Home » Health Science  » ఎపిసోడ్-2


    మనం ఏ విత్తనం నాటితే అదే మొక్క మొలుస్తుంది.
    
    మన ఆలోచనలనుబట్టే మన భవిష్యత్ వుంటుంది.
    
    వజ్రాన్ని మాత్రం వజ్రంతోటే కోయాలి.
    
    కానీ ద్వేషాన్ని ద్వేషంతోటే తొలగించలేం.
    
    అది కేవలం ప్రేమ, శాంతి, ప్రశాంతత ద్వారానే తొలగించబడుతుంది.
    
    ఇది ప్రాచీన నియమం.
    
    కేవలం మన ఆహారపు అలవాట్ల మూలంగానే, శరీరానికి తగిన వ్యాయామం లేకపోవటము మూలంగానే ఇన్ని జబ్బులు నేటి మానవజాతిని చుట్టుముడుతున్నాయనే భ్రమ నుంచి ఒకింత పక్కకు తొంగిచూస్తే మన అజ్ఞానమేమిటో మనకే తెలుస్తుంది.
    
    మన పూర్వులు సుదీర్ఘకాలం జీవించటానికి అనుసరించిన సూత్రాలు అతి కష్టతరమైనవేమీ కావు.
    
    జీవశక్తి శరీరాన్ని పరిశుభ్రం చేసేందుకు, సుమారు ఐదు నిమిషాలు లేదా అంతకంటే ఎక్కువసేపు శారీరక వ్యాయామం చేయటం, దేవుని దీవెనలకై అర్ధించటం.
    
    హృదయచక్రాన్ని చైతన్యవంతం చేసేందుకు, దానిపై ఏకాగ్రత నిలిపి, ఈ భూలోకాన్ని అంతటినీ ప్రేమపూరితమైన కరుణతో దీవించటం.
    
    సహస్రార చక్రాన్ని చైతన్యవంతం చేయడానికై, కాంతిబిందువు పైన ఓమ్ లేదా ఆమెన్ లపైనా రెండు ఓంకారాలు లేదా రెండు ఆమెన్ పదాల మధ్యగల నిశ్శబ్ద విరామంపై దృష్టిని కేంద్రీకరించటం ఆ తర్వాత ఏకకాలంలో సహస్రార చక్రం, హృదయ చక్రాల ద్వారా మరల దీవించటం-
    
    ప్రకాశాన్ని సాధించేందుకు కాంతిబిందువుపైన, ఓం లేదా ఆమెన్ పైనా, రెండు ఓంకారాలు లేదా రెండు ఆమెన్ ళ మధ్యగల నిశ్శబ్ద విరామముపై దృష్టిని కేంద్రీకరించటం-
    
    అధికంగా వున్న ప్రాణశక్తిని విడుదల చేయడానికై ఈ భూమిని కాంతి, ప్రేమ, శాంతిలతో దీవించటం-
    
    కృతజ్ఞతలు తెలపటం-
    
    ఇంకా మిగిలిపోయిన అధికశక్తిని శరీరం నుండి వదిలించు కునేందుకు, శరీరానికి బలం చేకూర్చేందుకు, శరీరాన్ని మర్దనం చేసి, ఎక్కువ శారీరక వ్యాయామం చేయటం-
    
    మన పూర్వీకులంతా ఆరోగ్యంగా వుండటానికి ఇవి ప్రధాన సూత్రాలుగా నిలిచాయి. మానవుని శరీరం చుట్టూ ఒక విధమైన కాంతివంతమైన మేఘం వ్యాపించి వుంటుంది అనేది ఒక ప్రాచీన అభిప్రాయం.
    
    క్రైస్తవులకంటే ముందుగా పురాతన ఈజిప్టు, భారత్, గ్రీకు, రోమ్ దేశాలవారు- దివ్యమూర్తుల పట్ల ఇలాంటి నమ్మకాన్ని కలిగి వుండేవారు.....కొన్ని శతాబ్దాలుగా కొందరు దివ్యజ్ఞానులు సామాన్య మానవుల చుట్టూ ఒక కాంతిమండలం వుండడాన్ని ప్రత్యక్షంగా చూశారు.
    
    ఆ వ్యక్తి యొక్క ఆరోగ్యం, మానసిక స్థితి, ఆధ్యాత్మిక లక్షణాలను తెలిపేవిధంగా, వ్యక్తి వ్యక్తికీ మధ్య ఈ కనతి మండలాల రంగుల్లో తేడాలు వున్నట్లు తెలుసుకున్నారు.
    
    ఆ విధంగా చూసిన 'స్వీడన్ బొర్గ్' అనే ఆయన "ప్రతి వ్యక్తి చుట్టూ, ఈ భూమిపై గల ప్రకృతి సిద్దమైన, ప్రతిదానిచుట్టూ ఒక ఆధ్యాత్మిక శక్తి మండలం వ్యాపించి ఉంది" అని తన ఆధ్యాత్మిక దినచర్యలో వ్రాసుకున్నాడు. ఆలాంటప్పుడు కేవలం భౌతిక శరీరానికే వైద్యం చేస్తే ఆశించిన ప్రయోజనం ఎలా సిద్దిస్తుంది?
    
    జీవధాతు శరీరానికీ, భౌతిక శరీరానికీ మధ్య అన్యోన్య సంబంధం వుంది. ఈ రెండింటిలో ఏ ఒక్కదానికి అనారోగ్యం సోకినా, అది రెండవ దానికి కూడా సోకుతుంది. జీవధాతు శరీరం యొక్క గొంతు భాగంలో ప్రాణశక్తి క్షీణించినప్పుడు, అది భౌతికశరీరంలో దగ్గు, పడిశం, గొంతు మంట, ట్రాన్సిలైటిన్, లేదా గొంతుకు సంబంధించిన ఇతర సమస్యల రూపంలో వ్యక్తమవుతుంది.    

    ప్రమాదవశాత్తూ ఎవరికైనా చర్మంమీద గంటు పడినప్పుడు లేదా చర్మం గీరుకుపోయినప్పుడు, రక్తం కారే ప్రదేశం నుండి గాయానికి తగినంత పరిమాణంలో ప్రాణశక్తి బయటకు పోతూ వుంటుంది.
    
    గాయంగానీ, నొప్పిగానీ ఉన్నచోట్ల మొట్టమొదట్లో, ప్రాణశక్తి బయటకు పోతూ వుండటం వలన తాత్కాలికంగా ప్రకాశవంతంగా వుంటుంది.
    
    కానీ కొద్దిసేపటికి, ప్రాణశక్తీ క్షీణించడం వలన తప్పనిసరిగా బూడిద రంగుగా మారుతుంది.
    
    ప్రాణశక్తి పేరుకుపోవడంవలనగానీ, తరుగుదలవలనగానీ జీవధాతు శరీరంలో ఏ భాగమైనా బలహీనంగా మారినట్లయితే, భౌతిక శరీరంలో అదే భాగం సరిగ్గా పనిచేయదు.
    
    లేదా త్వరలో అనారోగ్యానికి గురయ్యే అవకాశం వుంది. ఉదాహరణకు సోలార్ ప్లక్సెస్, కాలేయాలలో ప్రాణశక్తి తరిగినప్పుడు కామెర్లు (జాండిస్), లేదా హెపాటిటిస్ ల రూపంలో బయటపడతాయి.
    
    పై ఉదాహరణలను బట్టి, జీవధాతు శరీరానికీ, భౌతిక శరీరానికీ మధ్య అవినాభావ సంబంధం వుందనీ, ఒకదానిలో సంభవించే మార్పు యొక్క ప్రభావం మరొకదానిపై కూడా వుంటుందనీ మనకు స్పష్టంగా తెలుస్తోంది. జీవధాతు శరీరానికి చికిత్స చేయడం వలన, భౌతిక శరీరంలో అనారోగ్యం తగ్గిపోతుంది.
    
    క్రమం తప్పకుండా క్షాళన (క్లీన్సింగ్), శక్తి ప్రసారణ (ఎనర్జెసింగ్) చేస్తూ వుండడం వలన కళ్ళకు కలిగిన హ్రస్వదృష్టి లోపం క్రమక్రమంగా కనుమరుగై చూపు పూర్తిగా చక్కబడుతుంది.
    
    గుండె పరిణామం పెరిగినవారికి రెండు మూడుసార్లు ప్రాణచికిత్స చేసి, అనారోగ్యానికి గురైన గుండె, భుజం, ఎడమచేతి పై భాగాలలో పేరుకు పోయిన ప్రాణశక్తిని తొలగించడం ద్వారా, ఆ వ్యక్తికి ఉపశమనం కలిగించవచ్చు. పూర్తిగా తగ్గాలంటే ఎన్నో నెలలు పడుతుంది. శిరస్సు ప్రాంతంలో అధికంగా పేరుకుపోయిన ప్రాణశక్తిని తొలగించి, దానికి ప్రాణశక్తిని ప్రసరింప జేయడం ద్వారా, కొన్ని నిముషాలలోనే తలనొప్పిని తొలగించవచ్చు.


Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.