జీలకరతో ఆరోగ్యం
posted on May 18, 2013
జీలకరతో ఆరోగ్యం
మనం ఎల్లప్పుడు ఆరోగ్యంగా ఉండాలని, ఉండటానికి కూరగాయలని, పండ్లని, ఆకుకూరలని, పప్పుదినుసులని తింటున్నాం. అన్నింటిల్లో వివిధ రకరకాల ప్రోటీన్లు, విటమిన్లు ఉంటాయని అవి మనకు ఎంతో మేలు చేస్తాయని డాక్టర్లు చెప్పుతూ ఉంటారు. మనం పోపుగింజలలో వేసుకునే జీలకర కూడా ఆరోగ్యానికి మేలు చేస్తుంది.
జీలకరలో క్యాన్సర్‌ను నివారించే లక్షణాలు ఉన్నాయని ఈ మధ్య డాక్టర్లు కనుగొన్నారు. జీలకరలో ఉండే ఫైటోకెమికల్ క్యుమినాల్డిహైడ్ క్యాన్సర్ వ్యాధిని నియంత్రించడంలో ప్రముఖ పాత్ర వహిస్తుంది. అంతేకాకుండా యాంటి ఇన్‌ఫ్లమేటరీ లక్షణాలు ఉండడం వల్ల అలర్జీని కూడా నివారిస్తుంది.
ఇవి మాత్రమే కాకుండా జీలకరలో ఉండే క్యుమినల్‌ఈస్టర్, లిమోనిన్ డీఎన్‌ఏలో మార్పులు తెచ్చి క్యాన్సర్‌కు కారణమయ్యే అఫ్లటాక్సిన్ చర్యలను అడ్డుకుంటాయి. కాబట్టి జీలకర ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తుంది. జీలకర తినడంలో తప్పులేదు. హాయిగా తినొచ్చు కూడా !