Home » Articles » గెలిచి నిలిచారు

 

గెలిచి నిలిచారు 

 

 

అనుకూలించని పరిస్థితులకి ఎదురునిలిచి కావాల్సిన జీవితాన్ని స్వంతం 

చేసుకోవటమంటే ఎలా వుంటుందో చూడాలంటే...., తను నిలబడగలదో లేదో అని

ప్రపంచం అనుకునే లోపే తన చేతి ఆసరాతో మరెందరినో నిలబెట్టి గర్వంగా తలెత్తి

నుంచోవటం ఎలా ఉంటుందో చూడాలంటే   జానకీ, నసీమా, బీనాకలింది....

గురించి తెలుసుకోవాలి.

 


జానకి

 


 

మాట్లాడలేదు, వినలేదు...అయితేనేం ఎందరికో దారి చూపిస్తోంది.

 

పీపుల్ విత్ హియరింగ్ ఇంపేర్డ్ నెట్ వర్క్... ప్రెసిడెంట్ గా ఎందరో ఫిజికల్లీ 

ఛాలెంజ్డ్ కి ఎన్నో అంశాల్లో ట్రైనింగ్ ఇప్పించి వారికి మంచి మంచి

సంస్థలలో  ఉద్యోగాలు వచ్చేలా చూస్తోంది.


నిలబడటం అంటే "తను" మాత్రమే నిలబడటం కాదు. తన చేతి

ఆసరాతో  వీలయినంత మందిని నిలబెట్టడం" అని అనిపిస్తుంది జానకీని చూస్తే.


 

 నసీమా

 

 

 

బీహార్ లోని ముజఫర్ కి చెందిన నసీమా "యస్... నేను రెడ్ లైట్ ఏరియా అమ్మాయిని"

అని గర్వంగా చెప్పుకుంటుంది. కారణం రెడ్ లైట్ ఏరియాలో పుట్టిన నసీమా ఆ జీవితం

తనకి వద్దు అనుకుని....తనతో పాటు తన వారందరి జీవితాలలో మార్పు

రావాలనుకుంది.


"పర్చయ్" అనే స్వచ్చంధ సంస్థను స్థాపించింది. వీధివీధినా, ఇంటింటికీ తిరిగి అందర్నీ

చైతన్యవంతుల్ని చేసింది. ఇప్పుడు అక్కడి పిల్లలందరూ చదువుకుంటున్నారు

ఉద్యోగాలు చేస్తున్నారు.


మహిళలు స్వశక్తి పై ఆధారపడి జీవిస్తున్నారు. దగ్గరదగ్గరగా 24 జిల్లాలో

పర్చయ్ విస్తరించింది. సెక్స్ వర్కర్లూ గౌరవప్రదమైన జీవితాన్ని గడపాలి అన్న

నసీమా నినాదం దేశమంతా వ్యాపిస్తోంది. పరిస్థితులకు తల

ఒంచక..ఎదురొడ్డి...నిలవాలి.  అప్పుడే మన జీవితం మన స్వంతమవుతుంది

అనిపిస్తుంది నసీమాని చూస్తే.


 

 బీనాకలింది

 

 

 

వెస్ట్ బెంగాళ్ కి చెందిన ఈ అమ్మాయి పద్నాలుగేళ్ళ వయసులో

తరతరాలుగా వస్తున్న ఊరి ఆచారాన్ని ఎదిరించి నిలిచింది. అంతేకాకుండా...

ఊరివారందరిలో చైతన్యం తేవటానికి ప్రయత్నించింది.


బాల్యవివాహాలు అమ్మాయిల ఆరోగ్యాన్ని, జీవితాన్ని ఎలా

నాశానం చేస్తున్నాయో అందరికీ అర్థమయ్యేలా వివరించింది. వినకుండా

ఎవరైనా బలవంతంగా బాల్యవివాహం చేయటానికి ప్రయత్నిస్తే పోలీసులను

పిలుస్తుంది.

 

ఎన్నో స్వచ్చంధ సంస్థలు, జాతీయ, అంతర్జాతీయ సంస్థలు

బీనాకలింది ఆశయానికి మేమున్నామని మద్దతు కూడా పలికాయి.


చిన్న వయసులో... తరాల నాటి కట్టు బాటుని ధిక్కరించే ధైర్యం

చేసిన బీనాకలింది, మనకి ఎదిరించి, తలెత్తి నిలుచోవటంలోని గొప్పదన్నాన్ని

రుచి చూపిస్తోంది కదా.


 

వీళ్ళేనా....?

కాదు ఇంకా ఎందరో మహిళలు  తాము నడుస్తూ పక్క వారికి దారి చూపిస్తూ

ఆత్మవిశ్వాసం, ధైర్యం, తెగింపుల కలయికగా మనకి కనిపిస్తారు.

 

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్బంగా వారందరికీ  "తెలుగు ఒన్"

హ్యాట్సాఫ్ చెబుతోంది.


"రమ ఇరగవరపు"