Home » Baby Care » ఎపిసోడ్ -14


    ఫ్లైట్ టేకాఫ్ అయింది.

 

                            *    *    *    *    *

 

    మహతి హైదరాబాద్ లో దిగింది.

 

    టాక్సీలో ఇంటికి బయలుదేరింది.

 

    ఆమె వస్తున్నట్లు రాజేంద్రప్రసాద్ కి కూడా తెలీదు. తను ఒక వెంచర్ లో సక్సెస్ అయిన సంఘటన తాలూకు ఆనందం ఆమెను వివశురాల్ని చేస్తోంది.

 

    కానామెకు తెలీదు- తను ఎవరినయితే ఫూల్ ని చేసిందో- అతని వెనుక మేధావి అయిన వ్యాపారి వున్నట్లు, ఆయన అలాంటి నష్టాల నెన్నింటినో చూసి వున్నాడని మహతికి తెలీదు.

 

    కొన్ని విషయాలు అలా తెలీకుండా వుండబట్టే జీవితాలు, సంఘటనలు నాటకీయతను జోడించుకొని కొత్త మలుపులకి హేతువులవుతాయని తెలియటానికి ఆమెకెంత వయస్సుందని?

 

                            *    *    *    *    *

 

    "వేరొకరికి కాకుండా వుండాలంటే అదొక్కటే మార్గం-" అన్నాడు మూర్తి.

 

    ఇతరులు క్షోభపడుతుంటే, జీవితాన్ని ఫణంగా పెట్టుకుంటే చూసి ఆనందించే మూర్తి ఆరోజు ఉదయమే మధుకర్ బెడ్ రూమ్లో చేరి రెచ్చగొట్టటం ఆరంభించాడు.

 

    మధుకర్ కి ఎందుకో ఆ పని చేయాలని అనిపించటంలేదు.

 

    "రేప్ చేసి స్వంతం చేసుకోవటం అమానుషం కాదా?"

 

    మధుకర్ అమాయకంగా ప్రశ్నిస్తుంటే మూర్తి లోలోనే నవ్వుకున్నాడు.

 

    "పిచ్చివాడా! ఎవ్విరిథింగ్ ఇన్ దిస్ వరల్డ్ ఈజ్ ఏ ట్రాన్సాక్షన్! ఇట్స్ ఆల్ ఇన్ ది గేమ్! నీకేం తక్కువయిందని నిన్ను కాదంది? అందమా? చదువా? ఆరోగ్యమా? ఆస్తా? సోషల్ స్టేటసా? ఏది తక్కువని? నీకేదీ తక్కువ కాదు. తనకి పొగరెక్కువ గనుక మరా పొగరుని దించేస్తే ఒక పనయినట్లుంటుంది. ఇప్పటివరకు ఆమె వర్జిన్. ఆమె పొగరు ఆమె వర్జినిటీతో ముడిపడి వుంది. దాన్ని దించేసావనుకో-

 

    అసలు నీకో విషయం తెలుసా?

 

    స్టేట్స్ లో టెక్సాస్ బిలియనీర్స్ సూత్రమేమిటో తెలుసా? నీకు నచ్చినమ్మాయిని స్క్రూచేసి వదిలేయ్! నో ప్రాబ్లమ్! డబ్బు వెదజల్లు! నో ప్రాబ్లమ్! బట్ డోంట్ డెవలప్ ఎటాచ్ మెంట్స్ అని వాళ్ళు వయసొచ్చిన వాళ్ళ పిల్లలకు చెబుతారట! ఫ్యూర్ ప్రొఫెషనల్ బిజీమెన్ ఆలోచనా సరళే అలా వుండాలి. డోంట్ హెజిటేట్ టు లిక్విడేట్ హర్ వర్జినిటీ! పథకం సిద్ధం చేశాను. ఎవరూ లేని ఒంటరి ప్రపంచానికి ఆమె వచ్చేలా చేస్తాను. అహం జ్వరం ఆమె అద్భుతమైన, అందమైన దేహాన్ని దహించి వేస్తోంది. మరి నువ్వొక వైద్యుడిలా మారాలి గదా?" మూర్తి పొయ్యిని మరింత రాజేస్తున్నాడు.

 

    స్వతహాగానో, జన్మతహః వచ్చిన సంస్కారమో తెలీదు. మూర్తి ప్రపోజల్ కి మధుకర్ మనస్సు పూర్తిగా అంగీకరించడంలేదు.

 

    వైట్ పర్సనాలిటీ...

 

    మంచి పనులే చేయాలి. నలుగురితో మంచనిపించుకొమ్మని ఉత్తేజపరుస్తుంది.

 

    బ్లాక్ పర్సనాలిటీ...

 

    చెడ్డపనులు చేసి- కసి, పగ తీర్చుకోమంటుంది. ఇతరుల్ని హింసించి శాంతపడమంటుంది.

 

    మల్టిపుల్ పర్సనాలిటీ-

 

    అందరూ చూస్తుండగా మంచిచేసి- చూడనప్పుడు చెడు చేసి రెండు రకాలుగా శాంతిస్తుంది. ప్రపంచంలో ఏ వ్యక్తిలోనైనా ఈ మూడు రకాల పర్సనాలిటీలే వుంటాయి.

 

    మూర్తిది మల్టిపుల్ పర్సనాలిటీ అయితే, మధుకర్ ది వైట్ పర్సనాలిటీ.

 

    మొగలి పొదల వెనుక దాగివుండే మిన్నాగు లాంటివాడు మూర్తి.

 

    ఎంతసేపని మిన్నాగు ప్రభావానికి లోనుకాకుండా వుంటాడు మధుకర్! అతని ప్రేరణ మొగలి రేకుల సుగంధాన్ని వెదజల్లుతుంటే ఆఘ్రాణించకుండా వుండగలడా?

 

    "నాకెందుకోరా అలా చేయాలంటే మనస్సంగీకరించటం లేదు. నేనేం చేసినా మానాన్నగారు బాధపడరు. పట్టించుకోరు. అలా అని ఒకమ్మాయిని మానభంగం చేయటం... నాలో మా నాన్న తన నాన్నని చూసుకుంటారు. మా తాతగారు నైతిక విలువల కోసం ప్రాణాలైనా ఇచ్చేందుకు సిద్ధపడేవారట. పోనీ... ఆ అమ్మాయిని ఏడిపిద్దామా? ఒక పని చేద్దాం..." అన్నాడు మధుకర్ ఎంతో మధనపడిపోతూ....   

 

    "ఏమిటది?" మూర్తి చటుక్కున అడిగాడు.

 

    "మహతి నాకు తప్ప మరొకరికి దక్కకూడదు. అదేకదా ప్రధానోద్దేశం."

 

    "ఎస్... ఆఫ్ కోర్స్."

 

    "మహతి వేరే వ్యక్తిని పెళ్ళి చేసుకోకుండా చేసేస్తే?"

 

    "నాకర్థం కాలేదు."

 

    "వచ్చే సంబంధాలు రాకుండా అడ్డుకుంటే?"

 

    "ఆమె ఒక అద్భుతమైన అందగత్తె - సాలార్ జంగ్ మ్యూజియమ్ లోని పాలరాతి విగ్రహానికి ఊపిరిపోస్తే అది మహాతిగా మారింది. ఆస్తిపాస్తులున్నాయి. చూస్తూ చూస్తూ నువ్వే ముప్ఫై లక్షలు ఇచ్చావు. సో... ఆమె యిప్పుడు లక్షాధికారి. చదువుంది. తెలివితేటలున్నాయి. శీలం లేదని తెలిసీ డబ్బుకోసం సినిమా ఆర్టిస్టుల్ని పెళ్ళి చేసుకునేందుకు లక్షల్లో యువకులు సిద్ధంగా వున్నారు. అలాంటప్పుడు మహతిమీద మనమెన్ని ప్రచారాలు సృష్టించినా, ఆమెకి చెడుచేసినా కొన్ని వేలమందయినా యువకులు చిరునవ్వుతో, అవన్నీ తెలిసే వచ్చాం. తప్పు లెవరయినా చేస్తారు. వాటిని మన్నించి మనుషులమనిపించుకోవాలి గదా అని రంగంలోకి దిగితే?"

 

    మధుకర్ మౌనంగా వుండిపోయాడు. అప్పటికే మూర్తి మహతిని ఒంటరిని చేసే పథకం తాలూకు పని చాపక్రింద నీరులా జరిగిపోతోంది.

 

    ఇక్కడ మధుకర్ ఒక నిర్ణయం తీసుకోకపోయినా మహతిమీద పన్నినవల బిగుసుకోక ఆగదు.

 

                                *    *    *    *    *

 

    "కేవలం మన వ్యాపారాన్ని పెంచటానికి ఆ పని చేశావో, లేక లాభం కోసం ఆ పని చేశావో నాకర్థం కావడం లేదు. ఏది ఏమైనా అది అన్యాయమని నాకనిపిస్తోంది" రాజేంద్రప్రసాద్ డైనింగ్ టేబుల్ ముందు కూర్చొని టీ తీసుకుంటూ అన్నాడు.

 

    మహతి తండ్రివైపు చూసి చిరునవ్వు నవ్వింది.

 

    "నీ చిరునవ్వులో సమాధానాన్ని వెతుక్కొనే శక్తి నాకు లేదు తల్లీ... చెప్పు, ఎందుకలా చేశావు?" రాజేంద్రప్రసాద్ తిరిగి ప్రశ్నించాడు.

 

    "వ్యాపారంలో అవతలి వ్యక్తిని మోసం చేయటం తప్పు కావచ్చు. అతన్ని సర్వనాశనం చేసి మన జేబు నింపుకోవటం అన్యాయం కావచ్చు. వ్యాపారవేత్తకు లౌక్యం వుండాలే కాని అహం కాదని జపాన్ వ్యాపార ప్రపంచపు ప్రథమ సూత్రం. మన బార్ కొచ్చిన వ్యక్తికి మన సర్వీసు నచ్చక క్లైమ్ చేయవచ్చు లేదా మరోసారి మన బార్ కి రానని చెప్పవచ్చు. అంతేకాని బార్ రేటెంత అని అడగటం అహం అంచుని తాకినట్లే గదా? అంతుండకూడదు. అది ఎవరికున్నా దించాల్సిందే- మనిషి మందు తాగటం తప్పో కాదో నేనయితే ఇప్పుడు ఆ మీమాంసకు వెళ్ళలేను కానీ మందే మనిషిని తాగటం తప్పు. తాగి సవాల్ చేయటం అంతకంటే తప్పు. అలాంటి వ్యక్తి తనే మందు తాగాడో- మందే తనని తాగిందో తెలుసుకోవటం చాలా అవసరం- అందుకే అలా చేయవలసి వచ్చింది.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.