మిస్ మేనక ఐ. పి. యస్.


    " మేడం!" హల్లో ఆమెకి అభిముఖంగా సోఫాలో కూర్చున్నాడు, సూటిగా పాయింట్ కి వచ్చేశాడు " రణధీర్, సూర్యాలు బెయిలుమీద విడుదలైపోయారు."

 

    " వ్యాట్!" విస్మయంగా అడిగింది.  " ఏ.... ఏ బేసిన్ పైన!"

 

    " మన న్యాయవ్యవస్థలో ఉన్న ప్రత్యేకతదే.. కింద కోర్టులో న్యాయం హైకోర్టులో    అన్యాయమై పోతుంది. హైకోర్టులో అన్యాయం అంతకన్నా పెద్ద కోర్డులో తిరిగి న్యాయంగా రూపుదిద్దుకుంటుంది. మీరు ఆ ఇద్దర్నీ అరెస్ట్ చేసి ఎంత పాపులారిటీని సంపాదించారో అంతమంది శత్రువుల్నీ తయారు చేసుకున్నారు. పది నిముషాల క్రితం సెషన్స్ నుంచి బెయిలు సంపాదించి ఓ లాయరు, ఇద్దర్నీ విడుదల చేసుకుపోయాడు. ఆఫ్ కోర్స్ ,సాక్షాత్తు మన ఎస్సీగారే దీంట్లో ఇనీషియేటివ్  తీసుకున్నారని తెలిసింది.     " సాలోచనగా ఆమె ముఖకవళికల్ని గమనించాడు. "ఇక్కడ గెలుపు, ఓటమి అనే ప్రసక్తిని గురించి మనం మాట్లాడుకోనక్కరలేదు మేడం. మీరు  మీ పరిధిలో గెలిచారు."

 

    "ఇట్స్ నాన్సెన్స్ మిస్టర్ మురారీ!" బాధగా అంది.    " న్యాయమన్నది అని  పరిధుల్లోనూ ఒకటిగా వుండాలి తప్ప స్టేటస్ ను బట్టి ఎలా మారుతుంది?మారితే అదే  న్యాయమని ఎలా అనిపించుకుంటుంది?"

 

    "మేడం, పొజిషనులో మీకున్నా చాలా చిన్నవాడినైనా , మీకున్నా అనుభవంలోనే  కాదు, వయసులో పెద్దవాణ్ని నేను" మురారి గొంతులో చనువు తీసుకున్న భావంలేదు, నిజాయితీ వుంది.  అంతకుమించి బాధా ఉంది.  " అసిస్టెంట్ సబిన్ స్పెక్టర్ గా డిపార్టమెంట్ లో అడుగుపెట్టిన  నేను నాపై అధికారుల్ని ఎంత క్లోజ్ గా పరిశీలించగలిగానూ అంటే.... చాలా నిజాయితీగా ఈ ఫోర్స్ లో చేరినవాళ్ళు స్వల్పకాలంలోనే కరప్టెడ్ గా మారిపోతారు. అది దురదృష్టమే . కాని తప్పదు."

 

     భావరహితంగా వింటూంది.    

 

    "ట్రైనింగ్ లో రాజ్యాంగం గురించి క్షుణ్నంగా కాకపోయినా అవసరమైనంతదాకా తెలుకున్న ఓ సబిన్ స్పెక్టర్, పదవిలో చేరగానే ముందు అనుకునేది రాజ్యాంగంలో 21 వ అధికారం ప్రకారం ప్రొటెక్షనాఫా లైఫ్ అండ్ పర్సనల్ లిబర్టీని దృష్టిలో ఉంచుకుని పౌరుల్ని రక్షించాలని కాని అది సిటిజన్స్ కోసంకాదు, తనలైఫ్ ని, తన లిబర్టీని కాపాడుకోడానికే అని చాలా స్వల్పకాలంలో తెలుసుకుంటాడు. తన పోలీస్ స్టేషన్ ను సందర్శించడానికి డి ఎస్సీ  వస్తున్నట్టు సమాచారం  అందుతుంది. ఆవ్యక్తికి తాగుడు,  అమ్మాయిల్లాంటి కొన్ని దురలవాట్లు ఉంటాయి.అవి  ఏర్పాటు  చేయాల్సింది ఎస్సై మాత్రమే. కేవలం  అలాంటి ఏర్పట్లతోనే ఎస్సైని అ ప్రయిజ్ చేస్తాడు డిఎస్సీ కాని, సర్కిల్ ఇన్స్పెక్టర్ కానివ్చచిన ప్రతీసారీ తన జీతంతో అలాంటి ఏర్పాట్లు చేయలేని ఎస్సై, తప్పని పరిస్థితిలో కరప్షన్ కి సిద్దపడుతాడు. ఇది ప్రారంభం ఇది మాత్రమే గాక మరో పక్క నుంచి రాజకీయ నాయకుల ఒత్తిడి నేరస్థుల్ని నిర్భంధించీ విడుదల చేయాల్సి రావడం-- ఇదో ఇన్ సెపరబుల్  బాండ్."

 

    "అలా  అడుగడుగునా పొల్యూట్ అవుతూ ప్రజలకీ  దూరమైపోతాడు. దూరం కాకూడదనుకునే మీలాంటి నిజాయితీ గలఆఫీసర్లని  శత్రువులుగా భావించడం మొదలుపడతాడు.ఇక్కడ చిత్రంగా నలిగిపబోయేది నా స్థాయిలో ఉన్నావాళ్ళు కాదు,   పైస్థాయి, కిందిస్థాయి అవినీత పరులైన ఆపీసర్ల మధ్య  ' లైజన్'స గా  వ్యవహరించే మీలాంటి వాళ్ళే"

 

     మురారి నిజాయితీపరుడు మాత్రమే కాదు, మేధావి వర్గానికి చెందిన ఆఫీసరుని అర్థమైపోయింది. అతన్ని మరింత ఆత్మీయుడిగా భావించడానికి కారణమూ   అదే. "సో... నేను తప్పుచేస్తున్నానంటారు!"

 

    " నో!" తాత్వికంగా తల  పంకించాడ. " మీరూ తప్పు చేసే ఆఫీసరైతే నేనిలా మాట్లాడేవాణ్ణి కాదు మేడం ఈ డిపార్టుమెంట్ లో ఉంటూ అప్పుడప్పడూ కలవరపరిచే అంతర్మథనానికి  మీలాంటివాళ్ళ సమక్షంలో జవాబు వెతుక్కునే తత్వంగల వాణ్ణి. నేను మీరిచ్చిన చనువును దుర్వినియోగం చేసుకుంటున్నా నేమో నాకు తెలీదు.

 

     నిజానికి నాది అలాంటి మనస్తత్వం కాదు కూడా. మీస్థానంలో నాతోబుట్టువు ఉన్నా ఓసబార్డినేట్ ఆఫీసరుగా గౌరవిస్తాను."

 

     " మీ అభిమానానికి ధన్యురాలిని మష్డర్ మురారీ!  ఇండియన్ పోలీస్ సర్వీసులో  చేరిన ప్రతివ్యక్తి ఓ మంచి ఆఫీసరు కావాలి. అంటే  ఎలా ఉండాలో ప్రొబేషనర్ గా తెలుకున్న దాన్ని" ఆమెకు ఫిలిప్ మేసన్ వాక్యాలు గుర్తుకొచ్చాయి. " ఏ ఆఫీసరైనా ముందు గౌరవం పొందేది తన వ్యక్తిగతమైన ధైర్యసాహసాలతో.తరువాత తన గురించి తనకుండే అవగాహన. తనూ సేవలో భాగస్వామే అనిపించేట్టు కలిగించే  భావమూను.  శత్రువుని  ఎదుర్కోవడంలో చూపించే ఆత్మవిశ్వాసం, అనుభవం, ధృఢసంకల్పం, తన  కిందస్థాయి  వ్యక్తుల విషయంలో ప్రదర్శించే బాధ్యతాయుతమైన అభిమానం- ఇవి  శాశ్వతమైన ఆరాధనకు కారణాలవుతాయి. నేను లీడ్ చేయాలనుకుంటున్న జీవితం అదే. ఒరవేళ అదే నా అనర్ఙతైతే నన్ను నేను నష్టుపోవడానికీ నేను వెనుకాడను."

 

    " మేడం!" అలోచనల ఉలితో అందంగా చెక్కిన వ్యక్తిత్వ  శిల్పంలా అనిపిస్తుంటే ఆభినందించకుండా ఉండలేకపోయాడు.   " బహూశా  మీ లోని మీ ప్రవర్తనే నన్ను ఆకట్టుకుందేమో? అందర్నీ గెలవాలీ అంటే తప్పదు . కొన్ని రోజులు ఆగాలి. అవును మేడం.కొన్ని పోరాటాలకి  ఫలితం ఆలస్యంగా కాని అర్థంకాదు" పైకి లేచాడు.

 

    "నిజానికి నేను వచ్చింది ఇది మాట్లాడానికి కాదు.అయినా వెళ్ళే  ముందు మీకో  విషయం చెప్పక తప్పదు."

 

    "చెప్పండి."

 

    " గాయపడిన రెండు మృగాలు ఇప్పుడు బోనులోనుంచి బయటపడ్డాయి."లాయర్ సూర్యం,రణధీర్ ను ఉద్దేశించి చెప్పకుపోయాడు. " అంతమాత్రం చేత మీకెదా అనర్థం జరుగుతుందని కాదు కాని..... చాలా మందీ మర్బలం, మన డిపార్టమెంట్ లోనే పలుకుబడి గల వ్యక్తులు వాళ్ళు.  తమ ఓటమికి జవాబు చెప్పాలనే ప్రయత్నంలో ఉంటారు. ఇది చెబుతున్నది నేను మీ గుడ్ బుక్స్ లోకి రావాలని కాదు. అవసరమైతే మీరు మొహమాటం వదులుకుని నన్నె అన్నయ్యగానయినా భావించి నా సహాయం  తీసుకోమని."

 

     ఇప్పుడదని కళ్ళలో నిజాయితీని మించిన అభిమానం మాత్రమే కాదు ఒక వ్యక్తి గా ఏ శక్తి  నైనా ఎదుర్కోగల నిర్లక్ష్యం కనిపిస్తూంది.


    
     "ఇలా ఎందుకు చెప్పాల్సి వచ్చింది అంటే ఇందాక రణధీర్ గారిభార్య రాజ్యలక్ష్మి మీదగ్గరకు రావడం, మీరిద్దరూ ఆత్మీయుల్లా  మాట్లాడుకోవడం మన డిపార్టుమెంటులో  కొందరువ్యక్తుల ద్వారా హోం మినిస్టర్  అప్పారావుకి తెలిసింది"

 

     ఆమెకు భోధపడిపోయింది రాజీనో, లేదూ రాజీని అడ్డం పెట్టుకుని తనను సాధించడానికి ప్రత్యర్థికి  ఓ  ఆయుధం దొరికిపోయిందపుడే!

 

    "మే  ఐ కమిన్!"

 

    ఉలికిపాటుగా ఆలోచినలనుంచి తేరుకున్న మేనక తలెత్తి చూసింది.  

 

    ద్వారం దగ్గర నిలబడివున్నాడు మిత్ర.

 

     అదికాదు ఆమెను మరింత  రెచ్చగొట్టింది సుమారు ఇరవైనాలుగు గంటల తరువాత తీరుంటుగా తన దగ్గరికి వచ్చిన మిత్రలో గిల్టీనెస్ లేదు. ఎప్పటిలాగే ప్రశాంతంగా నవ్వుతున్నాడు.

 

     హాల్లోని విద్యుద్దీపం కాంతి  ఆమె చెంపలపైన పడి పరావర్తనం చెందుతుంటే ఆమె ప్రస్తుత మానసిక స్థితితో తనకు పనిలేదన్నంత కేజువల్ గా దగ్గరికి వచ్చాడు.