ముఖంపై ముడుతలు పోవాలంటే...!

 


వాతావరణంలో మార్పులు, కాలుష్యం వంటివి చర్మానికి చేసే కీడు అంతా ఇంతా కాదు. జీవం కోల్పోయి, ముడుతలు పడిపోయి వృద్ధాప్యం అప్పుడే వచ్చేసిందా అన్న ఫీలింగ్ వస్తుంది. అలాంటప్పుడు ఈ చిట్కాలు పాటించారనుకోండి... ముడుతలు మాయమైపోతాయి. ముఖం మళ్లీ మెరిసిపోతుంది.


- పెరుగులో కాసింత కొబ్బరినూనె, ఆలివ్ నూనె కలిపి రోజూ ముఖానికి పట్టించాలి. బాగా ఆరిన తరువాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. 

- పైనాపిల్ జ్యూస్ లో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది. ఇది యాంటీ ఏజింగ్ ఏజెంట్ లా పని చేస్తుంది. కాబట్టి పైనాపిల్ గుజ్జుతో తరచూ ముఖాన్ని రుద్దుకుంటూ ఉంటే మంచి ఫలితం ఉంటుంది. 

- బ్రౌన్ షుగర్ ను గోరువెచ్చని పాలతో కొద్దిగా తడిపి, దానితో ముడుతలు ఉన్నచోట రుద్దుకుంటూ ఉంటే మెల్లగా ముడతలు పోతాయి.

- టొమాటో గుజ్జులో ఆలివ్ ఆయిల్ కానీ ఆవనూనె కానీ కలిపి వారానికి రెండు మూడుసార్లు ప్యాక్ వేసుకున్నా మంచిదే. 

- దాల్చినచెక్క పొడిలో పెరుగు, నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవాలి. ఇరవై నిమిషాలు ఉంచి కడిగేసుకోవాలి. 

- గ్రీన్ టీలో పెరుగు కలిపి ముఖానికి రాసి బాగా మసాజ్ చేసుకోవాలి. తర్వాత చల్లని నీటితో కడిగేసుకోవాలి. 

- అరటిపండులో పెరుగు, బాదం నూనె కలిపి ప్యాక్ వేసుకుని, అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో కడిగేసుకోవాలి. 

- పసుపులో చెరకురసం కలిపి వేసుకునే ప్యాక్ కూడా మేలు చేస్తుంది.    

- కోడిగుడ్డు తెల్లసొనలో అలొవెరా జిగురు కలిపి ముఖానికి పూసుకోవాలి. తర్వాత మునివేళ్లతో ముఖమంతా మెల్లగా మసాజ్ చేయాలి. ఆపైన నీటితో కడిగేసుకోవాలి. 

 

చూశారుగా ఎన్ని చిట్కాలు ఉన్నాయో. మరి ముఖంపై ముడతలు వచ్చినంత మాత్రాన దిగులు పడటం దేనికి? వీటిని ట్రై చేసి చూడండి.

-Sameera