తేనెతో పెదాలకు మరింత అందం!

మొహానికి అందాన్ని తెచ్చి పెట్టేవి పెదాలంటే మీరూ  ఒప్పుకుంటారు కదూ. అలాంటి పెదాలు మరింత ఎర్రగా మెరిసిపోవాలంటే వాటిని మరికాస్త ఎక్కువగా పట్టించుకోవాల్సిందే. కొంతమందికి టెన్షన్ లో పెదాలు కోరికే అలవాటు ఉంటుంది. అది మానుకుంటే చాలు పెదాలు బండగా తయారవ్వకుండా ఉంటాయి. కొంత మంది పెదాలు నల్లగా ఉండి అందాన్ని తగ్గిస్తాయి. అలాంటివారు రాత్రి పడుకునే ముందు నిమ్మరసాన్ని రాసుకుని పడుకుంటే మంచి ఫలితం కనిపిస్తుంది. పెదాలపై ఉండే నల్ల మచ్చలు కూడా మాయమవుతాయి. ఇలాగే ఇంకొన్ని చిట్కాలని చూద్దామా.


* మూడు స్పూన్ల పంచదార పొడిలో రెండు స్పూన్ల వెన్న కలిపి పేస్ట్ లా చేసి పెదాలకి పట్టించి ఉంచి ఒక గంట తర్వాత చన్నీళ్ళతో కడుగుకోవాలి.పంచదార డెడ్ స్కిన్ సెల్స్ ని తీసేస్తుంది,వెన్న మృదుత్వాన్ని ఇస్తుంది.

* బీట్రూట్ పేస్టు ని రాత్రి పడుకునే ముందు పెదాలకి రాసుకుని ఉదయాన్నే కడిగేసుకున్నా పెదాలు ఎరుపురంగులోకి మారతాయి.

* ఒక స్పూన్ నిమ్మరసం, కొబ్బరి నూనె, రెండు స్పూన్ల పంచదార పొడి కలిపి పేస్ట్ లా చేసి ఉంచుకుంటే వారం రోజులు నిలవ ఉంటుంది. ఈ పేస్ట్ పెదాలకి అప్లై చేసినా మంచి ఫలితం ఉంటుంది.

* ఒక స్పూన్ స్ట్రాబెర్రీ పేస్ట్ లో రెండు స్పూన్ల పెట్రోలియం జెల్లీ కలిపి పెదాలకి పట్టిస్తే పెదాలు స్ట్రాబెర్రీ  రంగులోకి మారిపోతాయి.

*   మనకి సులువుగా దొరికేవి గులాబి రేకులు. వాటిని ముద్దలా చేసి పెదాలకి పట్టించి ఒక అరగంట తర్వాత కడిగేసుకుంటే చాలు అందమైన పెదాలు మీ సొంతమవుతాయి.

ఇలాంటివి చేస్తూ వీటితో పాటు తగినంత నీళ్ళు తాగటం వాళ్ళ కూడా పెదాలు ఆరోగ్యంగా కనిపిస్తాయి. నీళ్ళతో పాటు ఆయా కాలాల్లో దొరికే పళ్ళు తినటం వల్ల కూడా పెదాలు అందంగా కనిపిస్తాయి. ఇలా కొద్దిపాటి శ్రద్ధ చూపిస్తే చాలు మాములుగా ఉండే మీ పెదాలు ఎర్రని ద్రాక్ష పళ్ళలా మెరిసిపోతాయి.

   కళ్యాణి...