Read more!

చలికాలం మీద దెబ్బకొడదామిలా….

చలికాలం మీద దెబ్బకొడదామిలా….

చలికాలం గజగజా వణికిస్తోంది. కమాన్ గుసగుసకు బదులుగా ఇట్ ఈజ్ గజగజ అనే డైలాగ్ చెప్పాలేమో… అయితే చలిని కూడా ఆస్వాదించాలి అంటున్నారు వస్త్ర నిపుణులు. ఒళ్ళంతా బిగుసుకుపోయి కీళ్లు పట్టేస్తుంటే ఆస్వాదన ఏంటీ… అనే చిరాకు పుడుతుంది కొందరి. ఇక అమ్మాయిల విషయం అయితే ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే సుకుమారంగా ఉంటారాయే… దానికి తగ్గట్టు ఈ చలికి చర్మం చిర్రుబుర్రులాడుతుంది. అయితే ఆస్వాదించాలంటే చలిని దెబ్బకొట్టే ఫాషన్ వేర్ లు ఉన్నాయని చెబుతున్నారు ఫాషన్ నిపుణులు. చలిని ఎట్లా దెబ్బకొడదాం అని ఆలోచిస్తున్నారా?? ఒద్దొద్దు ఇది చదివితే సరిపోద్ది..

ఇలా దెబ్బకొట్టాలి...

హాయిగా ఉండే స్వెట్‌ షర్టులు, హూడీలు ఇంకా లాగ్జరిగా, మృదువుగా ఉండే స్వెటర్‌లు వేసుకోవడానికి సరైనా సమయం ఏదంటే ఇదిగో ఇప్పుడే…. గజగజ వణికే శరీరానికి స్వాంతన కావాలంటే వెచ్చదనం ఒడిసిపట్టాలి. చలికాలపు ఉదయాలు పొగమంచుతోనూ… లేలేత వణుకుతోనూ… మెల్లగా చోటు చేసుకునే వెలిగు రేఖలతోనూ ఎంతో అద్భుతంగా ఉంటుంది. కానీ…. చలి అనే కారణంతో అడుగు బయట పెట్టకుండా ఎంతో అందమైన దృశ్యాలను, వాతావరణాన్ని మిస్సయిపోతారు చాలామంది. అలాగే సంధ్యచీకట్లు అలముకునే సాయంత్రాలు ఎంతో అద్భుతంగా ఉంటాయి. ఈ చలికాలం తనలో తెలియని ఎనర్జీని దాచేసుకుని ఉంటుంది. అలాంటి ఎనర్జీని పట్టుకోవాలి అంటే చలిలో అడుగులు వేయకతప్పదు. చలిని దెబ్బ కొడుతూ ముందుకు సాగడానికి డ్రెస్సింగ్ వార్డ్ రోబ్ లో జత చేసుకోవాల్సిన ట్రేండింగ్ ట్విస్ట్ లు ఇవే….

హుడ్ జాకెట్స్...

ఈ హుడ్ జాకెట్స్ ని బొచ్చు జాకెట్లు అని కూడా అంటారు. వీటికి పైన జంతువుల ఉన్ని లాగా ఉంటుంది. అందుకే వీటికి మనవాళ్ళు బొచ్చు జాకెట్లని ముద్దుగా పిలిచేస్తున్నారు. ఇవి వేసుకున్నప్పుడు  మృదువుగా, వెచ్చగా, హాయిగా ఉండటంతో ఇవి  శీతాకాలపు అత్యంత హాటెస్ట్ సెలక్షన్ అయిపోయాయి. ఇవి ధరించడానికి ఎలాంటి ఇతర ఆడంబరాలు అక్కర్లేదు. ఇవి వేసుకున్నప్పుడు ఫాషన్ మొత్తం మీలోనే ఇమిడిపోయినట్టు అనిపిస్తుంది. చాలా స్టైలిష్ లుక్ ఇస్తాయివి. లేట్ నైట్ పార్టీలు అంటే ఈ చలికాలంకో భయపడేవారు ఈ హుడ్ జాకెట్స్ వేసుకెళ్తే వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు మిమ్మల్ని అందరిలో అట్రాక్షన్ గా నిలబడతాయి.

బబుల్ కోట్స్…..

మిమ్మల్ని హాయిగా, సౌకర్యవంతంగా ఉంచే పెర్ఫెక్ట్ ఎంపిక ఈ బబుల్ కోట్స్. ఇది  స్టైలిష్ గానూ ఇంకా  ఫంక్షనల్‌గా కూడా ఉంటుంది, ఇందులో ఫ్రంట్ జిప్, బ్రీతబుల్ ఫాబ్రిక్ మరియు హాయిగా ఉండే ఇన్సులేషన్ ఉన్నాయి.  వీటిని జీన్స్ పైన వేసుకోవచ్చుమ్ ఇంకా వీటికి జతగా   బూట్‌లు ధరించినా, లేదా స్నికర్స్ వేసుకున్నా పర్ఫెక్ట్ ఉంటుంది. వీటిలో ఉన్న మరొక ప్రత్యేకత ఏమిటంటే ఇవి వెచ్చదనాన్ని ఇవ్వడంతో పాటు తేలికగా ఉంటాయి.

ఓవర్ సైజ్ డ్రెస్సెస్...

చిన్నప్పుడు పెద్ద సైజ్ దుస్తులు వేసుకుంటే ఎగతాళి చేసేవారు. అయితే ఈ భారీ దుస్తులు ఈ సంవత్సరంలో అతిపెద్ద ట్రెండ్‌లలో ఒకతిగా మారాయి. ఈ శీతాకాలంలో ఇవి ఎంతో అనూకులమైనవి కూడా. ఇవి కేవలం పరిమాణంలో పెద్దగా ఉండటమే కాదు శరీరాన్ని పూర్తిగా కప్పి ఉంచే బెస్ట్ డ్రెస్సింగ్ వేర్. మరొక ప్లస్ పాయింట్  ఏంటంటే శరీర ఆకారాన్ని ఇది బయట పెట్టదు. లావు, సన్నం, నడుము పెద్దగా ఉండటం, పొట్ట ఉండటం వంటి కొన్ని ఇబ్బందులను కవర్ చేయడానికి ఇది భలే ఉపయోగపడుతుంది. 

లాంగ్ బ్లేజర్...

ఫ్యాషన్ పోకడలు ప్రతి సంవత్సరం వస్తాయి మరియు వెళ్తాయి, కొన్ని మాత్రమే వార్డ్‌రోబ్ లలో అలాగే సెట్ అయిపోతాయి. వాటిలో లాంగ్ బ్లేజర్ లు ఒకటి. ఇవి ఈ సీజన్ కు పర్ఫెక్ట్ గా సెట్ అయ్యే దుస్తులు. ఇంట్లో ఉండటానికి అయినా బయటకు వెళ్ళడానికి అయినా ఇషి నప్పుతుంది. అలాగే ఫ్రెండ్స్ తో వెళ్లడమైనా, ఆఫీసులకు అయినా నిరభ్యంతరంగా వేసుకుని వెళ్లచ్చు. చలికాలంలో కాసింత వైవిధ్యం కావలనిపిస్తే మీ వార్డ్ రోబ్ లో దీనికి ఖచ్చితమైన స్థానం ఇవ్వాలి మరి. 

లెదర్ వేర్…

లెదర్ వస్తువులను ధరించే విషయంలో లెదర్ బాటమ్‌లు ప్రస్తుతం చాలా ఫ్యాషన్‌గా ఉన్నాయి.  లో-వెస్ట్ మరియు మిడ్-వెయిస్ట్ ప్యాంట్‌లు బ్రౌన్, బ్లాక్ లేదా లేత రంగులు ప్రస్తుత కాలంలో అద్భుతమైన ఫాషన్ కేటగిరి లో ఉన్నాయి. వీటికి పిచ్చ ఫాన్స్ ఉన్నారంటే అతిశయోక్తి కాదు. చాలా వరకు లెదర్ ప్యాంట్‌లు మధ్య లేదా ఎత్తైన డిజైన్‌ను కలిగి ఉంటాయి, వాతావరణం చల్లగా ఉన్నప్పుడు వెచ్చదనం యొక్క అదనపు పొరను జోడించడానికి ఇది సరైనది.

ఇలా ఈ అయిదు ఫాషన్ లో ట్రెండ్ సెట్టర్ అవుతున్నాయి ఈ చలికాలపు డ్రెస్సింగ్ వేర్ లో…

                                    ◆నిశ్శబ్ద.