Home » Health Science » Centre notifies MTP Rules spelling out criteria for abortion up to 24 weeks,Rules Extending Abortion Limit To 24 Weeks,Govt notifies new rules for allowing,Govt notifies new rules for allowing abortion till 24 weeks
గర్భస్రావానికి 24 వారాలు...
'
ఇక మహిళలు గర్భస్రావానికి 24 వరాలు మాత్రమే గడువు విదిస్తూ కేంద్రం ఎం టి పి చట్టం 19 71 ని సవరించింది.ఈ మేరకు టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి చట్టం 2౦21 ని సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి తెచ్చింది. గతం లో ఉన్న 1971 ఎం టి పి ప్రకారం గర్భస్రావానికి 2౦ వరాలు మాత్రమే గడువు ఉండగా దీనిని సవరిస్తూ మరో నాలుగు వారాలు గడువును పెంచింది. అయితే గర్భ శ్రావం చేసుకోడానికి గల కారణాలను సూచిస్తూ ఎవరు గర్భ స్రావాన్ని చేసుకో వచ్చో చట్టంలో పేర్కొంది.ముఖ్యంగాలైంగిక దాడులకు గురి అయిన వారు. మానభంగానికి గిరి అయిన వారు.మైనర్లు అంగవైకల్యం గల మహిళలు. మానసిక రోగులు,ఎవరైతే మానసిక సమాస్యలతో బాధ పడుతున్నారో.ఆయా సందర్బాన్ని బట్టి గర్భం లో ఉన్న పిండాన్ని తొలగించడం ప్రమాదం తో కూడుకున్నదని ఒక్కో సారి ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని సవరణ చట్టం లో పేర్కొన్నారు.కాగా సవరణ చట్టం లో ఎవరైతే పిల్లలు శారీరకంగా మానసిక తీవ్ర అంగ వైకల్యం తో బాధ పడుతున్నారో,లేదా ఇతర అనారోగ్య సమస్యల తో బాధ పడేవారు,వివాహం లో ఇబ్బందులు,ఆతరువాత వచ్చిన మార్పు పరిణామాల నేపధ్యం లో అవాంచిత గర్భం వచ్చినప్పుడు అది తీవ్ర సమస్యగా మారవచ్చు. ఆసమయంలో అత్యవసరంగా గర్భ శ్రావం చేయాల్సి వస్తే చట్ట ప్రకారం వారు గర్భ శ్రావం చేసుకో వచ్చని కేంద్రం చట్టం లో పేర్కొంది.వైద్య పరంగా గర్భస్రావం టెర్మినేషన్ ఆఫ్ ప్రేగ్నేన్చి యాక్ట్ 2౦21 సెప్టెంబర్ 24 నుండి అమలు లోకి వస్తుందని చట్టం లో పేర్కొన్నారు.