Read more!

శీతాకాలంలో జట్టు పొడిబారుతోందా? ఇలా  చేయండి.!


శీతాకాలంలో జట్టు పొడిబారుతోందా? ఇలా  చేయండి.!

శీతాకాలంలో వాతావరణ ప్రభావం శరీరంతోపాటు శిరోజాలపై కూడా పడుతుంది. దాంతో జట్టు బలహీనంగా, నిర్జీవంగా, చివర్లు చిట్లిపోవడం జరుగుతుంది. అందుకే కాలానికి అనుగుణంగా మనం శిరోజాలను సంరక్షించుకోవాలి. దానికోసం ఏవేవో కొనేసి కష్టపడాల్సిన అవసరం లేదు. మన వంటింట్లోనే దొరికే వాటితో మన కురులను సంరక్షించుకోవచ్చు. ఎలాగో చూద్దాం.

- జుట్టు పొడిగా మారి, చివర్లు చిట్లుతున్నట్లు కనిపిస్తే..బాగా పండిన అరటిపండును గుజ్జుగా చేసి, దానిలో4 చెంచాలా  కొబ్బరినూనె, చెంచా చొప్పున తేనె, గ్లిజరిన్ వేసి కలపాలి. ఈ మిశ్రమాన్ని కురులకు పూతలా వేసి అరగంట తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇందులోని గ్జిజరిన్ తేనె జుట్టుకు తేమను అందిస్తుంది. చివర్లు చిట్టకుండా కాపాడుతాయి.

- 5 చెంచాల శనగపిండికి రెండు చెంచాల చొప్పున ఆలివ్ నూనె, పెరుగు కలిపి మెత్తని పేస్టు చేసుకోవాలి. దీన్ని మొదళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి 20 నిమిషాల తర్వాత గోరువెచ్చని నీటితో తలస్నానం చేయాలి. ఇది జుట్టుకు మంచి కండిషనర్ వలే పనిచేస్తుంది. అంతేకాదు కుదుళ్లను బలంగా ఉంచుతుంది. ఆలివ్ నూనె జుట్టుకు మంచి కండిషనర్ వలే పనిచేస్తుంది.

-గుడ్డులోని తెల్లసొనకు 2చెంచాల చొప్పున శనగపిండి, బాదంపొడి, తగినంత రోజ్ వాటర్ కలిపి మెత్తని పేస్టు వలె చేసుకోవాలి. దీన్ని కుదుళ్ల నుంచి చివర్ల వరకు పట్టించి అరగంట తర్వాత తక్కువగా గాఢత కలిగిన షాంపూతో తలస్నానం చేయాలి. ఇలా చేస్తే కేశాలు ఆరోగ్యంగా ఉంటాయి.

- జుట్టు పొడిబారకుండా ఉండాలంటే..2 చెంచాల మెంతిపిండికి 4 చెంచాల కొబ్బరిపాలను కలిపి మెత్తని మిశ్రమంగా చేసుకోవాలి. దీన్ని మాడుకు పట్టించి మర్దనా చేసుకోవాలి. గంట తర్వాత గాఢత తక్కువగా ఉన్న షాంపూతో తలస్నానం చేయాలి. అంతే మీ జుట్టు పొడిబారకుండా సిల్కీగా మెరుస్తుంది.