Read more!

అమ్మాయిలూ.. రోజ్ వాటర్ ను ఇలా అస్సలు వాడకండి!

అమ్మాయిలూ.. రోజ్ వాటర్ ను ఇలా అస్సలు వాడకండి!

రోజ్ వాటర్ అమ్మాయిలు చాలా ఎక్కువగా  ఉపయోగించే సౌందర్య సాధనం. నేరుగా ముఖానికి పట్టించాలన్నా, టోనర్ గా వాడాలన్నా, మేకప్ తొలగించిన తరువాత  ముఖాన్ని హైడ్రేట్ గా ఉంచాలన్నా, ఫేస్ ప్యాక్ లలో ఉపయోగించాలన్నా రోజ్ వాటర్ చాలా విరివిగా ఉపయోగిస్తారు. బోలెడు బ్యూటీ బెనిఫిట్స్ ఉంటాయనే కారణంతో చాలామంది అమ్మాయిలు రోజ్ వాటర్ ను వివిధ పదార్థాల కాంబినేషన్  లో ఉపయోగిస్తుంటారు. ఇలా చేయడం వల్ల ముఖం చాలా చండాలంగా మారుతుంది. అకారణంగా ముఖం మీద దద్దుర్లు,  మచ్చలు రావడం. ముఖ చర్మం పాడైపోవడం జరుగుతుంది. అసలు రోజ్ వాటర్ వల్ల కలిగే లాభాలేంటి? దీన్ని ఎలా వాడితే  ఎలాంటి ఫలితాలు ఉంటాయి? అసలు ఎలా వాడకపోవడం మంచిది? పూర్తీగా తెలుసుకుంటే..

గులాబీ రేకులను ఆవిరి చెయ్యడం ద్వారా గులాబీ నీరు తయారు చేస్తారు. ఇది ముఖం మీద గీతలు, మచ్చలు తొలగించడమే కాకుండా ముడుతలు తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. అయితే రోజ్ వాటర్ లో కొన్ని రకాల పదార్థాలను కలపడం వల్ల ముఖ చర్మం దెబ్బతింటుంది.

రోజ్ వాటర్ లో నూనె పదార్దాలు కలిపి రాయకూడదు. రోజ్ వాటర్ నీటి గుణం కలిగి ఉంటుంది, నూనె రోజ్ వాటర్ లో సరిగా  కలవదు.  ఈ కారణంగా ముఖం మీద నీరు, నూనె గందరగోళం సృష్టించి  మచ్చలు రావడానికి కారణం అవుతుంది.  మొదట శుభ్రమైన ముఖానికి రోజ్ వాటర్ అప్లై చేసి ఆరిన తరువాత దానిమీద ఫేస్ ఆయిల్ అప్లై చెయ్యాలి.

విటమిన్-సి అధికంగా ఉండే నిమ్మరసం, నారింజ రసం వంటివి రోజ్ వాటర్ లో కలపకూడదు. ఇది చర్మాన్ని చికాకు పెడుతుంది. ర్యాషెస్ రావడానికి ఆస్కారం ఉంటుంది.

కొందరికి టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి వాడే అలవాటు ఉంటుంది. అయితే ఆల్కహాల్ ఆధారిత టోనర్ ను రోజ్ వాటర్ తో కలిపి ముఖానికి అస్సలు వాడకూడదు. మరీ ముఖ్యంగా సున్నిత చర్మం ఉన్నవారు, పొడి చర్మం ఉన్నవారికి ఇది చాలా నష్టం కలిగిస్తుంది.

రోజ్ వాటర్ ను ముల్తానీ మట్టి ఫేస్ ప్యాక్ లలో ఉపయోగిస్తుంటారు. సున్నిత చర్మం, పొడిచర్మం ఉన్నవారు దీన్ని వాడకపోవడం మంచిది. ముల్తానీ మట్టిలో PH స్థాయిలు ఉంటాయి. ఇవి ముఖాన్ని పాడు చేస్తాయి.

                                *నిశ్శబ్ద.