వేసవిలో పూల సొగసులు
సెగలు కక్కే వేసవిలో మనసూ, శరీరం చల్లదనాన్ని కోరుకోవడం సహజం. అందుకే మీ వస్త్రధారణలో పూలకు ప్రాధాన్యం ఇచ్చి చూడండి.
మీ అల్మారాలో పూల ప్రింట్లు ఉన్న దుస్తులు ఉన్నాయా? కనీసం పూల రంగుల్లోని టాప్‌లు ఉన్నా ఫరవాలేదు. అవన్నీ మీ మనసుని హాయిగా ఉంచుతాయి. పైజామా, పలాజోలు లాంటివయినా ఆ ప్రింట్లలో ప్రయత్నించి చూడండి.
* ఉక్కకు తాళలేకపోతున్నాం అనుకునే వారు.. చిన్నచిన్న పూల ప్రింట్ల టాప్‌లు వేసుకుని అడుగున కాస్త వదులుగా ఎలాంటి డిజైను లేని సాదా ప్యాంట్లో, స్కర్టులో వేసుకోవచ్చు.
* పైన పూల ప్రింట్లు వేసిన కుర్తీలకు జీన్స్ జతయితే అదిరిపోతుంది. కాలంతో సంబంధం లేని ఈ ఫ్యాషన్‌కి చిన్న మార్పులు చేసుకుంటే ఈ వేసవిలో మరింత ట్రెండీగా నిలిచిపోవచ్చని అంటున్నారు ఫ్యాషన్ నిపుణులు.
* మా దగ్గర ఫ్లోరల్ప్రింటు కుర్తాలు, జీన్స్ లేవు అంటారా? అయితే ఒక చక్కని పూల స్కార్ఫ్ కానీ, దుపట్టా కానీ´ కొనేయండి. అటు టాప్‌లపైనా పనికొస్తాయి.. కుర్తాలకూ సరిపోతాయి.
* మెడలో వేసుకునే హారాలూ, హెయిర్‌క్లిప్స్, బ్యాగులూ, బ్రేస్లెట్లూ, టోపీలూ, చెప్పులు వీటికి పూల డిజైన్లని ఎంపిక చేసుకుని చూడండి.
* సాయంత్రం పూట వేడుకలకు వెళ్లేవారు పూల ప్రింట్లున్న మ్యాక్సీలు, గౌన్లు ఎంచుకోవచ్చు. అలాగే పూల ప్రింటుతో ఉన్న జార్జెట్చీరను కట్టుకున్నా చాలా ఆహ్లాదంగా ఉంటుంది. ఆకట్టుకునేలా కూడా కనిపిస్తారు.
