పిల్లల్లో మంచి ప్రవర్తనకై రూల్స్ పెట్టకండి Don't impose rules to instill good manners in kids             సమాజంలో మనం చాలా మందిని చూస్తుంటాం, వారిని చూసినా, వారి గురించి తెలుసుకున్నా, వారిని ఇన్స్ పిరేషన్ గా తీసుకుంటాం. మనం అంతటి వాళ్ళం కాలేకపోయినా మన పిల్లలైనా అంతటి వాళ్ళు కావాలని కోరుకుంటాం, అందుకే లక్షలు డొనేషన్ లు కట్టి చదవించడానికి కూడా వెనకాడం, పిల్లలు ఎలిమెంటరీ స్కూల్ లోనే ఉంటారు, వాళ్ళ కాలేజీ చదువులకని ఇప్పటి నుండే ప్లాన్స్ చేస్తుంటాం, వారి చదువు విషయంలోనే కాదు, వారి ఆరోగ్యం విషయంలో కానీ వారి వస్త్ర ధారణ విషయంలో కానీ ఏ లోటు రాకుండా చూసుకుంటాం, కానీ వీటన్నింటితో బాటు కొన్ని విషయాలు, మనం చూసి చూడనట్టుగా , సింపుల్ గా వదిలేస్తుంటాం. ఆ విషయాలే వారు ఎదిగాక వారి వ్యక్తిత్వాన్ని శాసిస్తాయనడంలో అతిశయోక్తి లేదు. మన ఆహారపు అలవాట్లు, మన కుటుంబ పద్ధతులతో పాటు, కుటుంబంలోని మనుషుల మధ్య ఉండే అనుబంధాలతో పాటు స్కూల్ కి వెళ్తున్న పిల్లల్లో తన తోటి పిల్లల ప్రభావం కూడా పడుతూ ఉంటుంది, కొన్ని సార్లు మనం వాటిని చూసి చూడకుండా వదిలేసిన విషయాలే భవిష్యత్తులో చాలా కీలక పాత్ర పోషిస్తాయి. వారు ఎదిగాక వాటిని మార్చాలన్నా, సున్నితంగా చెప్పగానే వినే స్థాయిలో పిల్లలు ఉండరు. అందుకే పిల్లల్లో మంచి గుణాలు అలవర్చడానికి వారి పసితనం నుండే వారిలో మంచి లక్షణాలు అలవడేలా జాగ్రత్త పడాలి, అందుకని కఠినంగా వ్యవహరిస్తూ, ఇది ఇలాగే చేయాలి అని రూల్స్ పెట్టాల్సిన అవసరం లేదు, ప్లీజ్ మరియు థాంక్స్ : పిల్లలకు ఏదైనా పని చెప్పాలనుకున్నప్పుడు ప్లీజ్ అనడం, ఆ పని చేశాక థాంక్స్ చెప్పడం మరిచిపోకండి. ఆటోమేటిక్ గా వాళ్ళకూ అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా థాంక్స్ గానీ ప్లీజ్ గానీ చెప్పినప్పుడు మీరు హ్యాప్పీగా ఫీల్ అవుతారన్న విషయం వారికి అర్థమయ్యేలా ప్రవర్తించండి. భోజనం చేసేటప్పుడు : భోజనం చేసేటప్పుడు ఎలా మసలుకోవాలో పిల్లలకు వారు స్వంతంగా తినడం మొదలు పెట్టినప్పటినుండే చెప్పడం మొదలుపెట్టండి. కొందరు పిల్లలు నోరు తెరిచి పెట్టి తింటుంటారు. తిన్న ప్రతీసారి ప్లేట్ చుట్టూరా అన్నం పడేయడం, అన్నం తింటున్న చేతితోనే గ్లాసుల్ని పట్టుకోవడం లాంటివి చేస్తుంటారు. అలాగని అంత చిన్న వయసు నుండే వాళ్ళు అన్ని పద్ధతులు నేర్చుకోవడం కుదరదు, కానీ అలా చేయడం కరెక్ట్ కాదన్న విషయాన్ని మాత్రం వారికి తెలియజేయాలి. ప్లే డేట్స్ పిల్లలు ఏదైనా బర్త్ డే పార్టీ కి అటెండ్ అయినప్పుడు అక్కడ ఎలా మసలుకోవాలో చెప్పి పంపించండి. ఫ్రెండ్స్ తో ఎలా ఉండాలి, వారి పేరెంట్స్ తో ఎలా ఉండాలి, తినేటప్పుడు తోటివారితో ఎలా మసలుకోవాలి ఒకటికి , రెండు సార్లు చెప్పండి. ముఖ్యంగా పిల్లలు, స్వీట్స్, చాక్లెట్స్ విషయంలో అలావాటుగా మ్యానర్స్ లేకుండా ప్రవర్తిస్తుంటారు. వాళ్ళు వెళ్ళేది ఫ్రెండ్ పార్టీ కి కాబట్టి అలా ప్రవర్తించకూడదని చెప్పి పంపించండి. ఎదుటి వారిని చులకన చేయడం ఈ అలవాటు పిల్లల్లో సర్వ సాధారణంగా ఉంటుంది. తోటివారిని వారి పేర్లతో కాకుండా ఫన్నీగా ఉండే పేర్లతో పిలుస్తుంటారు. క్లాస్ మేట్స్ , ఫ్రెండ్స్ నే కాడు ఒక్కోసారి టీచర్స్ ని కూడా చులకన చేస్తుంటారు. ఇలాంటి అలవాట్లను మొగ్గలోనే తుంచేయాలి, వీలయితే ఎవరినైతే వారు కించపరుస్తున్నారో వారిలో ఉన్న గొప్పను పిల్లలకు అర్థమయ్యేలా చెప్పాలి, ఎదుటి వారిని కించపరిస్తే మనం లోకువైపోతామన్న విషయం వారికి తెలియజేయాలి. ప్రామిస్ చేయడం ఏదైనా విషయం చెప్పి ప్రామిస్ చేయడం, బలవంతంగా నైనా సరే ఎదుటి వారికి తమపై నమ్మకం కలిగేలా చేయడానికి చేసే ప్రయత్నం, ఈ ధోరణి పిల్లల్లో కనిపిస్తూ ఉంటుంది. ఏదైనా స్కూల్ లో జరిగిన విషయం చెప్పడం, ఇమ్మీడియట్ గా గాడ్ ప్రామిస్ లేదా మదర్ ప్రామిస్ అనడం ఈ రోజుల్లో సర్వ సాధారణం. మీకు తనపై చాలా నమ్మకముందని చెప్పండి, నమ్మకమనేది ప్రామిస్ చేస్తేనే రాదనీ వారికి అర్థమయ్యేలా చెప్పండి. ఫ్రెండ్స్ ఇంటికి వచ్చినపుడు మీ ఇంట్లో మీ చిన్నారి బర్త్ డే పార్టీకి కానీ, లేదా ఏ ఇతర ఒకేషన్ లలో నైనా తన ఫ్రెండ్స్ ని కూడా ఇన్వైట్ చేస్తూ ఉండండి, తద్వారా ఇంటికి వచ్చిన గెస్ట్ తో ఎలా ప్రవర్తించాలో చిన్నతనంలోనే అలవాటు అవుతుంది. ఎక్స్ క్యూజ్ మీ చాలా మంది పిల్లలు, పెద్దవాళ్ళు మాట్లాడుతుంటే మధ్యలో వచ్చి మాట్లాడేస్తుంటారు , మనం కూడా 'పెద్ద వాళ్ళు మాట్లాడేటప్పుడు మధ్యలో మాట్లాడకూడదు' అని చెప్తూనే ఉంటాం, దానికి బదులు ఏదైనా అడగడానికి ముందు 'ఎక్స్ క్యూజ్ మీ' అని అనాలని చెప్పడం మరీ మంచిది. ఎక్కడ పడితే అక్కడ గోక్కోవడం ఇవి పిల్లల్లో సర్వ సాధారణం. ముక్కుల్లో వేళ్ళు పెట్టుకోవడం, గోక్కోవడం, స్కూల్ నుండి రాగానే బ్యాగ్ ఎక్కడ పడితే అక్కడ పడేయడం.. ఇవన్నీ సున్నితంగా చెప్తూ మాన్పించాలి, పిల్లల్లో మార్పు ఒక్కసారిగా రాదు, కాస్త టైం పడుతుంది.అందుకే ఓపికగా, సున్నితంగా చెప్తూనే వారిలో మంచి చెడుకి మధ్య అవగాహన కలిగించాలి.

                                                        పసిపిల్లలకు మసాజ్ చేసే పధ్ధతి Instructions For Baby Massage పసి పిల్లలకు స్నానానికి ముందు మసాజ్ చేయడమన్నది చాలా అవసరం. వారి శరీర సౌష్ఠవానికి తల్లిపాలతో బాటు, రోజుకి ఒకసారైనా మసాజ్ చేయడం తప్పనిసరి. దానివల్ల శరీరంలోని కండరాలు గట్టిపడి పిల్లలు బలంగా ఉండటానికి ఉపకరించడంతో బాటు వారి రిలాక్స్ గా ఫీల్ అయి రోజంతా ఆక్టివ్ గా ఉంటారు. మసాజ్ చేయడం వల్ల పిల్లల్లో రక్త ప్రసరణ మెరుగుపడి, జీర్ణశక్తి పెరుగుతుంది. పిల్లల ఎముకల్లో, కండరాలలో పటుత్వం వస్తుంది. పిల్లల్లో అలసట పోయి రిలాక్స్ అవుతారు, ఫలితంగా ఎక్కువ సేపు నిద్రపోతారు. అలాగని సరైన అవగాహన లేకుండా పిల్లలకు మసాజ్ చేయడానికి సిద్ధపడకూడదు. చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. వారికి మసాజ్ చేసే ఆయిల్ దగ్గర్నించి, వారి శరీర భాగాలను ఎలా మసాజ్ చేయాలి...? మసాజ్ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలేంటో ముందుగా తెలుసుకోవాలి.    పిల్లలకు మసాజ్ చేసే పధ్ధతి: మసాజ్ చేయడానికి ముందుగా గది వాతావరం వెచ్చగా ఉండేలా చూసుకోవాలి. వాళ్ళను టేబుల్ పై నైనా లేదా మీ కాళ్ళ పైనా పడుకోబెట్టుకోవాలి. వారితో మాట్లాడటం కానీ, పాట పాడటం కానీ చేస్తూ వాళ్ళు కంఫర్ట్ గా ఉన్నారు అని కన్ఫం చేసుకున్న తరవాత మసాజ్ ఆయిల్ ని నుదురు మీదుగా, చెంపల మీదుగా, ముక్కు , కనుబొమ్మల మీదుగా, చెవులపై మృదువుగా మసాజ్ చేయాలి. మెల్లిగా ఛాతీ పై మసాజ్ చేస్తూ, చేతులపై , ఆ తరవాత మృదువుగా చేతివేళ్ళను మసాజ్ చేయాలి. ఆ తరవాత అరికాల్లను, వేళ్ళను మృదువుగా మసాజ్ చేయాలి. ఆ తరవాత వారిని బోర్లా పడుకోబెట్టి మృదువుగా వీపుపై మసాజ్ చేయాలి. మీ పూర్తి ధ్యాస మసాజ్ పైనే కాకుండా పిల్లలతో మాట్లాడుతూ ఉండాలి. మసాజ్ పూర్తయ్యేంత వరకు పిల్లలతో ఐ కాంటాక్ట్ ఉండాలి.  ముఖ్య గమనిక : మసాజ్ చేసేటప్పుడు పిల్లల ముక్కుల్లో, చెవుల్లో నూనె పోయడం లాంటివి చేయకూడదు.  

  హ్యాప్పీ స్కూల్ డేస్   ఎప్పటి నుండో ఎదురు చూసిన వేసవి సెలవులు... చుట్టాలింటికి వెళ్ళవచ్చు, వాళ్ళు ఇక్కడికి రావచ్చు, హోమ్ వర్క్ గొడవ ఉండదు, పొద్దున్నే లేవాల్సిన అవసరం అంతకన్నా ఉండదు, ప్రోగ్రెస్ రిపోర్ట్స్ ఉండవు. ఎంచక్కా ఏ టెన్షన్స్ లేకుండా ఫ్రెండ్స్ తో ఆడుకోవచ్చు.. ఇవన్నీ ఒక నెల మాత్రమే.. ఈ సంతోషాలన్నింటికీ అడ్డు కట్టలు వేస్తున్నట్టు జూన్ రానే వస్తుంది. ఇంకేముంటుంది చెప్పండి. పిల్లల్లో ఇన్నాళ్ళుగా ఉన్న ఆనందం కాస్త నీరుకారిపోతుంది. ఇన్నాళ్ళు జాలీగా ఉన్న ఆ పసిహృదయాలు మళ్ళీ ఆ రొటీన్ స్కూల్ టైం టేబుల్ కి, కొత్త పుస్తకాలకి తిరిగి అలవాటు పడాలంటే కష్టమే మరీ.   ఇలాంటప్పుడు చొరవ తీసుకుని పిల్లలు ఇబ్బంది పడకుండా ఆటపాటల నుండి వాళ్ళ మనసు మళ్ళించి వాళ్ళు స్కూల్ కి సంతోషంగా వెళ్ళేలా మోటివేట్ చేయాల్సిన బాధ్యత తల్లిదండ్రులదే. ఇది మరీ అంత తేలికైన విషయం కాకపోయినా మొదటినెల వారిపై కాస్త ఎక్కువ కాన్సంట్రేషన్ చేస్తే పిల్లలకు స్కూల్ అలవాటు అవుతుంది... మీకు టెన్షన్ తప్పుతుంది.   కనీసం వారం రోజులు ముందుగా... స్కూల్ రేపటి నుండి తెరుస్తున్నారనగా వారికి స్టిట్టు గా వార్నింగ్ స్ ఇస్తూ, రేపటి నుండి ఇలా ఉంటే కుదరదనో, హోం వర్కు, ర్యాంకులు గుర్తు చేసి వారి సంతోషాన్ని హరించవద్దు. చాలా ప్లాన్డ్ గా ఉండండి. వారం రోజుల ముందుగానే.... 'ఇంకా వారం రోజులైతే స్కూల్ స్టార్ట్ అయిపోతుంది. కొత్త బుక్స్, కొత్త క్లాస్, కొత్త యూనిఫాం...' ఇలాంటి విషయాలను గుర్తు చేసి వాళ్ళను ఎగ్జైట్ చేయండి. లాస్ట్ ఇయర్ లో వాళ్ళు ఎక్కువగా మార్కులు తెచ్చుకున్న సందర్భాల్ని, క్లాస్ లో టీచర్ మెచ్చుకున్న సందర్భాల్ని గుర్తు చేసి వారిని అభినందించండి.. వారం రోజులు ముందునుండే వారిని ఉదయాన్నే కాస్త త్వరగా లేచే అలవాటు చేయండి.   మొదటి వారంలో ... స్కూల్ మొదలవగానే హడావిడిగా మీరు నిద్రలేచి, వారిని నిద్రలేపి, గబగబా బ్రేక్ ఫాస్ట్ ప్రిపేర్ చేసి, వారిని గాబరా పెడుతూనే తినిపించి, ఒకవైపు బస్సు వచ్చేస్తుందన్న టెన్షన్, మరోవైపు బాక్స్ పెట్టాలన్న టెన్షన్.. ఇలా మీరు ఫీల్ అయ్యే ఒత్తిడి పిల్లలపై ఎక్కువ ప్రభావాన్ని చూపెడుతుంది. గుర్తుపెట్టుకోండి ఈ టైం లో పిల్లలకు కావాల్సింది మీ సపోర్ట్, అందుకే వీలైనంత ఎక్కువ సమయాన్ని వారితో గడపగలిగేలా ప్లానింగ్ ఉండాలి, అందుకు మీరు అనుకున్న సమయానికంటే కాస్త తొందరగా నిద్రలేస్తే సరిపోతుంది. పిల్లలు బయటపడకపోయినా మనసులో స్కూల్ తాలూకు భయం, చిరాకు ఉంటాయి. దానిని కనిపెట్టాల్సింది మీరే. బ్రష్ చేస్తున్నప్పుడు, స్నానం చేయిస్తున్నప్పుడు వారి క్లాస్ మేట్స్ గురించి మాట్లాడాలి, తొందరగా రెడీ అయి వెళ్తే, ఎంచక్కా ఫ్రెండ్స్ అందరినీ కలవచ్చని మోటివేట్ చేయాలి.   ఆహారం విషయంలో... పిల్లలు నిద్రలేవక ముందే వారి బ్రేక్ ఫాస్ట్, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసి పెట్టుకుంటే మంచిది. వాళ్ళు నిద్ర లేచాక హడావిడి పడకుండా ముందే ప్రిపేర్ చేసుకోవడం వల్ల పిల్లలు నిద్రలేవగానే ఎంచక్కా వాళ్ళతో కబుర్లాడుతూనే వాళ్ళను స్కూల్ కి రెడీ చేయొచ్చు, వాళ్ళు టెన్షన్ మరిచిపోయి రిలాక్స్డ్ గా కూడా ఉంటారు. బ్రేక్ ఫాస్ట్ విషయంలోనూ, లంచ్ బాక్స్ ప్రిపేర్ చేసుకునే విషయంలోనూ వారికి పూర్తి ఫ్రీడంని ఇవ్వాలి. బ్రేక్ ఫాస్ట్ లో వారికి నచ్చిన ఐటమ్స్ ఉంటే మారాం చేయకుండా తొందరగా తినేస్తారు. దీనివల్ల మీక్కూడా టైం సేవ్ అవుతుంది. లంచ్ బాక్స్ మరీ చిన్న బాక్స్ లను ఎంచుకునే కంటే కాస్త పెద్దగా ఉండి, స్పూన్ తో తినేలా ఉంటే వాళ్ళు తినడానికి అనువుగా ఉంటుంది.   యూనిఫారం వేసుకునే విషయంలో … మరీ ఎలిమెంటరీ స్కూల్ పిల్లలైతే ఇది చాలా కష్టమైన ఘట్టం, అందునా మొదటిరోజు. పిల్లలు ఓ పట్టాన కోఆపరేట్ చేయరు. మీరు ఒకవైపు డ్రెస్ వేస్తుంటే వాళ్ళు ఇంకో వైపు పరుగెడుతుంటారు. అలాంటప్పుడు విసుక్కోవడం, కసురుకోవడం లాంటివి కాకుండా వారి దృష్టిని ప్రేమగా మీవైపుకు తిప్పుకోవాలి. వారిని మాటల్లో పెట్టి వారిచ్చే సమాధానాలకు రియాక్ట్ అవుతూ టై, బెల్ట్, షూ వేసి నీట్ గా రెడీ చేయాలి. రెడీ అయ్యాక అద్దం ముందు నిలబెట్టి వాళ్ళు నీట్ గా ఉంటే ఎంత బావుంటారో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. ఇలా చెప్పడం వల పిల్లల్లో చిన్నతనం నుండే పరిశుభ్రత పట్ల ఆసక్తి పెరుగుతుంది. పుస్తకాలు సర్దిపెట్టడం … కొందరు పిల్లలకు హై స్కూల్ స్థాయికి వచ్చాక కూడా స్కూల్ బ్యాగ్ సర్దుకోవడం చేతకాదు. ఎన్నిసార్లు సర్దినా సాయంత్రం స్కూల్ నుండి తిరిగి వచ్చేసరికి మళ్ళీ పుస్తకాల పరిస్థితి గజిబిజీగానే ఉంటుంది. అలాంటప్పుడు కసురుకోకుండా, అలాగని మీరే సర్దిపెట్టడం లాంటివి చేయకుండా ప్రేమగా దగ్గర కూచోబెట్టుకుని మీరు అడ్వైజ్ చేస్తూ, లాంగ్ నోట్ బుక్స్ ని ఎలా సర్దాలి, ప్రయారిటీ వైజ్ గా , కావాలనుకున్నప్పుడు వెదుక్కోకుండా ఎలా సర్డుకోవాలో వారికి అర్థమయ్యేలా చెప్పాలి. దీనివల్ల వారి పుస్తకాలను ఎలా సర్డుకోవాలో అర్థమవుతుంది. మీకూ ఒక పనిభారం తగ్గుతుంది. బస్సు వచ్చేసమయానికి టెన్షన్ లేకుండా పిల్లలను స్కూల్ కి సిద్ధం చేయవచ్చు.   బస్సులో ఉన్నప్పుడు నియమాలు : వీటిని మాత్రం పిల్లలకు రోజుకి ఒకసారైనా గుర్తు చేయాలి. సాధారణంగా స్కూల్ బస్సుల్లో పిల్లలు గొడవపడుతుంటారు. ఒక్కోసారి బస్సు కిటికీల్లోంచి చేతులు బయటికి పెట్టి ఆటలాడుతుంటారు. అలా చేయడం వల్ల జరిగే ప్రమాదాల్ని చెప్పి చిన్నగా హెచ్చరించాలి.   శుభ్రతా నియమాలు : పిల్లల్లో పరిశుభ్రత గురించి అవగాహన చాలా అవసరం. బయట దొరికే వస్తువులను తినేస్తుంటారు, అలా కాకుండా స్కూల్ లో ఆకలేసినప్పుడు తినడానికి బిస్కెట్ ప్యాకెట్ ల లాంటివి పెట్టాలి, ఇంటి దగ్గరనుండి తీసుకెళ్ళిన తిండి పదార్థాలు మాత్రమే తినేలా వారిని ప్రోత్సహించాలి. కర్చీఫ్ వాడటం అలవాటు చేయాలి. టాయిలెట్ కి వెళ్ళిన తరవాత ఎలా ఫ్రెష్ అప్ అవ్వాలో వారికి అవగాహన కలిగించాలి.   టీచర్స్ , క్లాస్ మేట్స్ తో రిలేషన్ .. పిల్లలు మానసికంగా ఎదగడానికి దోహదపడే అంశాల్లో ఇది చాలా ముఖ్యమైనది. పొద్దున్నే స్కూల్ కి పంపించాం, సమయానికి ఫీజులు కట్టాం లాంటివే కాకుండా పిల్లలు స్కూల్ లో తమ క్లాస్ మేట్స్ తో ఎలా మెలుగుతున్నారో కనుక్కుంటూ ఉండాలి,                                            ఎవరితోనైనా శత్రుభావం పెంచుకుంటున్నారా..?, టీచర్స్ తో ఎలా మెలుగుతున్నారు , అన్న విషయాలను ఎప్పటికప్పుడు గమనిస్తూ ఉండాలి. బర్త్ డే పార్టీలు సెలెబ్రేట్ చేసి తన ఫ్రెండ్స్ ని ఇన్వైట్ చేయడం లాంటివి చేస్తే పిల్లల్లో తోటివాళ్ళతో కలివిడిగా ఉండే అలవాటు అవుతుంది. స్కూల్ నుండి తిరిగి వచ్చాక పడుకునేంత వరకు.. స్కూల్ నుండి తిరిగి రాగానే పిల్లలను గమనించాలి, ఇదివరకటి లాగే ఉత్సాహంగా ఉంటున్నారా..? లేక స్కూల్ పట్ల భయం లాంటివి పెట్టుకుని ఒత్తిడికి గురవుతున్నారా..? కొందరు పిల్లల్ని అడిగినా చెప్పకపోవచ్చు. మనమే కనిపెట్టాలి. హోం వర్క్ చేసేటప్పుడు వారి దగ్గరగా కూచుని వారికి వచ్చే డౌట్స్ తీరిస్తూ, హోం వర్క్ ఎక్కువగా ఉంటే స్ట్రెస్ ఫీల్ అవ్వకుండా వారితో కబుర్లాడుతూ , మధ్యలో బ్రేక్ తీసుకునేటట్లు చేస్తూ, మొత్తానికి చదువు విషయంలో వాళ్ళు ఒంటరిగా ఫీల్ అవ్వకుండా, యు ఆర్ ద బెస్ట్ అని ప్రోత్సహించాలి. పిల్లల్ని మంచి పౌరులుగా తీర్చిదిద్ది, వారిని ఉన్నత శిఖరాలకు చేర్చగలిగే విద్య, బాల్యం పట్ల శాపం కాకూడదు. స్కూల్, క్లాస్ మేట్స్ , టీచర్స్, హోమ్ వర్క్ పిల్లల రొటీన్ జీవితంలో కీలక అంశాలు, పిల్లలకు వీటితో సత్సంబంధాలు ఉండేలా జాగ్రత్తపడాలి. అవే వారి బంగారు భవిష్యత్తుకు నాంది.            

  పిల్లల్లో కమ్యూ నికేషన్ స్కిల్స్ Communication skills in Kids                 మనషిలో వ్యక్తిత్వ వికాసానికైనా, సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు సాధించాలనుకున్నా ముఖ్యంగా కావాల్సింది కమూనికేషన్ స్కిల్స్ , ఏం మాట్లాడాం అనే దానికన్నా , ఎలా మాట్లాడాం అన్న దానికే ప్రాధాన్యత ఉంటుంది. అందుకే ఈ రోజుల్లో చాలా మంది కమ్యూనికేషన్ స్కిల్స్ ను ఇంప్రూవ్ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. కాని ఈ ప్రయత్నం పిల్లల్లో మాటలు నేర్చుకునే స్టేజ్ నుండే ఉంటే ఇంకా బావుంటుంది. మామూలుగా పిల్లల్లో ఎదుటి వారిని గమనించే లక్షణాలు చాలా ఉంటాయి. కాబట్టి పుట్టిన నాటి నుండి ఆరేళ్ళ వయసు వరకు తల్లిదండ్రులు ప్రత్యేక శ్రద్ధ చూపాల్సి ఉంటుంది. పిల్లలకు ప్రత్యేకంగా ఎవరూ భాష నేర్పించరు. ప్రతి రోజు ఏదో సందర్భంలో , ఎవరో ఒకరు మాట్లాడుతుండటాన్ని గమనిస్తూ నేర్చుకుంటూ ఉంటారు. ఈ టైం లో తల్లి దండ్రులు కొంచెం ప్లాన్డ్ గా ఉండి కమ్యూనికేషన్ పై దృష్టి పెట్టినట్టైతే స్కూల్ అడ్మిషన్స్ దగ్గరి నుండి, భవిష్యత్తులో వేసే ప్రతి అడుగులోనూ ఎఫెక్టివ్ కమ్యూనికేషన్ అలవడుతుంది. పిల్లల్లో ఈ కమ్యూనికేషన్ డెవలప్ అవ్వడానికి పెద్దగా కష్టపడాల్సిన అవసరమేమీ లేదు . మొదటి సంవత్సరం : మొదటి సంవత్సరం పిల్లలు మాట్లాడగలిగే స్థాయి కాదు , బిడ్డ పుట్టిన నాటి నుండి సంవత్సరం లోపు మనం వివిధ దశల్లో పిల్లలను అనేక రకాలుగా ఎంకరేజ్ చేయవచ్చు. మీరు పిల్లలతో ఎప్పుడు మాట్లాడినా వాళ్ళు మీ మొహాన్ని చూస్తుండేలా జాగ్రత్తపడాలి. మీరు మీ మొహం లో చూపించే హావభావాల ద్వారానే మీరేం చెప్తున్నారో వారికి అర్థమవుతుంది. పిల్లలు ఇష్టపడి ఆడుకునే బొమ్మలు అస్తమానం వారికి అందుబాటులో ఉండేలా కాక వారికి కనిపించేలా ఉండి, వాళ్ళు ఎప్పుడు ఆ బొమ్మతో ఆడుకోవాలనుకున్నా మిమ్మల్ని అడిగేలా చేయాలి. దీని ద్వారా మాటలు రాకపోయినా తనక్కావాల్సింది ఎక్స్ ప్రెస్ చేసి తీసుకునే గుణం పిల్లల్లో అలవడుతుంది. వారికి తినిపించే ఆహారపదార్థాలను గాని, ఆడుకునే వస్తువులను కాని, ఒకటికి రెండు సార్లు వారి ఎదురుగా నిదానంగా పలకండి, తద్వారా తనకు సంబంధించిన విషయాలపై అవగాహన కలుగుతుంది. సాయంత్రం పూట వారిని ఆడించడంలో భాగంగా రైమ్స్ పాడటం, పాటలు పాడటం లాంటివి చేయండి, 12 వ నుండి 24 వ నెల వరకు పిల్లల్లో ఈ దశ చాలా కీలకమైనది. మన ఇంటి పరిసరాలు, ఆచార వ్యవహారాలూ , ఇంట్లోని మనుషుల మధ్య మధ్య ఉండే బాంధవ్యాలు అన్నింటికీ అలవాటు పడుతుంటారు. సంవత్సరం లోపు పిల్లలది కేవలం పరిసరాలను అర్థం చేసుకునే దశైతే , ఈ దశ తమకేం కావాలో మారాం చేసి మరీ తీసుకునే దశ. ఈ దశలోని పిల్లల్లో అబ్జర్వ్ చేసే గుణం చాలా ఎక్కువ. వారికంటూ పరిక్యులర్ మ్యూజిక్ వినదం దగ్గర్నించి, కార్టూన్లు, వారికి ఇష్టమైన ఫుడ్ లాంటి వాటికి అలవాటు పడుతుంటారు. ఈ దశలో వారిలో కమ్యూనికేషన్ పెరగడానికి తీసుకోవాల్సిన కనీస జాగ్రత్తలు : 1. పిల్లలతో ఎంత వీలయితే అంత టైం స్పెండ్ చేయడానికి ట్రై చేయండి. 2 వారితో పాటు మీరు కూడా ఆడండి, తద్వారా పిల్లలు మీకు మరింత దగ్గరయ్యే అవకాశం ఉంది. 3. వారిని మీతో పాటు కూర్చోబెట్టుకుని నీతి కథలను చదివి వినిపించండి.              4. రోజుకు ఒకసారైనా వారిని బయటికి తీసుకు వెళ్ళి చుట్టూ పరిసరాల గురించి వారికి                                 అర్థమయ్యేలా  చెప్పడానికి ప్రయత్నించండి. 5. వారు సమాధానం ఇవ్వలేని ప్రశ్నలు వేసి ఇబ్బంది పెట్టకండి. వాళ్ళు మాట్లాడుతున్న చిన్న చిన్న మాటలకే నవ్వుతూ, వారిని ఎంకరేజ్ చేయండి. 6. వారికేం కావాలో వాళ్ళే డిసైడ్ చేసేలా ప్లాన్ చేయండి. ఉదాహరణకి ' నువ్వు పాలు తాగుతావా? లేకపోతె జ్యూస్ తాగుతావా? ' లాంటివి . అలాంటి చిన్న చిన్న పదాలను పలకడం కూడా వారికి కష్టమేం కాదు. దానితో పాటు వారిలో స్వంతంత్రంగా ఆలోచించే ధోరణి అలవడుతుంది. 7. పిల్లల్లో మాట్లాడే స్థాయి పెరిగే కొద్ది ఒక్కో ప్లేస్ గురించి కాని , వస్తువు గురించి ఎక్స్ ప్లేన్ చేయడం మొదలుపెట్టండి. వాటి గురించి తెలిసినవి చెప్పమని ప్రోత్సహించండి. 8. మీరు ఏ పని చేస్తున్నా, దాని గురించి పిల్లకు తెలియజేయండి. ఉదాహరణకు ' నేను చేతులు కడుగుతున్నాను, ' అన్నం తింటున్నాం' లాంటి వాక్యాలు పలుకుతూ, పిల్లల చేత కూడా పలికించడానికి ప్రయత్నించాలి. వాళ్ళు పలికినప్పుడల్లా మీరు హ్యాప్పీ గా ఫీల్ అవుతున్నారని వారికి అర్థమవ్వాలి. 9. ఏదైనా కొత్త ప్రదేశానికి వెళ్ళినప్పుడు అక్కడ వారికి ఏం నచ్చిందో అడిగి తెలుసుకోండి . 24 నెలల నుండి 36 నెలల వరకు     ఈ స్టేజి లో పిల్లలకు రకరకాల ఆటల్ని నేర్పించవచ్చు. 1. లోటో గేమ్స్, లేదా ఇతర మ్యాచింగ్ గేమ్స్. ఆడించడం. 2. మీరు ఇంట్లో చేసే చిన్న చిన్న పనుల్లో వాళ్ళు కూడా ఇన్వాల్వ్ అయ్యేలా చేయడం. 3. పిల్లలతో పాటు కూర్చుని కార్టూన్స్ బుక్స్ ని చదవడం. మీకు ఏది నచ్చిందో ఎందుకు నచ్చిందో వారికి అర్థమయ్యేలా చెప్పడం. 4. వీటన్నింటితో పాటు ముఖ్యంగా గమనించాల్సిన విషయం ఏంటంటే .. , మీరు పిల్లలతో ఏది చేయించాలనుకున్నా , వాళ్ళు ఇష్టపడి చేసేలా జాగ్రత్త పడాలి. బలవంతంగా చేయించడానికి ప్రయత్నించకూడదు. వాళ్ళు మీకు చెప్పుకునే ఏ చిన్న విషయాన్ని కొట్టి పారేయకూడదు , వాళ్ళు చెప్పదలుచుకున్నది ముందుగానే మీకు అర్థమైనా , దానిని మధ్యలోనే ఆపకుండా ఓపికగా విని వారికి అర్థమయ్యే రీతిలో సమాధానం చెప్పాలి.           మనిషి జీవితంలో బాల్యం మధురాతి మధురమైనదే అయినా , పరిపూర్ణ వ్యక్తిత్వానికి           కూడా పునాది బాల్యమే. కాబట్టి బాల్యం నుండే కొద్దిగా ప్లాన్డ్ గా ఉంటే వారికి మంచి భవిష్యత్తును           ఇవ్వగలుగుతాం .        

  సౌండ్ స్లీప్ కోసం కొన్ని టిప్స్ రోజంతా చదువు, ఆటలతో అలసిపోయిన పిల్లలకు సౌండ్ స్లీప్ అవసరం. టైంకు పడుకోవడం, తిరిగి ఉదయాన్నే లేవడం అలవాటు చేయాలి. సాలిడ్ స్లీప్ తో హాయిగా పడుకోవాలి. అప్పుడే అది హెల్దీ స్లీప్ అనిపించుకుంటుంది. సౌండ్ స్లీప్ కోసం కొన్ని టిప్స్, టెక్నిక్స్ ఉన్నాయి. రోజూ ఒకే సమయానికి పడుకోవడం అలవాటు చేసుకోవాలి. టైంలీ స్లీప్ వల్ల ఆ సమయానికి అలారం కొట్టినట్టు నిద్ర ముంచుకొచ్చేస్తుంది. ఒక్కోరోజు ఒక్కో సమయానికి పడుకుంటే నిద్ర అంత త్వరగా రాకపోవచ్చు. మర్నాడు పొద్దున లేవడం కష్టమౌతుంది. పెద్దలకు ఉన్నంతగా ఆలోచనలు, ఆందోళనలు చిన్నారులకు ఉండవు కనుక వాళ్లకి తేలిగ్గానే నిద్ర పడుతుంది. అయితే అది కలత నిద్ర కాకూడదు. పిల్లలు సాలిడ్ గా పడుకోవాలి. సౌండ్ స్లీప్ అవసరం. సౌండ్ స్లీప్ రోజంతా పడిన అలసటను తగ్గిస్తుంది, సేద తీరుస్తుంది. సంతోషాన్ని అందిస్తుంది. సౌండ్ స్లీప్ నుండి మేల్కొన్న తర్వాత ఎంతో హాయిగా, ఆనందంగా ఉంటుంది. శారీరక, మానసిక ఎదుగుదలకూ సాలిడ్ నిద్ర అవసరం. గాఢంగా నిద్రపోయి లేచిన పిల్లలకు బడలిక తెలీదు. సగంసగం నిద్ర పొతే మట్టుకు అనీజీగా, అనారోగ్యంతో బాధపడుతున్నట్టుగా ఉంటుంది. పెద్దలు ఎప్పటికప్పుడు పిల్లల్ని గమనిస్తూ ఉండాలి. సౌండ్ స్లీప్ ఉందో లేదో చూడాలి. ఒకవేళ లేదని గమనిస్తే సౌండ్ స్లీప్ ఎందుకు కరువైందో తెలుసుకోవాలి. ఆదమరచి నిద్రపోయేలా చేయాలి. సౌండ్ స్లీప్ కరువైన పిల్లల విషయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. సౌండ్ స్లీప్ కు ఇంకొన్ని టిప్స్, టెక్నిక్స్ ఏమిటంటే, పడుకునే ముందు తప్పకుండా స్నానం చేసేలా చూడాలి. గ్లాసుడు గోరు వెచ్చని పాలు ఇవ్వాలి. దేని గురించి అయినా బాధపడుతున్నారెమో కనుక్కోవాలి. ఒకవేళ అలాంటిది ఉంటే దాన్నుండి బయటపడేలా చేయాలి. ఏవైనా పీడకలలు వస్తుంటే, అందుకు కారణం ఏమిటో తెలుసుకుని ఆ భయాలను తగ్గించేందుకు కౌన్సిలింగ్ ఇవ్వాలి.