మరో పది గంటల తర్వాత-

 

    సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ దగ్గర్లో వున్న...

 

    లాడ్జీలో...

 

    ఓ డబుల్ రూమ్ లో...

 

    అద్దంలో తనను తాను చూసుకుని లక్ష్మి మురిసిపోతోంది.

 

    లేత గులాబీరంగు చీర, జాకెట్టులో అప్పుడే పూచిన గులాబీ పువ్వులా వుంది లక్ష్మి!

 

    కొన్ని గంటల సమయంలో ఆమె స్వరూపం పూర్తిగా మారిపోయింది.

 

    ఆ సమయంలో-

 

    లక్ష్మి సరదాగా చౌకబారు హోటల్ ని చూడటానికొచ్చిన లక్షాధికారి కూతురులా వుంది!

 

    షాంపూ పరిమళాల్ని వెదజల్లుతున్న పొడవాటి జుత్తు, తెల్లని దేహఛాయ, అంతంత కళ్ళకు తీర్చిదిద్దిన కాటుక, ముక్కుకి ఎర్రటి పొడి... మెడలో ముత్యాలపూసల గొలుసు, రోల్డుగోల్డువైనా బంగారంలా మెరుస్తున్న గాజులు, జడ తాచుపాములా వుంది జడ చివర రిబ్బన్ ని ముడివేసుకుంటోందామె.

 

    రూమ్ బయట కూర్చున్నాడు కుమారస్వామి, నర్సింహ.

 

    "చూశావా పిల్ల ఎలాగుందో! మేకప్ వేసి బొంబాయి తీసుకెళితే మాధురీదీక్షిత్ బాబులా వుంటుంది. ఒరేయ్ స్వామీ! ఒక్కసారి ముద్దెట్టుకోమంటావేటి?" ఉత్సాహంగా అన్నాడు నర్సింహ.

 

    కుమారస్వామి విసుక్కున్నాడు.

 

    "అదే వద్దని చెప్పాను. ఆడపిల్ల కావలిస్తే ఇంకో చోటికెళ్ళు... డబ్బులు పడేయ్! కానీ బ్రోకరు బిజినెస్సయినా కొన్ని సూత్రాలు పాటించాలని లక్షసార్లు చెప్పాను. పనసపండులాంటి పిల్ల... మగోడి రుచి తెలీని పిల్ల... ఆరువేలు ఖర్చుపెట్టాం. మూడింతలు రావాల... ఒరేయ్ నర్సింహా ఒకటి చెబుతున్నాను వినుకో! బిజినెస్ లో జనరల్ సూత్రాలు కాకుండా, పర్సనల్ సూత్రాలుంటాయి. మనం ఏర్పాటు చేసుకున్న సూత్రాల్ని మనవే దాటేశావనుకొ౧ మరి మనం బిజినెస్సుకి పనికిరాం. అడుక్కోవాల... గుర్తుంచుకో" సీరియస్ గా చెప్పాడు కుమారస్వామి.

 

    "నువ్వెప్పుడూ ఇంతే..." చిరాకుపడి "ఇంతకీ ఆ మార్వాడీ సేట్ కి రేటెంత చెప్తావ్?" అడిగాడు నర్సింహ వుత్సాహంగా.

 

    "నువ్వు కంగారుపడి నన్ను కంగారుపెట్టకు. బంగారు బాతుని కోసుకో కూడదు. అమ్ముకోవాల... కేసుని ఎలా డీల్ చేస్తాడో చూడు. ఈ దెబ్బతో మన జాతకం మారిపోవాల..." హుషారుగా నవ్వుతూ అన్నాడు కుమారస్వామి.

 

    అదే సమయంలో-

 

    హోటల్ ముందు బ్లాక్ కలర్ అంబాసిడర్ కారు ఆగింది.

 

    అందులోంచి దిగాడు అరవైఏళ్ళ మార్వాడీ సేఠ్ చంపక్ లాల్.

 

    సేఠ్ ని చూడగానే పరుగు పరుగున వెళ్ళి ఆహ్వానించి లోనికి తీసుకొచ్చారు యిద్దరూ.

 

    రూమ్ లోకి అడుగుపెట్టిన సేఠ్ రెబెకా సుందరిలా నిలబడిన లక్ష్మిని చూడగానే నిర్ఘాంతపోయాడు.

 

    లక్ష్మి బొంబాయి రేటుని మనసులోనే క్యాలిక్యులేట్ చేసుకున్నాడు సేఠ్ చంపక్ లాల్!

 

    "మాల్ అచ్చాహై... బహుత్ పసంద్ హై..." ఖుషీగా నవ్వుతూ అన్నాడు చంపక్ లాల్.

 

    చంపక్ లాల్ రూమ్ లోంచి బయటకు తీసుకొచ్చారిద్దరూ! పక్కనే వున్న బార్ వైపు నడిచారు ముగ్గురూ.


                                                   *    *    *    *


    "మాల్ అచ్చాహై భాయ్! కానీ పల్లెటూరి పిల్ల..." చంపక్ లాల్ వ్యాఖ్యానించాడు.

 

    "రేటు... రేటు..." నర్సింహ టెన్షన్ గా అన్నాడు.

 

    "దస్ హజార్..." ఆలోచిస్తూ చెప్పాడు చంపక్ లాల్.

 

    "పదివేలా? మా ఖర్చులే పదివేలయ్యాయి. యాభైవేలు... ఒకటే మాట..." అన్నాడు కుమారస్వామి.

 

    "లేతపిల్ల! ముక్కూ, కళ్ళూ బాగున్న ఆ మాత్రం సరిపోతుందా? ఎంత తిండి పెట్టాలి... ఎంత ట్రైనింగివ్వాలీ... బజార్లోకి తీసికెళ్ళేళోపు నాకెంత ఖర్చవుతుందో నువ్వాలోచించావా?" చంపక్ లాల్ అన్నాడు.

 

    "పురుషుడి చెయ్యి పడని పిల్ల. తర్వాత నీ యిష్టం. సాయంత్రం ఏడు గంటలవరకూ టైమిస్తున్నాను...ఆలోచించుకుని ఫోన్ చెయ్యి..." కుమారస్వామి లేచి నిలబడ్డాడు.

 

    "నలభై ఆఖరి మాట" అన్నాడు చంపక్ లాల్.

 

    "ఇంకో అయిదు వేలు కలుపు" అన్నాడు కుమారస్వామి.

 

    హేండ్ బ్యాగ్ లోంచి డబ్బు తీసి టేబుల్ మీద పెట్టాడు చంపక్ లాల్.

 

    "ఇవాళే బొంబాయి ఎక్స్ ప్రెస్ కి తీసికెళ్ళండి. ఫోను చేసి చెప్తాను" బొంబాయి విక్టోరియా టెర్మినల్ లో దిగి ఎక్కడికి వెళ్ళాలో, ఎలా వెళ్ళాలో చెప్పాడు చంపక్ లాల్.

 

    "ఈ పిల్లని ఎలా తీసుకెళ్తారు... మూడో కంటివాడికి క్కూడా అనుమానం రాకుండా తీసికెళ్ళాలి" జాగ్రత్తలు చెప్పాడు చంపక్ లాల్.

 

    "ఆ విషయం మా కొదిలేయ్ గురూ" కుమారస్వామి హుషారుగా అన్నాడు.


                               *    *    *    *


    నాంపల్లి రైల్వేస్టేషన్....

 

    బొంబాయి ఎక్స్ ప్రెస్ బయల్దేరడానికి సిద్ధంగా వుంది.

 

    రైల్లో సెకండ్ క్లాస్ కంపార్టుమెంట్లో సీట్లో కూర్చుంది లక్ష్మి. ఇంజెక్షన్ యివ్వడం వల్ల మత్తుగా కూర్చుంది లక్ష్మి. స్పృహలోనే వున్నా ఆమెకేం తెలీటం లేదు.

 

    కళ్ళముందు మసక మసక చీకటి. ఆమెకు ఎదురుగా కూర్చున్న కుమారస్వామి పంచె, లాల్చీలో పెద్దమనిషి తరహాగా కూర్చున్నాడు. ఆ ప్రక్కనున్న నర్సింహ బ్యాగీ ఫ్యాంటు షర్టులో వేషం మార్చుకుని కూర్చున్నాడు. వాళ్ళను చూస్తే, ఎవరికీ ఏ విధమైన అనుమానం రాదు.

 

    నెలకు రెండుసార్లు రకరకాల వేషాలతో, అమ్మాయిల్ని బొంబాయికి తీసికెళ్ళి అమ్మేసే విద్యలో ఆరితేరినవాడు కుమారస్వామి.

 

    రాత్రంతా ఆ కంపార్టుమెంట్లోకొచ్చే కొత్త వ్యక్తుల్ని అప్రమత్తంగా పరిశీలిస్తూ కూర్చున్నాడు కుమారస్వామి.


                                                  *    *    *    *


    నాంపల్లి రైల్వేస్టేషన్....

 

    బొంబాయి ఎక్స్ ప్రెస్ బయల్దేరడానికి సిద్ధంగా వుంది.

 

    రైల్లో సెకండ్ క్లాస్ కంపార్టుమెంట్లో సీట్లో కూర్చుంది లక్ష్మి. ఇంజెక్షన్ యివ్వడం వల్ల మత్తుగా కూర్చుంది లక్ష్మి. స్పృహలోనే వున్నా ఆమెకేం తెలీటం లేదు.

 

    కళ్ళముందు మసక మసక చీకటి. ఆమెకు ఎదురుగా కూర్చున్న కుమారస్వామి పంచె, లాల్చీలో పెద్దమనిషి తరహాగా కూర్చున్నాడు. ఆ ప్రక్కనున్న నర్సింహ బ్యాగీ ఫ్యాంటు షర్టులో వేషం మార్చుకుని కూర్చున్నాడు. వాళ్ళను చూస్తే, ఎవరికీ ఏ విధమైన అనుమానం రాదు.

 

    నెలకు రెండుసార్లు రకరకాల వేషాలతో, అమ్మాయిల్ని బొంబాయికి తీసికెళ్ళి అమ్మేసే విద్యలో ఆరితేరినవాడు కుమారస్వామి.

 

    రాత్రంతా ఆ కంపార్టుమెంట్లోకొచ్చే కొత్త వ్యక్తుల్ని అప్రమత్తంగా పరిశీలిస్తూ కూర్చున్నాడు కుమారస్వామి.


                                *    *    *    *