Home » Health Science » Tips to help you cope with joint pain after delivery
ప్రసవం తరువాత మహిళల్లో ఎదురయ్యే కీళ్ళ నొప్పులకు అధ్బుతమైన పరిష్కారాలు!

మహిళలకు ప్రసవం చాలా గొప్ప వరం. అమ్మతనాన్ని మహిళలు ఎంతగానో అనుభూతి చెందుతారు. అయితే ప్రసవం తరువాత మహిళలు ఎదుర్కొనే సమస్యలు వేరు ఉంటాయి. ఇవి శారీరక సమస్యలు కావచ్చు, మానసిక సమస్యలు కావచ్చు. ప్రసవ సమయంలో మహిళలు బరువు పెరగడం, బిడ్డను కూడా మోయడం వల్ల మహిళల శరీర బరువు కీళ్లు, ఎముకల మీద చాలా ఎక్కు వ పడుతుంది. ఇక ప్రసవ సమయంలో కూడా ఈ కీళ్లు ఒత్తిడికి లోనవుతాయి. ఈ కీళ్ళ నొప్పులను భరించడం కష్టం. ఇందుకోసం మెడిసిన్స్ వాడక్కర్లేదు. ఇంట్లోనే సులువుగా ప్రసవానంతర కీళ్ళ నొప్పులు తొలగించుకోవచ్చు. అందుకోసం ఏం చేయాలో తెలుసుకుంటే..
మెంతులు మహిళల్లో ప్రసావానంతర కీళ్ల నొప్పులు తగ్గడంలో సహాయపడుతుంది. ఇందుకోసం మెంతులను ఒక గ్లాసు నీటిలో రాత్రంతా నానబెట్టాలి. మరుసటి రోజు ఉదయం ఈ మెంతి గింజలను తిని, నీటిని తాగాలి. మెంతికూరలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు, యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు ఈ నొప్పులను దూరం చేయడంలో సహాయపడాయి.
మెంతులు మాత్రమే కాకుండా ప్రసవానంతర కీళ్ల నొప్పులు తగ్గించుకోవడానికి పాటించవలసిన మరొక అధ్బుతమైన చిట్కా పసుపు. పసుపు గొప్ప యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కలిగి ఉంటుంది. ప్రసవం తరువాత మహిళలు కీళ్ళ నొప్పులు మాత్రమే కాదు శరీరంలో ఎక్కడైనా వాపు వంటి సమస్యలు ఎదుర్కొంటున్నా పసుపు ప్రయోజనకరంగా పనిచేస్తుంది. ప్రతి రోజు పాలలో కాసింత పసుపు కలిపి తాగుతూండాలి. ఇది మాత్రమే కాకుండా కీళ్లు, ఇతర ప్రాంతాల్లో నొప్పి, వాపు ఉన్నచోట పసుపు ముద్దను పూయవచ్చు. ఇది నొప్పులు, మంట, వాపు తగ్గడంలో సహాయపడుతుంది.
గర్బం మోయడం, ప్రసవం కారణంగా మహిళల శరీరం చాలా మార్పులకు, ఒత్తిడికి లోనై ఉంటుంది. ఈ కారణంగా మహిళలు బాగా అలసిపోయి ఉంటారు. మహిళలకు వీలైనంత విశ్రాంతి అవసరం అవుతుంది. అంతేకానీ ప్రసవం తరువాత రోజుల వ్యవధిలోనే ఎక్కువ పనులు చేయడం చేయకూడదు. ప్రతిరోజు వీలైనంత విశ్రాంతి, మార్పులకు లోనైన శరీరానికి తేలికపాటి వ్యాయామం అవసరం. అయితే వ్యాయామం విషయంలో వైద్యులను సంప్రదించిన తరువాతే మొదలుపెట్టాలి.
ప్రపంచదేశాలు ఇష్టంగా తాగే డ్రింక్స్ లో కాఫీ ప్రథమ స్థానంలో ఉంటుంది. కప్పుల కొద్ది కాఫీ సిప్ చేస్తూ పనులు చక్కబెట్టేవారు ఎందరో. కానీ ప్రసవం తరువాత మహిళలు కాఫీ తాగడం మానుకోవాలి. కాఫీ తాగడం వల్ల ప్రసవానంతరం కలిగే కీళ్ళ నొప్పులు పెరుగుతాయి.
పైన చెప్పుకున్నవన్నీ ప్రసవం తరువాత మహిళలు పాటిస్తే ప్రసవానంతరం ఎదురయ్యే కీళ్ళ నొప్పులు ఎక్కవరోజులు ఇబ్బంది పెట్టకుండా చాలా తొందరగా తగ్గిపోతాయి.
*నిశ్శబ్ద.

