ఎన్ని నిముషాలయ్యాయో గుర్తులేదు.
    
    నేను పక్కకి తిరిగేవరకు అతనికి మాత్రం కాలం ఎంత గడిచిందో తెలియలేదు.
    
    అతన్ని అలానే అదిమిపెట్టి కాలు మీద వేశాను.
    
    లంగా, బ్రా కలిసి నా శరీరం మీద ఒకేసారి కుట్ర పన్నినట్లుగా విడిపోయాయి.
    
    పాపం శరీరం ఒంటరిగా పోరాటానికి సిద్దమైపోయి, అతన్ని కప్పుకోవడానికి ప్రయత్నించింది.
    
    నేనే పైన చేరినా అతను లేవలేదు.
    
    నా వెనక పై కప్పుకు వేలాడుతున్న బల్బు అతని కళ్ళల్లో వెలుగు పొగలై లేస్తోంది.    

    "బ్యాటిల్ షిప్ ఇన్ యాక్షన్" అన్నాను కళ్ళతో నావేపు చూడమన్నట్లు.    

    అట్లతద్దప్పుడు ఓ అమ్మాయి ఊయల ఎక్కి వుంటే దానిని ఊపడం ఎంత ఉపయోగపడుతుందో నాకప్పుడు తెలిసింది.
    
    ఎదురుగ్గా వున్న గులాబ్ జామ్ ని తినే శ్రమ లేకుండానే దాని తీసి నాలుకకు తగులుతున్నట్లు అతను సుఖపడుతున్నాడు.
    
    ఆ క్షణమే అర్ధమైంది నేను గెలిచానని.
    
    ఇక రెండో రోజునుంచీ వాడు నావెనక తిరిగే కుక్కే అయిపోయాడు. నా పైట తగిలితే చాలు పడకగదివైపు చూసేవాడు.
    
    అంతవరకు ఏమీ అనుభవం లేని నేను అంత జాణతనంగా ఎలా ప్రవర్తించానో నాకు ఇప్పటికీ అర్ధం కాదు. అవసరం అలాంటిది కాబోలు.
    
    మాధవి ఆ తర్వాత ప్రయత్నించింది గానీ ఫలితం దక్కలేదు. వాడు నాకు బానిసే అయిపోయాడు.
    
    ఆమెను బాధపెట్టడం ఇష్టంలేకే వున్నదంతా అమ్ముకుని ఈ ఊరికి వచ్చేశాం.
    
    లాలస చెప్పడం పూర్తి చేసింది.
    
    సుజన ఏమీ మాట్లాడలేదు. మొత్తం పరిస్థితులన్నిటినీ విశ్లేషించుకుంటోంది.
    
    టైమ్ అయిందని హెచ్చరించడానికన్నట్లు గుడిలో ఎవరో మంగళ హారతి పాడుతున్నారు.
    
    వాళ్ళిద్దరూ ఇంటికి బయల్దేరారు.
    
                                                           *    *    *    *    *
    
    తహ్లాపును ఎవరో దబదబా బాదుతుంటే మెలకువ వచ్చింది చిట్టిబాబుకి.
    
    తలంతా భారంగా వుంది. రాత్రి తాగిన మందు ఇంకా దిగనట్టు మెదడంతా మొద్దుబారి పోయింది. మందుకు తోకలా వుండే హాంగోవర్ అంటే అతనికి అసహ్యం. అందుకే తాగేప్పుడు లిమిట్ గా, తాగాలనుకుంటాడు కానీ తాగిన ప్రతీసారీ ఆవేశాన్ని అణచుకోలేక పీకలదాకా తాగేస్తుంటాడు.
    
    ఈమధ్య హాంగోవర్ మునుపటిలా రాకపోయినా ఏదో ఇబ్బందిగా వున్న ఫీలింగ్ మాత్రం పోలేదు.
    
    కాలింగ్ బెల్ మోగించకుండా అలా తలుపును బాదేది నిరంజన్ ఒక్కడే అతను మెడికల్ రిప్రజంటేటివ్ ఆంధ్రాలోని నెల్లూరు. ఒంగోలు జిల్లాలలో తిరిగి మద్రాసు వస్తుంటాడు. చిట్టిబాబుకి మంచి ఫ్రెండ్. ఇప్పుడొచ్చింది కూడా అతనేనని నుకుంటూ మొలకు లుంగీ చుట్టుకుని వచ్చి తలుపు తెరిచాడు.
    
    ఎదురుగ్గా కనిపిస్తున్న వాళ్ళను చూసి ఒక్కసారిగా చిన్న జర్క్ ఇచ్చాడు అతను.
    
    "చిట్టిబాబు ఇరుక్కానా?" అని అడిగాడు శరవణన్.
    
    ఆయన ఫుల్ గా పోలీసు డ్రస్ లో వున్నాడు. క్యాప్ కూడా చేతులోకి తీసుకోలేదు. చేతుల్లోని చిన్న లాఠీని అటూ ఇటూ తిప్పుతున్నాడు ఆయన వెనక మరో నలుగురు కానిస్టేబుల్స్ వున్నారు.
    
    చిట్టిబాబుకి చెమటలు పట్టాయి. హాంగోవర్ డేగలా ఎగిరిపోయింది. దానిస్థానే భయం రాబందులా వచ్చి వాలింది.
    
    "నేనే.... నేనే" కంగారుగా చెప్పాడు.
    
    "యు ఆర్ అండర్ అరెస్ట్" మరో మాట మాట్లాడకుండా శరవణన్ తన వెనక్కి చేయి చాచాడు. కానిస్టేబుల్ బేడీలను ఆయన చేతుల్లో వుంచాడు.
    
    "ఎందుకు సార్!" గొంతు తడారిపోతుంటే ఎంతో శాంతిని కూడగట్టుకుని అడిగాడు చిట్టిబాబు.
    
    "నిరంజన్ ని మర్డర్ చేసినందుకు"
    
    చిట్టిబాబు కళ్ళు ఒక్కసారిగా గిర్రున తిరిగాయి. గుండెల్లోని భయం ఒళ్ళంతా పాకింది. మనిషి తూలి ముందుకు పడబోయి నిలదొక్కుకున్నాడు.
    
    "మర్డరా?"
    
    "ఆమా - నేత్తి రాత్రి ఆయన నెల్లూరు నుండి మద్రాసుకు వచ్చినాడు నువ్వూ ఆయన కలిసి తాగారు. అప్పరం నువ్వు అతన్ని మర్డర్ చేశావని రిపోర్ట్ ద్వారా అందినది. అందుకప్పా నిన్ను అరెస్ట్ చేస్తా వుండాం"
    
    "సార్ ఇదంతా అబద్దం సార్. వాడ్ని చూసి పదిరోజులయింది సార్. నిన్ననేను అతన్ని చూడలేదు. అతనితో డ్రింక్ తీసుకోలేదు" చిట్టిబాబు అరిచాడు తాను రాత్రి ఎక్కడ వున్నాడో, ఏ ఫ్రెండ్ తో తాగాడో అదే టోన్ లో చెప్పాడు.
    
    అంతా విన్నాక చెప్పాడు శరవణన్. "నువ్వు ఎంత అరిచినా లాభం లేదప్పా. నువ్వే ఈ మర్డర్ చేశావని మా దగ్గర బలమైన ఫ్రూఫ్ వుందప్పా"
    
    ఇంక ఏం చెప్పాలో తోచలేదు చిట్టిబాబుకి. పోలీసులతో వ్యవహారం ఎంత దారుణంగా వుంటుందో తెలుసు. ఇక ఖండించి లాభం లేదు. తనను ఎవరో ఈ హత్యలో ఇరికించారని తెలుస్తూనే వుంది. అయితే ఇది ఎవరి పనో అర్ధంకాలేదు. నిరంజన్ శత్రువులెవరో హత్యచేసి, దీనిని తనమీదకి నెట్టేసి వుంటారని అనిపించింది. సమయానికి అమ్మా నాన్న ఇంట్లో లేకపోవడం అంత బాధలోనూ ఊరట కలిగించింది. వాళ్ళు వారం రోజుల క్రితం దక్షిణదేశ యాత్రని వెళ్ళారు. మరో వారం రోజుల వరకూ రారు.
    
    తను ఈ హత్య చేయలేదు. కాని పోలీసుల్ని ఎలా నమ్మించాలో తెలియడం లేదు అతనికి. శరవణన్ ఒకసారి సుజన విషయంలో వార్నింగ్ ఇవ్వడం గుర్తు వచ్చింది. ఆ కక్ష కొద్దీ తనను పోలీస్ స్టేషన్ లో ఏం చేస్తాడోనన్న భయం పుట్టుకొచ్చింది. కానీ ఏమీ చేయలేని నిస్సహాయత.
    
    "వెళ్లి ఫేస్ వాష్ పుణ్ణిట్ వా, మేందా వెయిట్ చేస్తావుంటుము" అన్నాడు శరవణన్.
    
    హత్య చేశావని పోలీసులు ఇంటికొచ్చిన సమయంలో కాలకృత్యాలు తీర్చుకోగలమా? అదే సందేహంతో లోపలికెళ్ళాడు చిట్టిబాబు.
    
    ఏం చేస్తున్నా ఈ హత్యా నుంచి ఎలా తప్పించుకోగలనా అనే ఆలోచించాడు.
    
    పోలీసుల దగ్గరున్న ప్రూఫ్ ఏమిటో ఎంత ఊహించినా తట్టడం లేదు. దానిమీదే ఈ కేసు నిలుస్తుందా లేదా అన్నది ఆధారపడి వుంటుంది.
    
    మరో పదినిముషాలకు తయారయ్యాడు అతను. గడినుమ్చి బయటికి రాగానే శరవణన్ బేడీలు వేశాడు.
    
    బయట నుంచి జీపు హారన్ వినిపిస్తోంది.
    
    మౌనంగా పోలీసుల వెంట నడిచాడు. అప్పటికే ఆ వీధిలోని చాలామంది ప్రహరీగోడలకు తమ తలల్ని తగిలించారు. సైలెన్సర్ తీసేసి వీధిలో స్పీడ్ గా మోటార్ బైక్ నడిపే అతనికి బేడీలు వేయడం చాలామందికి ఆనందాన్ని కలుగజేసింది. ఆ ఆనందాన్ని వాళ్ళు దాచుకోకుండా ప్రదర్శించడాన్ని చూస్తుంటే మరింతగా కిందకు తల వాల్చేశాడు అతను.