబించి శరీరాన్ని చల్లగా ఉంచుతుంది. అంతేకాకుండా, ఇది అన్ని రకాల రంగుల  వారికి అందంగా కనిపిస్తుంది.

లేత నీలం..

లేత నీలం రంగు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండి, వేసవిలో ఉల్లాసకరమైన లుక్  ఇస్తుంది. ఇది ఆఫీసుకు వేసుకోవడానికి అయినా లేదా  సాధారణంగా వేసుకోవడానికి అయినా.. ఇలా రెండింటికీ బాగా నప్పుతుంది.

లేత గులాబీ రంగు..

లేత గులాబీ రంగు చాలా మృదువుగా సాప్ట్ లుక్ ఇస్తుంది.  అంతేకాకుండా చాలా  స్టైలిష్ లుక్ కూడా ఇస్తుంది.  ఇవి సమ్మర్ లో చాలా మంచి లుక్ ఇస్తుంది.   అందువల్ల ఇది బయటకు వెళ్ళడానికి లేదా బ్రంచ్ కోసం ఒక గొప్ప ఎంపిక.

పుదీనా ఆకుపచ్చ లేదా మెంట్ గ్రీన్..

మింట్ గ్రీన్ రంగు ట్రెండీగా ఉండటమే కాకుండా, చల్లదనాన్ని కూడా ఇస్తుంది. ఈ రంగు కళ్ళకు ఆహ్లాదకరంగా ఉండి, వేసవిలో కూలింగ్  అనుభూతిని కలిగిస్తుంది.

నిమ్మ పసుపు..

నిమ్మ పసుపు అనేది ప్రకాశవంతమైన  లేత రంగు, ఇది వేసవిలో ఎనర్జీని,  రిఫ్రెషింగ్ లుక్ ను ఇస్తుంది.

ముఖ్యమైన చిట్కా..

వేసవిలో తేలికైన, కాటన్ వస్త్రాలను ఎంచుకోవడం చాలా ముఖ్యం. పగటిపూట బిగుతుగా ఉండే దుస్తులు , ముదురు రంగులను ధరించడం మానుకోవాలి. వదులుగా ఉన్న లేత రంగు కాటన్ దుస్తులు ధరిస్తే చాలా సౌకర్యవంతంగా ఉంటాయి.

                                  *రూపశ్రీ.

google-banner
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img
vanitha-mob-card-img