Home » Fashion » పట్టుచీరలు డ్రై క్లీనింగ్ కు ఇస్తున్నారా.. ఇంట్లోనే ఇలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు!
పట్టుచీరలు డ్రై క్లీనింగ్ కు ఇస్తున్నారా.. ఇంట్లోనే ఇలా ఈజీగా వాష్ చేసుకోవచ్చు!

భారతీయ మహిళలు పట్టు చీరలను ఇష్టపడతారు. దాదాపు ప్రతి మహిళ వార్డ్‌రోబ్‌లో ఒక పట్టు చీర ఉంటుంది. మహిళలు ప్రధాన పండుగలు , శుభకార్యాలు, పార్టీల సమయంలో పట్టు చీరలను ధరిస్తారు. ధరించే వరకు బానే ఉంటుంది. కానీ పట్టుచీరలను చాలామంది డ్రై క్లీనింగ్ కు ఇస్తుంటారు. ఎందుకంటే పట్టుచీరలను సాధారణ చీరల్లా ఉతికితే అవి పాడైపోతాయి. పట్టు చీరలను ఇంట్లో వాష్ చేయాలంటే.. చీర రంగు పోకుండా లేదా జరీ పని నల్లబడకుండా జాగ్రత్తపడటం ఎంతో ముఖ్యం. పట్టు చీరలను ఇంట్లోనే సులభంగా శుభ్రం చేసుకోవచ్చు. ఇంట్లోనే చీరలను ఎలా శుభ్రం చేయాలో తెలుసుకుంటే..
డిటర్జెంట్..
పట్టు చీరలను కఠినమైన డిటర్జెంట్లతో ఎప్పుడూ ఉతకకూడదు, ఎందుకంటే వాటిలో ఉండే రసాయనాలు చీరలను పాడు చేస్తాయి. చీరను ఇంట్లోనే తేలికపాటి షాంపూ ఉపయోగించి శుభ్రం చేసుకోవచ్చు. ప్రత్యామ్నాయంగా, చీరను శుభ్రం చేయడానికి కుంకుడుకాయ ఉపయోగించవచ్చు. కుంకుడుకాయ చీర వస్త్రానికి ఎలాంటి నష్టం కలిగించకుండా శుభ్రపరుస్తుంది.
ఉష్ణోగ్రత..
ముందుగా ఒక పెద్ద తొట్టిని లేదా టబ్ ను చల్లటి నీటితో నింపాలి. . పట్టు చీరలను వేడి లేదా గోరువెచ్చని నీటితో ఎప్పుడూ ఉతకకూడదు. చల్లటి నీటిలో తేలికపాటి షాంపూ లేదా కుంకుడుకాయ నీటిని కలిపి బాగా నురుగు వచ్చేలా చేయాలి. చీరను మెల్లగా నీటిలో ముంచాలి. చీరను నీటిలో కేవలం 2 నిమిషాలు మాత్రమే నానబెట్టాలి.
చీరను ఎక్కువగా రుద్దకూడదు. చీరపై బ్రష్ ఉపయోగించకూడదు. దానివల్ల అది పాడవుతుంది. దుమ్మును తొలగించడానికి చీరను నీటితో మెల్లగా కడగాలి. చీరను మరీ గట్టిగా పిండకూడదు. దానికి బదులుగా మెల్లగా పిండాలి.
పై చిట్కాలు పాటించి పట్టుచీరలను ఇంట్లోనే ఎలాంటి నష్టం వాటిల్లకుండా చీరలను సేఫ్ గా వాష్ చేసుకోవచ్చు..
*రూపశ్రీ.

