Read more!

రారామాఇంటిదాకా


    "ఈ బ్రా సైజెంతో చెప్పగలరా? ఈ విషయాల్లో మీరు కళాకారులని మాధవి చెప్పింది లెండి మీరంత రసికులటకదా! మీరు కరెక్ట్ సైజు గనుక చెబితే బ్రా కూడా వేసుకోను" అన్నాను.
    
    అలాంటప్పుడు మాధవి పేరెత్తితే వాడు మరింత ఉద్రేకపడతాడని నాకు తెలుసు.
    
    వాడేదో సైజు చెప్పాడు.
    
    నిజానికి నా బ్రా ఆ సైజుది కాదు. కానీ నా లక్ష్యం నెరవేరాలంటే వాడ్ని పొగడక తప్పదు.
    
    "కరెక్టుగా చెప్పారే. అందుకే మాధవక్క మిమ్మల్ని పొగడుతుంటుంది" అన్నాను నేను.
    
    వాడు గర్వంగా నవ్వాడు.
    
    "ఇందులోనయినా మీరు ఓడిపోయుంటే బ్రా తీసేబాధ తప్పుండేది" అని వగరుస్తూ బ్రా విప్పాను.
    
    వాడి కళ్ళు సాగడం నేను గమనించాను.
    
    "ఈ చీర ఖరీదు ఎంతో చెప్పగలరా? బట్టల సెలక్షన్ లో మీతో పోటీ పడటం కష్టమట కదా! మూడు అడుగుల దూరం నుంచి చూసే బట్టల మన్నిక ఎంతో, వాటి ఖరీదు ఎంతో కూడా చెప్పగలరట కదా"

    "ఎవరు చెప్పారు?"
    
    వాడు మాట్లాడుతున్నా, వాడి చూపులు మాత్రం చనుమొనలకు వేలాడుతున్నాయి.
    
    "మాధవక్కయ్య"
    
    వాడు మరింత ఖుషీ అయిపోయాడు.
    
    "మరి పందెం"
    
    "ఏమిటో మీరే చెప్పండి"
    
    "ఈ రాత్రికి చీర కట్టుకోకూడదు"
    
    "అమ్మో!" అని కళ్ళను చారడేసి చేసి "తప్పదు కదా - సరేలెండి" అన్నాను.
    
    "ఐదొందలు"
    
    "ఏడ్చావులే ఈ చీర ఖరీదు కేవలం వందరూపాయలే" నిజం చెప్పి వాడెంత ఫూలో తెలియచెప్పాలనిపించింది. కానీ నా లక్ష్యం వేరు.
    
    "భలే చెప్పారే" అని "నా ఖర్మ కొద్దీ మీరు ఇంత కరెక్ట్ గా చెప్పారే" అంటూ చీర విప్పేశాను.
    
    సముద్రం మొత్తం నా కాళ్ళకు చుట్టేసినట్లు కాళ్ళ దగ్గరికి నీలం చీర జారిపోయింది.
    
    లంగా తప్ప మరేం లేదు నా ఒంటిమీద.
    
    వాడు ఉద్రేక పడడం తెలుస్తూనే వుంది.
    
    ఇంకా కాసేపు అలానే చూస్తే కళ్ళు పేలిపోతాయేమో నన్నట్లు చూస్తున్నాడు.
    
    "చలిగా వుందండీ - కాస్త జరగదూ - నేనూ మంచంమీదకు వచ్చేస్తాను" అన్నాను హొయలంతా మాటలతో కుమ్మరిస్తున్నట్లు.
    
    వాడు పక్కకు జరిగాడు.
    
    నేను లేచి మంచం మీద వాడి పక్కన కూర్చున్నాను.
    
    వాడి ఊపిరి వదలడం వెచ్చగా తగుల్తోంది.
    
    కోరికతో కాలిపోతున్న శరీరం నుండి లేస్తున్న సెగలు నన్ను చుట్టుముట్టుకుంటున్నాయి.
    
    వాడికి ఎప్పుడెప్పుడా అని వుంది. కానీ చేయి మీద వేయడానికి జంకుతున్నాడు.
    
    "దేనికయినా సరే కౌంట్ డౌన్ అనేది ఒకటుంటుంది అలానే నేనూ కౌంట్ డౌన్ మొదలుపెడతాను"
    
    "నేను పదినుంచి జీరో వరకు సంఖ్యల్ని చెబుతుంటాను - మీరు ఒక్కో సంఖ్యకు ఒక్కో దగ్గర ముద్దు పెట్టుకుంటారు. నేను జీరో దగ్గరికి వచ్చేసరికి మీరు ఎక్కడ ముద్దు పెట్టుకోవాల్సి వస్తుందో తెలుసా?" అన్నాను.
    
    "ఎక్కడ?" అడిగాడు వాడు.
    
    "నేను చెప్పను. జీరో వచ్చేటప్పటికి మీ పెదవులకే తెలిసిపోతుంది" అన్నాను.
    
    వాడు సరేననలేదు. ఇంకా ఏదో బిడియం వాడ్ని వెనక్కి లాగుతోంది. ఈ కౌంట్ డౌన్ లో అన్నీ ఎగిరి పోతాయని నాకు తెలుసు.
    
    "కౌంట్ డౌన్ పదినుంచి మొదలవుతుంది. నేను పది అనగానే మీరు నా తలమీద పెదవులతో స్పృశిస్తారు. తొమ్మిది అనగానే నా నుదురు మీద ముద్దు పెట్టుకుంటారు. పైనుంచి కిందకన్న మాట"
    
    పక్కన పడుకున్నాను.
    
    "టెన్" అని కళ్ళు మూసుకున్నాను.
    
    అతను ముద్దు పెట్టుకోలేదు. కళ్ళు తెరిచి విస్మయంతో చూశాను. తల అటు తిప్పుకున్నాడు.
    
    "నేను రేపు ఉదయం ఊరెళ్ళిపోతున్నాను" అన్నాను సడన్ గా గొంతు మార్చి.
    
    నిశ్శబ్దంగా నావైపు తిరిగాడు.
    
    'ఈ అస్త్రం బాగా పనిచేస్తూ వుందే' అనుకున్నాను.
    
    "టెన్"
    
    తలమీద వెంట్రుకలను పెదవులతో తాకాడు.
    
    "నైన్ - అలానే కిందకు - ఈసారి నుదురు"
    
    నోటితో అక్కడ అద్దాడు.
    
    "ఎయిట్"
    
    ఈసారి ముక్కుమీద.
    
    "సెవెన్"
    
    పెదవుల తడి అతని నోటికి తగిలింది.
    
    "సిక్స్"
    
    కంఠం మీద పళ్ళతో గుచ్చాడు.
    
    "ఫైవ్"
    
    నా ఎదనుంచి పెదవులను తీసివేయడం వీలైంది కాదు. ఆ స్పర్శ అతనిలో ఇంద్రచాపాలను ఆవిష్కరిస్తుంటే ఆ మెరుపంతా కళ్ళల్లో కనిపిస్తోంది.
    
    "ఫోర్" అని రెండుసార్లు అన్నా అతని పెదవులు ఊరి రావడంలేదు.
    
    "ఫోర్" కాస్తంత గట్టిగా అరిచాను.
    
    విధిలేక నడుం మీదకు జారాడు.
    
    "త్రీ"
    
    బొడ్డును అతని నాలుక తొలుస్తోంది.
    
    "టూ"
    
    ఈసారి లాభం లేకపోయింది.
    
    "టూ" మరోసారి అన్నాను.
    
    నడుం మడతల మీద ముఖం ఆన్చాడు.
    
    "వన్"
    
    పొత్తికడుపు అతని నోటిమధ్య ఇరుకు పోయింది.
    
    నేను మౌనంగా వుండిపోయాను.
    
    "జీరో" అతనే అన్నాడు.
    
    ఇక అక్కడ నుంచి అతను లేవలేదు.
    
    నేనూ కౌంట్ డౌన్ పూర్తయిందని చెప్పలేదు.