Read more!

మోచేతులకు మృదుత్వం ఇలా...

మోచేతులకు మృదుత్వం ఇలా... అరచేతులు,  వెనక భాగం ముడతలతో, గరుకుగా వున్నా, అలాగే మోచేతుల వెనక కూడా గరుకుగా, నల్లగా వున్నా.. ఇంట్లోనే చిన్న చిన్న ప్రయత్నాలతో వాటిని మృదువుగా చేసుకోవచ్చు.  ఎలా అంటే... 1. దోసకాయ తో చర్మం మృదువుగా .. దోసకాయలోని గింజలు తీసేసి గుజ్జుగా చేసుకోవాలి. దానిలో ఒక అరకప్పు మజ్జిగ , ఓ చెమ్చా ఉప్పు కలిపి (రాళ్ళ ఉప్పు అయితే మంచిది) , ముందుగా అరచేతులు, మోచేతులు దగ్గర వేడి నీటి బట్టతో తుడవాలి.  వేడినీటి వల్ల చర్మం మీద వున్న స్వేద గ్రంధులు బాగా తెరుచుకుంటాయి.  ఆ తర్వాత దోసకాయ మిశ్రమాన్ని అరచేతి వెనక, మోచేతి వెనక భాగాలకి రాసి  మృదువుగా రుద్దాలి. ఓ పది నిమిషాల తర్వాత శుభ్రంగా కడుక్కోవాలి. మజ్జిగలో వుండే లాక్టిక్ ఆమ్లం , ఉప్పు మృత చర్మ కణాలను తొలగించి నలుపు విరిగేలా చేస్తే, దోసలో వుండే పోషకాలు చర్మాన్ని మృదువుగా మారుస్తాయి. 2. సెనగపిండి తో నలుపు మాయం సెనగపిండి లో కొంచం పసుపు, ఓ చెమ్చా నిమ్మ రసం కలిపి మోచేతుల్లో నల్లగావున్న ప్రాంతంలో పట్టించి ఓ పావుగంట తర్వాత గోరు వెచ్చటి నీటితో కడిగేయాలి. ఆ తర్వాత  వేడినీటి టవల్ ని చుట్టి ఓ పది నిముషాలు ఉంచితే అరచేతి వెనక, మోచేతి వెనక వుండే నలుపు క్రమంగా తగ్గిపోతుంది. 3.  మరికొన్ని .... *  ఓ కప్పు పెరుగులో చెమ్చా బాదాం పొడి కలిపి చేతులకి పట్టించి.. బాగా ఆరాక గోరువెచ్చటి నీటితో కడిగేయాలి. *  ఓ చెమ్చా కొబ్బరినూనె, అరచెంచా నిమ్మరసం కలిపి నల్లగా వున్న ప్రాంతంలో పట్టించి, ఆతర్వాత  గోరువెచ్చటి నీటిలో తడిపిన బట్ట చుట్టి, పదినిమిషాల తర్వాత కడగాలి. *  మోచేతి వెనక భాగానికి ప్రతిరోజు బాదం నూనె రాసినా మంచి ఫలితం వుంటుంది. * అరచేతి వెనుక, మోచేతి భాగాలు తొందరగా డ్రై అయిపోతాయి కాబట్టి వాటికి రోజు తగినంత తేమ అందేలా చూసుకోవాలి. -రమ

ఇవే అసలైన సౌందర్య సాధనాలు

  *ఇవే అసలైన సౌందర్య సాధనాలు*     ప్రతీసారి మనం ముఖ సౌందర్యం పెంచుకోవడం ఎలాగో మాట్లాడుకుంటాం. ఫౌండేషన్, మస్కారా వంటివి మన అందాన్ని పెంచేందుకు ఎలా ఉపయోగపడతాయో, వాటిని ఎలా వాడుకోవాలో తెలుసుకుంటాం. అయితే ఈ ఉమెన్స్ డేకి మీ అసలైన సౌందర్యాన్ని పెంచుకునే ప్రయత్నం చేయండి. అవి శాశ్వత అందాన్ని అందిస్తాయి అంటున్నారు నిపుణులు. వారి ఆ సూచనలేంటో చూద్దామా! ఆత్మవిశ్వాసమే ఫౌండేషన్ మేకప్ అందంగా కుదరాలంటే ఫౌండేషన్ తప్పనిసరి. అంటే అంతర్లీనంగా మన అందం పెంచడంలో తోడ్పడే ఫౌండేషన్ ముఖ్యమైనది. ఆత్మవిశ్వాసం కూడా ఫౌండేషన్ లాంటిదే. మనదైన ముద్ర వేయాలన్నా, పదిమందిలో ఒకరిగా నిలబడాలన్నా ఆత్మవిశ్వాసంతో నిటారుగా నిలబడటం ముఖ్యం.  అలా ఆత్మవిశ్వాసం మనలో పొంగి పొర్లాలంటే దానికి కొంచెం కృషి చేయాలి. మొదట మన ప్రత్యేకతలు ఏంటో గుర్తించాలి. గుర్తించాక వాటిని ఓచోట రాయాలి. వేరేవారి నుంచి మనల్ని ప్రత్యేకంగా నిలబెట్టే అంశాలు ఏంటో తెలిశాక, అవి ఎంత ప్రత్యేకమైనవో కూడా రాసుకోవాలి. అంటే, మనలోని శక్తిని గుర్తించడమే ఇది. అంతర్లీనంగా వున్న ఆ శక్తి ఏంటో మన మనసుకి, మెదడుకి చేరేలా చేయడానికే ఈ ప్రయత్నం. ఒక్కసారి అవి లోపలకి చేరాయా... ఇక మనం నిటారుగా నిలబడి, తలెత్తి ప్రపంచం కళ్ళలోకి కళ్ళుపెట్టి మాట్లాడతాం. ఏ పరిస్థితులనైనా ఎదుర్కొంటాం. సమస్యలు రాగానే భయపడకుండా, వాటిని దాటే మార్గాల కోసం వెతుకుతాం. అందుకే ఆత్మవిశ్వాసం తప్పనిసరి అనేది. మనమీద మనకి నమ్మకం. మనల్ని మనం గుర్తించడం చాలా ముఖ్యమైన సౌందర్య సాధనాలు. మన శరీర భాషే కాంపాక్ట్ పౌడర్ ముఖానికి మరికొంత గ్లో అద్దే కాంపాక్ట్ పౌడర్ లాంటిదే శరీర భాష. మనకి బోల్డంత ఆత్మవిశ్వాసం వుంది సరే. కానీ అది మనలో స్పష్టంగా బయటకి వ్యక్తం కాలేకపోతే లాభం ఏంటి? అలా వ్యక్తం కావాలంటే మన నడక హుందాగా వుండాలి. మన భుజాలు నిటారుగా నిలబడాలి. తలెత్తి సూటిగా చూస్తూ మాట్లాడాలి. మొత్తం మన బాడీ లాంగ్వేజ్‌లోనే ఓ గ్రేస్ రావాలి. అప్పుడు మనం సగం ప్రపంచాన్ని గెలిచినట్టే. ఎందుకంటే మనల్ని చూస్తూనే మన శక్తి ఏంటో ఎదుటివారు గుర్తించగలుగుతారు. ఇక అప్పుడు ఎక్కువ శ్రమ లేకుండా మనం చెప్పాలనుకున్నది సూటిగా చెప్పచ్చు. అలా జరగాలంటే కావల్సిందల్లా స్పష్టమైన ఆత్మవిశ్వాసాన్ని ప్రతిఫలించే బాడీ లాంగ్వేజ్. విజేతల మానసిక స్థైర్యం వారి శరీర కదలికల్లో స్పష్టంగా కనిపిస్తుంది... గమనించండి. నమ్మిందే చెప్పడం.. చెప్పిందే చెయ్యడం ఐ లైనర్ లాంటిది మనం గట్టిగా నమ్మినదాన్ని ఆచరణలో పెట్టినప్పుడు దాని ఫలితం ఉన్నతంగా వుంటుంది. ఎందుకంటే మన ఆలోచనలు మథించి ఓ నిర్ణయం తీసుకున్నప్పుడు, ఆ తీసుకున్న నిర్ణయమే ఓ శక్తిగా మారి మనల్ని నడిపిస్తుంది. ఉత్సాహపరుస్తుంది. ఆటంకాలని దాటిపోయేలా చేస్తుంది. చాలాసార్లు మనం నమ్మేది ఒకటి... ఒత్తిడులకు తలొగ్గి చేయాల్సింది మరొకటి వుంటుంది. మనసులేని పని ఫలితం కూడా చప్పగానే వుంటుంది. అందుకే మనకు ఏది కరెక్ట్ అనిపిస్తే దానిని చెప్పగలగాలి. ఏం చెప్పామో దానిని ఆచరణలో పెట్టాలి. అప్పుడే ప్రపంచం మనల్ని నమ్ముతుంది. ‘‘మాటలు కోటలు దాటుతాయి కానీ, పనులు ఒక్క అడుగు వేయవు’’ అన్న సామెత వినే వుంటారు. కేవలం మాటలు చెబుతూ ఎదుటివారిని ఎంతోకాలం మభ్యపెట్టలేరు. ఆ గుర్తింపు క్షణికమైనది. అందుకే ఎదుటివారు ఒప్పుకున్నా, లేకపోయినా చేయగలిగింది మాత్రమే చెప్పండి. ఈ ఒక్క బేసిక్ క్వాలిటీ చాలు... మిమ్మల్ని సమూహం నుంచి ప్రత్యేకంగా నిలబెట్టడానికి. వేరే మేకప్ ఏం లేకున్నా  ఐ లైనర్ వేసుకుంటే ఎంత అందం వస్తుందో, ఈ ఒక్క క్వాలిటీతో అంత అందం వస్తుంది మన వ్యక్తిత్వానికి. ఎమోషనల్ ఇంటెలిజెన్స్ మీ వ్యక్తిత్వానికి కాటుక లాంటిది భావోద్వేగాలను ఎప్పుడు, ఎలా, ఎంతవరకు వ్యక్తం చేయచ్చో తెలిసి తీరాలి ఓ విజేతకి. కొంతమంది కోపాన్ని అణచుకోలేరు. మరికొందరు బాధని, ఇంకొందరు సంతోషాన్ని. దేన్నయినా వెనకా ముందు చూడకుండా బయటకి వ్యక్తం చేయడం సరికాదు. ఎంత ఆత్మవిశ్వాసం వున్నా, ఎంత గొప్ప వ్యక్తిత్వం వున్నా ఈ ఒక్కటి చేతకాకపోతే ఇబ్బంది పడాల్సిందే. కాటుక ఒక్కటి సరిగా కుదరకపోతే ముఖంలోని అందమే మారిపోతుంది. అలానే ఈ భావోద్వేగాలు కూడా. మరి వాటిపై పట్టు సాధించటం ఎలా? కొంచెం శ్రమించాలి. కానీ, సాధ్యమే. తొణకుండా, బెణకకుండా, ఎదుటి వ్యక్తులను చులకన చేయకుండా, చెరగని చిరునవ్వు మాటున అంతరంగంలో చెలరేగే భావోద్వేగ సునామీలను దాచగలిగితే చాలు. మిమ్మల్ని మీరు జయించినట్టే. అలా అని ఆ భావోద్వేగాలని అస్సలు బయటపెట్టకుండా ఉండమని కాదు.  ఎప్పుడు, ఎలా వ్యక్తం చేయాలో తెలిసుండాలి. వాటిని వ్యక్తం చేయడంలో కూడా ఓ హుందాతనం వుండాలి. దాని నుంచి మీరు ఆశించే ఫలితం వచ్చి తీరాలి. కోపం ప్రేరణనివ్వాలి. ఆవేశం దూకుడునివ్వాలి. వ్యతిరేక భావోద్వేగాలని ప్రేరణాత్మకంగా మార్చుకోవటమే విజేతల ముఖ్య లక్షణం. అందుకే కాటుక అందం రెట్టింపు అయ్యేలా చూసుకోండి. మాటలే పెదాల అందాలని పెంచే లిప్‌స్టిక్ మాటే ఆయుధం. దానిని ఎలా ఉపయోగించామన్నదే ముఖ్యం. మాట తీరుతోనే మన వ్యక్తిత్వం బయటపడేది. మాటతీరులోనే విజయం కానీ, అపజయం కానీ మనల్ని కావలించుకునేది. అందుకే అతి ముఖ్యమైన ఆకర్షణ పెంచే సౌందర్య సాధనం ఇది. ఎప్పుడూ సూటిగా, స్పష్టంగా మాట్లాడటం ముఖ్యం. మన ఆలోచనలని మాటలుగా మార్చి చెప్పగలగాలి. ఆ మాటలలో మన ఆత్మవిశ్వాసం ప్రస్ఫుటం కావాలి. మన మాట చల్లగా వుండాలి. ఆ మాటలు తమని తాకాలని ఎదుటివారు తపించేలా వుండాలి. మాటలలో కరుణ, ప్రేమ కలగలిస్తే ప్రపంచం ఆ మాటల కోసం తపించిపోతుంది. వాటి రుచి చూడాలని ఆరాటపడుతుంది. కొద్దిగా శ్రద్ధ పెడితే సులువుగా సాధించవచ్చు మాటల మీద పట్టుని. ఇలా మన సౌందర్యానికి శాశ్వత మెరుగులు అద్దుకుంటే ప్రపంచమే మనల్ని విజేతలుగా నిలబెడుతుంది. కాలం కలిసొస్తుంది - ఆనందం నిన్ను వదలను ప్లీజ్ అంటుంది. ‘‘అప్పుడు జీవితమంటే ఇది’’ అనిపిస్తుంది. ఆ రుచి ఎలా వుంటుందో చెప్పటం కంటే స్వయంగా తెలుసుకుంటేనే బావుంటుంది. అందరికీ  మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ప్రతీరోజూ మనదే. గడిచే రోజుపై మనదైన ముద్ర వేద్దాం. సగర్వంగా అంతెత్తున తలెత్తి ప్రపంచాన్ని పలకరిద్దాం. -రమ

డోన్ట్ వర్రీ... బీ ‘హోలీ’

డోన్ట్ వర్రీ... బీ ‘హోలీ’ హోలీ అనగానే ఉషారుగా ఆడి పాడేస్తాం. కానీ ఆ తర్వాత ఆ రంగులు వారం అయినా వదలక ఇబ్బంది పెట్టడం మాత్రం కొంచం చికాకు పెడుతుంది . అలంటి ఇబ్బంది లేకుండా ఈ హోలీని మంచి జ్ఞాపకంగా ఎలా మార్చుకోవచ్చో నిపుణులు చేస్తున్నా కొన్ని సూచనలు మీకోసం ఇక్కడ. 1. అందరికి తెలిసిందే అయినా , మళ్ళీ ఒకసారి చెప్పుకోవలసిన మొదటి విషయం... హోలీ కి కెమికల్ కలర్స్ కాకుండా ఆర్గానిక్ కలర్స్ నే వాడటం మంచిది. 2. హోలీ రోజున వేసుకునే బట్టలు పూర్తిగా శరీరాన్ని కప్పి వుంచేవిగా వుండాలి. సల్వార్, కమీజు లాంటివి పొడవు చేతులతో ఉండేలా వేసుకుంటే హోలీ రంగులు నేరుగా శరీరాన్ని తాకే అవకాశం ఉండదు . 3. ఇక హోలీ రంగులతో ఎక్కువ నష్టపోయేది జుట్టు. పండగ రోజున తలారా స్నానం చేసాక, జుట్టు ఆరబెట్టుకుని కొంచం నూనె రాసి, గట్టిగా "పోనీ" వేసుకుంటే జుట్టుకు, మాడుకి రంగులు అంతగా అంటవు. 4. హోలీ రోజున ఉదయాన్నే శరీరానికి కొబ్బరి నూనె రాయాలి. దానివలన రంగులతో డ్రైగా మారకుండా వుంటుంది. అలానే ముఖానికి సన్ స్క్రీన్ లోషన్ పట్టించాలి. 5. వాటర్ ప్రూఫ్ మేకప్ వేసుకుంటే హోలీ సంబరాలు పూర్తి అయ్యేదాకా ఆ మేకప్ పాడవకుండా వుంటుంది. వాటర్ ప్రూఫ్ బేస్‌ని ముఖం నుంచి మెడ దాకా ఒక లేయర్‌గా వేసుకుంటే రంగులు చర్మానికి అతుక్కోకుండా వుంటాయి. 6. గోళ్ళని కాసేపు ఆలివ్ ఆయిల్‌లో ముంచి, ఆ తర్వాత గోళ్ళ రంగు వేయాలి. అప్పుడు హోలీ రంగుల ప్రభావం గోళ్ళ పైన పడకుండా వుంటుంది. ఇలాంటి కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే , మరకల భయం లేకుండా హోలీ సంబరాలు సరదాగా చేసుకోవచ్చు. -రమ

బరువు తగ్గడం అమ్మాయిల జన్మహక్కు

  బరువు తగ్గడం అమ్మాయిల జన్మహక్కు     బరువు పెరగడం తేలికే కాని తగ్గడం చాలా కష్టం. ఎక్కువ బరువు పెరిగిపోడంవల్ల సులువుగా చేసే పనులు కూడా చాలా కష్టపడి చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా స్త్రీలు ఒకే చోట కూర్చొని పనిచేయడం, బయట దొరికే జంక్ ఫుడ్ తినడం వల్ల ఎక్కువ బరువు పెరిగిపోతున్నారు. అలా కాకుండా ఉండాలంటే కింద చెప్పిన చిట్కాలు కొన్ని పాటిస్తే కొంతవరకైనా బరువు పెరగకుండా ఉండే అవకాశం ఉంది. * సన్నని నాజుకైనా శరీరాకృతి కావాలంటే డైటింగ్ ఒక్కటి చేస్తే సరిపోదు. అందుకు తగిన వ్యాయామం కూడా చేయాలి. * బాగా ఆకలిగా ఉన్నప్పుడు బయట దొరికే జంక్ ఫుడ్ తినకూడదు. అలా తినడం వల్ల ఎక్కువ కొవ్వు, తక్కువ పోషకాలు శరీరానికి అందుతాయి. దీంతో బరువు పెరిగే ప్రమాదం ఉంది. *ఎక్కువ ఒత్తిడి ఉన్నప్పుడు డైట్ అసలు చేయకూడదు. * ఉదయం బ్రేక్ ఫాస్ట్ తప్పనిసరిగా తీసుకోవాలి. దీనివల్ల కేలరీస్ సాయంత్రం వరకు ఉంటాయి. * ఆఫీస్ లకు వెళ్లేవారు ఇంటి దగ్గర తయారుచేసిన ఫుడ్ తీసుకెళ్లడమే మంచిది. ఇది శరీరానికి తక్కువ కేలరీలు, ఎక్కువ పోషకాలు ఇస్తుంది. * ఆహారం తీసుకునేప్పుడు ఎక్కవ సేపు నమిలి తినాలి. ఇలా తినడం వల్ల తక్కువ ఆహారంతోనే మీకు సంతృప్తి కలుగుతుంది. * ఆహారం తీసుకునే గంట ముందు ఒక గ్లాసు మంచినీళ్లు తాగితే తక్కువ ఆహారం తీసుకోవచ్చు. * ఆయిల్ లో ఫ్రై చేసిన ఫిష్, చికెన్ లాంటివి తినకూడదు. బాయిల్ కాని రోస్ట్ కాని చేసినవి మాత్రమే తినాలి. * ప్లాన్, ప్లాన్, ప్లాన్. మనం తీసుకునే ఆహారం ప్లానింగ్ ఉంటే బరువు పెరగటాన్ని నియంత్రించవచ్చు. మనం ఏ ఆహారం తీసుకుంటున్నామని కాదు ఎంత ఆహారం తీసుకుంటున్నామని ఆలోచించి తినాలి.

ఆరెంజ్ ప్యాక్‌తో అందం అదరహో...

     ఆరెంజ్ ప్యాక్‌తో అందం అదరహో...     అందం అంటే మగువ, మగువ అంటే అందం. అలాంటి అందాన్ని కాపాడుకోవడానికి మగువలు బయట దొరికే కాస్మోటిక్స్ వాడుతుంటారు. అలా చేయడం వల్ల చర్మం పాడైపోయే ప్రమాదం ఉంది. అలా కాకుండా మనం ఇంట్లో వాడే వస్తువులతో కూడా మనం ఫేస్ ప్యాక్స్ తయారుచేసుకోవచ్చు. అలాంటి వాటిలో ఆరెంజ్ ఒకటి. ఇది తినడానికే కాదు  ఫేస్ ప్యాక్స్‌కు కూడా బాగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మీ కోసం కొన్ని ఆరెంజ్ ఫేస్ ప్యాక్‌లు....    * రెండు టేబుల్ స్పూన్ల పెరుగులో కొంచెం ఆరెంజ్ జ్యూస్ వేసి ఆ మిశ్రమాన్ని బాగా కలపాలి. కలిపిన మిశ్రమాన్ని ముఖానికి, మెడకు పట్టించి 15-20 నిమిషాలు ఉంచుకొని తరువాత  కొంచెం గోరువెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేస్తే మీ ముఖం నునుపుగా మారటమే కాకుండా చల్లదనాన్ని ఇస్తుంది. * రెండు టేబుల్ స్పూన్ల ఆరెంజ్ జ్యూస్, ఒక టేబుల్ స్పూన్ నిమ్మరసం,  ఒక టేబుల్ స్పూన్ తేనె తీసుకొని వాటిని బాగా కలిపి ముఖానికి , మెడకు రాసుకోవాలి. ఓ పదిహేను నిమిషాల తరువాత గోరు వెచ్చని నీటితో కడిగేయాలి. ఇలా చేయటం వల్ల మీ చర్మం పై ఉన్న మచ్చలు పోవడమే కాకుండా కాంతివంతమైన ముఖం మీ సొంతమవుతుంది. * కొంచెం ఆరెంజ్ జ్యూస్ తీసుకొని దానిలో ముల్తాని మట్టి, పాలు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించాలి. 30 నిమషాలు అలా ఉంచి గోరువెచ్చని నీటితో కడగాలి.  * ఆరెంజ్ తొక్కలతో చేసిన పొడిలో  కొంచెం గంధం పొడి, పాలు / నీరు / రోజ్ వాటర్ వేసి బాగా కలపాలి. ఈ ప్యాక్ ను ముఖానికి పట్టించి 20 నిమిషాలు తరువాత గోరువెచ్చని నీటితో కడిగేయాలి. దీనివల్ల మీ చర్మం మీద ఉండే మృతకణాలు పోవడమే కాకుండా ముఖం మంచి కాంతివంతంగా తయారవుతుంది. 

అరటితో అందం

  అరటితో అందం అరటిపండు కాస్త మెత్తగా అయితే పిల్లలు తినటానికి ఇష్టపడరు . అప్పుడు ఆ పండిన అరటిపండుతో అందానికి మెరుగులు దిద్దుకోవటం ఎలాగో చూద్దాం. 1. అరటిపండుని మెత్తటి గుజ్జుగా చేసుకుని ఓ చెమ్చా చిక్కటి పాలు, ఓ చెమ్చా  ఓట్మీల్ పొడిని కలపాలి. ఆ మిశ్రమాన్ని ముఖానికి పట్టించి, ఆరాక సున్నితంగా రుద్దాలి. ఆ తర్వాత గోరువెచ్చటి నీటితో ముఖాన్ని కడిగితే చర్మం తాజాగా కనిపిస్తుంది. 2. అలాగే అరటి గుజ్జులో ఓ చెమ్చా శనగపిండి, ఓ చెమ్చా పాలు కలిపి ముఖానికి ప్యాక్‌లా వేసుకోవచ్చు. పది నిమిషాల తర్వాత కడిగేస్తే, మృత కణాలు పోయి ముఖం తాజాగా వుంటుంది. 3. అరటిగుజ్జులో  నిమ్మరసం, పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని ముఖానికి ప్యాక్‌లా వేసుకుంటే ముఖానికున్న మురికి సులువుగా వదులుతుంది. 4. అరటిగుజ్జుతో మోచేతులు, మెడ వంటి చోట రుద్దితే కూడా మంచి ఫలితం వుంటుంది.   అరటిపండులో వుండే యాంటి బ్యాక్టీరియల్ గుణాలు, అందులోని విటమిన్ - ఎ, పొటాషియం వంటివి చర్మానికి మృదుత్వాన్ని అందిస్తాయి. కాబట్టి వారానికి ఒకసారి అయినా అరటిపండుని చర్మ సౌందర్యానికి వాడటం మంచిది. -రమ

ఫేస్ క్లీనిసింగ్ టిప్స్

   ఫేస్ క్లీనిసింగ్ టిప్స్ కాలుష్యం.. కాలుష్యం.. ఈరోజుల్లో అడుగు బయటపెట్టామంటే కాలుష్యంలోకి అడుగు పెట్టామన్నమాటే. ఈ కాలుష్యం వల్ల బాగా ప్రభావితం అయ్యే మన శరీర భాగాల్లో ముఖం చాలా ముఖ్యమైనది. ముఖం మీద కాలుష్యం పేరుకుపోతే అది చర్మ ఆరోగ్యాన్ని దెబ్బతీసే అవకాశం వుంది. ముఖ్యంగా సున్నితమైన చర్మం వుండే అమ్మాయిలు తమ ముఖాన్ని కాపాడుకోవాలి.. ముఖాన్ని శుభ్రం చేసుకునే విషయంలో అదనపు శ్రద్ధ చూపించాలి. సరైన పద్ధతిలో ముఖాన్ని క్లీన్ చేసుకోవడం వల్ల కాలుష్యం, మురికి ముఖాన్ని వదిలిపోవడం మాత్రమే కాకుండా ముఖంలోని స్కిన్ సెల్స్ నిరంతరం ఆరోగ్యంగా వుంటాయి. తద్వారా అందంతోపాటు ఆరోగ్యం కూడా మన సొంతమవుతుంది. ఇప్పుడు ముఖాన్ని శుభ్రం చేసుకోవడంలో అనుసరించాల్సిన కొన్ని టిప్స్ మీకోసం.... 1. మీది ఎలాంటి తరహా చర్మమైనా రోజుకు రెండుసార్లు ముఖాన్ని శుభ్రం చేసుకుంటే చాలు. అంతకు మించి ముఖాన్ని శుభ్రం చేసుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కువ శుభ్రం చేసుకున్నా మంచిది కాదు. ఎందుకంటే, శరీరం మీద వుండే నేచురల్ ఆయిల్స్ పోతాయి. 2. మీ శరీర తత్వానికి సరిపోయే క్లిన్సర్లను మాత్రమే ఉపయోగించాలి. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి సబ్బులను ఉపయోగించడం తగ్గిస్తే మంచింది. 3. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి ఉపయోగించే నీరు గోరు వెచ్చగా వుంటే మంచింది. బాగా వేడినీరుగానీ, బాగా చల్లగా వుండే నీరుగానీ శ్రేయస్కరం కాదు. 4. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి వాష్ క్లాత్, స్పాంజ్ ఉపయోగించేవారు అవి శుభ్రంగా వున్నాయా లేదా అనే విషయాన్ని ముందుగానే పరీక్షించుకోవాలి. అపరిశుభ్రంగా వున్నవాటిని ఉపయోగించడం మంచిది కాదు. 5. ముఖాన్ని కడుక్కునే ముందు మీ చేతుల్ని శుభ్రం చేసుకోవాలి. అలాగే హెడ్ బ్యాండ్ కూడా వేసుకోవాలి. ముఖం కడుక్కునే సమయంలో జుట్టు ముఖం మీద పడకుండా జాగ్రత్తపడాలి. 6. మొదట ముఖం మీద నీళ్ళు వేగంగా చల్లుకుని ముఖాన్ని కడుక్కోవడం ప్రారంభించాలి. ముఖం మాత్రమే కాదు.. మెడను కూడా శుభ్రం చేసుకోవడం మరచిపోవద్దు. 7. చేతిలోగానీ, స్పాంజ్ మీద గానీ క్లినసర్‌ తీసుకుని దాన్ని ముఖం మీద కింద నుంచి పైకి రుద్దుకోవాలి. అలాగే మెడ మీద కూడా క్లినసర్ ఉపయోగించాలి. ముఖం మీద చాలా సున్నితంగా ఒత్తిడి కలిగించాలి. గట్టిగా రుద్దడం వల్ల చర్మం పాడవుతుంది. ముఖం కడిగే సమయంలో కళ్ళ చుట్టూ చాలా మృదువుగా రుద్దాలి. 8. ముఖాన్ని శుభ్రం చేసుకోవడానికి క్లినసర్ ఉపయోగించినప్పుడు, ముఖానికి అప్లయ్ చేసిన క్లినసర్ మొత్తం పోయేలా గోరువెచ్చని నీటితో కడగాలి. అరకొరగా కడగడం మంచిది కాదు. 9. ముఖాన్నిశుభ్రం చేసుకున్న తర్వాత టవల్‌తో తుడుచుకునే పద్ధతి కూడా చాలా ముఖ్యం. టవల్‌తో చాలా మృదువుగా ముఖం మీద అద్దుకోవాలంతే. టవల్ని ముఖం మీద ఎట్టి పరిస్థితుల్లోనూ గట్టిగా అదిమిపెట్టి రుద్దకూడదు. 10. ముఖాన్ని నీటితో, క్లినసర్‌తో శుభ్రం చేసుకుని, టవల్‌తో తుడుచుకున్న తర్వాత వాటర్‌ బేస్‌తో వుంటే టోనర్లను ముఖానికి రాసుకోవాలి. ఇది ముఖం మీద వుండే సహజమైన తేమను నిలుపుతుంది.  

ముచ్చటగా మూడు ప్యాక్‌లు

    ముచ్చటగా మూడు ప్యాక్‌లు   జుట్టు పొడిబారినట్టు వుందీ అంటే జుట్టులో తేమ తగ్గిందని అర్థం. తేమ తగ్గిన జుట్టు చిట్లిపోతుంటుంది. రాలిపోతుంటుంది. ఆ సమస్యకు పరిష్కారం కావాలంటే ఈ ప్యాక్‌లను ప్రయత్నించవచ్చు. గుడ్డులో ప్రొటీన్లు, ఫ్యాటీ ఆమ్లాలు, కరిగే కొవ్వులు అధికంగా వుంటాయి. కాబట్టి గుడ్డులోని తెల్లసొనను తలకు పట్టిస్తే ఈ పోషకాలన్నీ జుట్టుకు అందుతాయి. గుడ్డులోని తెల్లసొనలో మూడు చెమ్చాల వెనిగర్, ఒక చెమ్చా ఆలివ్ నూనె కలిపి తలకు పట్టించాలి. ఒక గంట తర్వాత షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తే జుట్టుకు తిరిగి తేమ అందుతుంది. పొడిబారటం తగ్గుతుంది. ఇక జుట్టు బాగా రాలిపోతుంటే ఈ ప్యాక్ ట్రై చేయండి. పెరుగులో కొద్దిగా నిమ్మరసం, తెల్లసొన వేసి బాగా కలిపి తలకు బాగా పట్టించి, ఓ గంట తర్వాత తలస్నానం చేయాలి. ఇలా వారానికి ఒకసారి చేస్తుంటే జుట్టు రాలడం తగ్గుతుంది. కలబంద గుజ్జు ఓ నాలుగు చెమ్చాలు తీసుకుని అందులో రెండు చెమ్చాల కొబ్బరి నూనె, చెమ్చా పెరుగూ కలిపి తలకు పట్టించి - గంట తర్వాత తలస్నానం చేస్తే కూడా జుట్టు పొడిబారటం తగ్గుతుంది. ఇక తలంటు పోసుకునే ముందురోజు వేరుశనగ నూనె, బాదం నూనె, కొబ్బరి నూనెలను సమపాళ్ళలో కలిపి తలకు పట్టిస్తే జుట్టు మృదువుగా వుంటుంది. -రమ

Four Best Beauty Tips

  Four Best Beauty Tips   Egg Pack           Take one teaspoon of egg white in a bowl, add 1⁄2 teaspoon of cream (malai) and 1⁄2 teaspoon of lemon juice. Mix them well and apply on your face, keep it for 15 minutes, rinse with cold water. Repeat it on alternate day.           Carrot Pack     Cut half inch carrot and 1⁄2 a potato, boil them, and then mash them properly. Add a pinch baking soda and turmeric, mix them well. Apply the paste over your face, leave it for 2 minutes, and wash off with lukewarm water. This pack reduces  wrinkles and gives smooth skin.           Are you suffering from hair loss problem?       We have a homemade beauty recipe for solving your problem. Take 3 teaspoon of potato juice, 3 teaspoon of aloe-vera juice and 2 teaspoon of honey. Apply that mixture, to the roots of the hair. Leave it on for 2 hours. Wash off with your regular shampoo. For best result, do it twice in a week.                    For cooler and radiant eyes     Massage with almond oil, all over your face before going bed. It helps to reduce dark circles and wrinkle issues. Keep cucumber slice on your eyes for 15 minutes. It gives you refreshes your eye, reduce the dark circles by relaxation.  Apply mint juice in dark circle area of your eyes. It helps to keep your eyes cool and get rid of that dark band. Dip a cotton ball into rose water; keep it over your closed eyes for 15 minutes.         Feel Good Look Good!!   -Sandya Koya

Five Best Beauty Tips

  Five Best Beauty Tips Good looking nails Your nails become yellow due to excessive usage of nail polish, clean them with lemon juice, to get rid of the yellow tinge. Soak your nails in lemon juice for 5 minutes and wash off. By doing so, the natural color of the nails will be restored!   Homemade moisturizer Take 2 portions of Rose water and one portion of Glycerin and one portion of Olive oil. Mix the liquids well by vigorous shaking, non greasy moisture is ready to use. Best results are achieved if applied after a nice steamy bath; so, keep a bottle in your bath rooms. To keep your hand soft apply the lotion after washing, so ladies keep a bottle handy in your kitchen too. Skin Rejuvenator! Most of us, view papaya as good source of nutrients for maintaining good health, but it can be used as a skin rejuvenator too! Take a spoon of papaya pulp and few drops of honey, and massage it evenly over your face. Let it be for 10 – 15 minutes. Then wash off with cold water. Repeat this whenever free or when you gorge on papaya! Instantaneous Cleanser! Take a small piece of tomato and rub all-over your face, neck, hands and elbows.  Leave as it is for about 20 minutes. If you are too lazy to wash it, massage with tomato before going to bed and leave it overnight and wash it in the morning. By doing so, the incidences as well as prominence of the pimples are reduced owing to the acidic content of tomato; it also lightens up your skin! Home-made De-Tan Potion! Take 2 full spoons of curd; add a spoon of Besan and ¼ spoon of turmeric powder. If your skin is oily add few drops of lime juice. If your skin is too dry you can add cream too! Apply this mixture as a thick paste over your tanned skin and leave it for an hour and then wash off with lukewarm  water.       If your skin is too tanned then repeat it twice a day for speedy results! -Sandya Koya

Take care of your feet during this winter

 Take care of your feet during this winter   During winter, your skins needs extra moisture and so whenever possible, rub a good quality moisturizer on to your heels and the soles of your feet. Make it a point to apply some moisturizer before going to bed  Spare some time every night to cleanse your feet and get to work on them with a pumice stone. It only takes a minute or two. After that, massage with your beloved foot lotion. Concentrate on pressure points on sole of your feet and along the length of your toes.  Some regular tips to be followed, besides cleaning:   Drink loads of water. Keeping our body internally hydrated, which in turn keeps our skin plump and devoid of dryness. Hydration not only aids our skin but also our nails and cuticles.  With this in mind, try skipping dehydrating drinks like coffee, sugary soft drinks and alcohol.  1) Give your feet a rest every other day or so and wear flat, comfortable shoes. Squashing them into tight, sky-high heels may look stylish, but they strain your legs and ankles.    2) Wearing socks and keeping our feet covered and protecting them from the harsh elements of the environment.    3) If you are wearing socks, try to stick with natural fabrics, like cotton and wool. Avoid synthetic blends, as they can cause your feet to sweat and smell.   4) Cold weather attracts enumerable bacterial and fungal infections. Keeping nails cleaning and using fresh socks everyday are the small things to be kept in mind.  These small caring tips will add up to your elegance!!     - Sandya koya  

Pampering your Feet!!

  Pampering your Feet!!         Feet are the essential part of our body. But, most people are not bothered about the feet. Everyone should be cautious about your feet; like how to keep your feet smooth and beautiful. You can make it smooth by using some quality branded product or by kitchen products. Home made products is cheaper than market product, and with an added labeled that says ‘No side Effects”.  Take 1 cup of lemon juice; add 2 teaspoons olive oil and ¼ cup of milk. You can add rose petals for some fragrance. Then fill a tub with water, about 2/3rd of the tube, add the above mixture to the tub and soak your feet for 15-30 minutes. Then wash your feet by using mild soap. If you repeat this every week, you can be guaranteed of smooth and beautiful feet. Home remedies to treat cracked heels: - Cracked heel is a common problem but trust me, sesame oil works wonders. Apply it on your cracked heels before going to bed and you will fall in love with your feet the very next day. - For treating cracked heels, apply a mixture of candle wax and mustard oil and leave it on overnight to see the difference. - Applying pulp of ripe banana on the affected area, also fastens the healing process. - Make a mixture of glycerin and rosewater and apply it to your feet, for say 15 days and you will be amazed to see the results. - Make a mixture of turmeric, Tulsi and camphor in equal parts and add a little Aloe-Vera gel into it. Now, apply this paste on the heels and gaze at your beautiful feet. As the Saying goes ‘Prevention is better than cure’.  Tips for avoiding dry and cracked heels - One of the best advices is to buy the right size of footwear as ill fitted footwear can damage your feet and pre-dispose to damage heels. - Most of us have a habit of walking bare foot at home; avoid doing so as your feet catch up dust while you walk without footwear. - Try keeping your feet clean and dirt free, cover them properly and moisturize them at least once a day to keep them soft and supple. Pamper yourself!!       - Sandya koya  

Modern Mehendi Designs New Year Special

  గోరింటాకు... న్యూ ఇయర్ స్పెషల్ డిజైన్ గోరింట పూచింది కొమ్మా లేకుండా అనే పాట అందరికీ తెలిసిందే. గోరింటాకు కొమ్మ లేకుండా పూయడం అంటే... అందమైన అమ్మాయిల చేతి మీద ఎర్రగా పూస్తుందని అర్థం. గోరింట కొమ్మ లేకుండా పూస్తుందేమోగానీ, డిజైనర్ లేకుండా గోరింటాకు పెట్టుకోవడం మాత్రం మాకు నచ్చదని నేటితరం అమ్మాయిలు చెబుతున్నారు. నిజమే.. మనంతట మనం గోరింటాకు పెట్టుకోవడం కంటే, డిజైనర్లు పెట్టే గోరింటాకు ఎంతో ఆకర్షణీయంగా వుంటుంది. అందుకే ఈ కొత్త ఏడాది ప్రారంభంలో ఒక మంచి డిజైన్‌తో గోరింటాకు పెట్టుకుంటే ఆ ఉత్సాహమే వేరు. కొత్త సంవత్సరం సందర్భంగా గోరింటాకు స్పెషల్ డిజైన్‌ వీడియో చూడండి...