వలయాల విలయానికి విరుగుడు

పెరిగిపోతున్న ఒత్తిడి, తగ్గుతున్న నిద్రాసమయం ఫలితంగా కళ్ళ కింద నల్లటి వలయాలు. టీనేజ్ అమ్మాయిల నుంచి అన్ని వయసుల వారిని ఇబ్బంది పెట్టే ఈ నల్లటి వలయాలని కనిపించకుండా చేయడానికి చిన్న చిన్న జాగ్రత్తలు తీసుకుంటే చాలు.

1. మేకప్ వేసుకోవడానికి ముందు ఒక మంచి మాయిశ్చరైజర్ ని కళ్ళ కింద రాయండి. దాని వల్ల ఆ భాగంలో చర్మం తాజాదనాన్ని సంతరించుకుంటుంది.

2. సాధారణంగా మేకప్ వేసుకునే ముందు పౌండేషన్ అప్లై చేస్తారు. నల్లటి వలయాలు ఉన్నవాళ్లు ఫౌండేషన్ కంటే ముందు కంటి కింద ప్రైమర్ అప్లై చేస్తే చాలు. అది నలుపుదనం కనిపించకుండా చేస్తుంది.

3. ఇక నల్లటి వలయాలు ఎక్కువగా ఉన్నప్పుడు చాలా తక్కువ మేకప్ వేసుకోవాలి. ఎందుకంటే ఎంత ఎక్కువ మేకప్ వేసుకుంటే, కాసేపటికి అంత ఎక్కువగా ఆ నల్లటి వలయాలు బయటపడతాయి.

4. కన్సీలర్ వాడే అలవాటు ఉన్నవారు మరీ ముదురు రంగులో ఉన్న దానిని కాకుండా స్కిన్ టోన్ కు సరిపడే రంగుకి దగ్గరగా ఉండే బూడిద రంగులోది వాడటం మంచిది. ముదురు రంగు మరింతగా నల్లటి వలయాలు కనిపించేలా చేస్తుంది. ఇంకా చెప్పాలంటే మీరు వాడే ఫౌండేషన్ కంటే ఓ రెండు షేడ్లు లైట్ గా ఉండాలి మీ కన్సీలర్. అలాగే కళ్ళ కింద మేకప్ ప్యాచులాగా కనిపించ కూడదంటే క్రీమ్ లో ఉండే దానిని వాడండి. దానిని చాలా నెమ్మదిగా కళ్ళకింద వలయాలపై అద్దండి.

5. అలాగే మేకప్ తీసాకా చల్లటి నీటిలో ముంచిన మేత్తని వస్త్రాన్ని ఓ పదినిమిషాలు కళ్ళమీద పెట్టుకుంటే మంచిది.



-రమ