Home » Articles » స్పూర్తి

 

స్పూర్తి

 

 

అమ్మాయని తెలిస్తే.....


కడుపులో నలుసుగా ఉండగానే... ఊపిరి తీసే దేశంలో,


ఖర్మ కాలి భూమ్మీద పడ్డ పాపానికి ముళ్ళ పొదలు పాలు అయ్యే దేశంలో,


రోజుల ఆడపిల్ల ప్రాణం ఉండగానే కుక్కలు పీక్కుతిన్న వార్తలు చదివే మనదేశంలో,


ఒక చోట మాత్రం అమ్మాయి పుడితే పండగ చేసుకుంటారు. కూతురు లేకపోతే

 

దత్తత తీసుకుంటారు. అక్కడ మహిళలదే రాజ్యం. ఆర్థికంగా, సామాజికంగా

 

మహిళలదే పై చేయి. ఆ ప్రాంతం ఎక్కడో లేదు మన భారతదేశంలోనే ఉంది.

 

ఈశానీ భారతంలోని మేఘాలయ...

 

 

జనాభాలో మూడోవంతు జనాభా ఖాసీ తెగకి చెందిన వారు. ఈ తెగ లో ఇప్పటికీ


మాతృస్వామ్యవ్యవస్థ వుంది. ఇక్కడ మగవాళ్ళకి హక్కులుండవు. బాధ్యత

 

లుండవు. ఆస్తులుండవు. అధికారాలు అసలే వుండవు. పిల్లలందరికీ తల్లి ఇంటి

 

పేరే వస్తుంది. ఇతర ప్రాంతాలలోని మహిళలలాగే ఇక్కడి మహిళలూ వంటా

 

వార్పూ, పిల్లల పెంపకం. అన్నిట్లో తన పాత్రకి తగ్గట్టు ఇమిడిపోతారు. వాటితో

 

పాటు కుటుంబ పోషణా, ఆర్ధికవ్యవహారాలూ వంటి వాటిల్లో చురుగ్గా పాల్గొంటారు.

 

వింటుంటే ఆశ్చర్యంగా, ఆనందంగా ఉంది కదా. మగవారికి హక్కులు లేకుండా

 

ఉండాలన్నది మన అభిమతం.

 

కాదు.... కాని, మహిళ హక్కులకీ రక్షణ ఉండాలన్నదే మన ఆకాంక్ష.

 

హక్కులకోసం మహిళలు నినాదించాల్సిన అవసరం లేని రోజు రావాలని

 

ఆకాంక్షిద్దాం.


తెలుగుఒన్ డాట్ కామ్.