మిస్ మేనక ఐ. పి. యస్.

 
     నవ్వింది హంసలా.. అతని భుజంపైన ఒదిగిపోతూ అంది " చేయనూ? నన్ను ఐ.పి.యస్. కి బలవంతంగా  నెట్టిది నువ్వేగా...."

 

     కారు బయటికి వచ్చారిద్దరూ.

 

     సమీపంలోని సముద్రపు హోరునిమించిన ఉద్విగ్నత. ఆమెలో. " ఏయ్.... ముందు అడిగినదానికి జవాబుచెప్పు. ఏడాదిన్నపాటు నా ఉత్తరాలకి  జావాబెందుకివ్వలేదు? మీ  అమ్మగారెలా ఉన్నారు  రాజీ ఏమంటూంది? అసలు నీకేమైంది!"

 

     ప్రతి ప్రశ్నావిన్నాడు. కానీ   ఏ  ప్రశ్నకీ జవాబు చెప్పలేదు. ఇసుకలో కూరుకుపోతున్న పాదాల్ని బలంగా లాక్కుంటూ నడుస్తున్న మిత్ర  " కంగ్రాట్స్ మున్నీ!" అన్నాడు .తనలాపిలవడం మేనకకు ఎంత ఇష్టమైన   విషషయమో అతనికి తెలుసు."చార్జితీసుకుని వారం రోజులుకాకముందే పెద్ద సంచలనాన్ని సృష్టించావు"

 

    ఈ ప్రపంచంలో ఆమె మనసారా కోరుకునే అలాంటి ఆభినందన అతనినుంచి మాత్రమే కేవలం అతనందించిన స్ఫూర్తితోనే ఆస్థాయికి చేరుకున్నా ఆమె  లోని పరిణితి మూలంగానో అదీ  మోప్పుకోలుకు ఆనందించలేకపోతూంది.

 

    "ఏయ్!  ముందు నేనడిగిన వాటికి జవాబుచెప్పు. అమ్మగారు , రాజీఎలా ఉన్నారు?మీ డాడీ ఆరోగ్యం... అసలు  నువ్వు విజయవాడనుంచి ఎప్పుడొచ్చావు?"

 

    "మొత్తానికి లాయర్లందర్న కంగారుపెట్టేశావు."

 

    కోపంగా అతని భుజం పట్టుకుంది అంతే రోషంగా అతన్ని తన వేపు తిప్పుకుంది." నీబోడి అభినందనలు తరువాత! ముందు విజయవాడ నుంచి ఎప్పుడొచ్చావో చెప్పు!"

 

    " ఏడాదిన్నర కావస్తూంది."

 

     షాక్ తిన్నట్టుగా చూసింది.

 

    "ఎస్ మున్నీ... నాన్నగారు పోయాక ఇక్కడికి..."

 

    " వాట్  మీ డాడీ.... మీ డాడి పోయారా!"

 

     ఓ  సన్నని నీలినీడ అతని మొహంపైన కదిలిమాయమైంది. " ఎస్ పెరాలిసిస్ తో పోయారాయన.  రాజీ పెళ్ళి కూడా అయిపోవడంతో మమ్మీ తోబాటు ఇక్కడికివచ్చి  ఇక్కడే సెటిలైపోయాను."

 

     అప్పుడు చూశాడామె కళ్ళల్లో నిలిచిన నీటిబొట్లని.

 

     క్షణం నిశ్శబ్దంగా అతన్నే చూసిన మేనక జీపు దగ్గరికి నడిచింది కళ్ళు తుడుచుకుంటూ.

 

    మరో అరక్షణం ఆలస్యమైతే వెళ్ళిపోయేదో.

 

     " ఏయ్! ఏమైంది నీకు" చేయిపట్టుకుని వారించాడు "ఇన్నాళ్ళ తరువాత కనిపించి  ఇంత హఠాత్తుగా వెళ్ళిపోతున్నావేమిటి?"

 

    " మిత్రా! నేనెవర్నని? నీకేమౌతాను?"

 

     నిర్వేదంగా నవ్వాడు. "ఓహ్.... ఇవేమీ నేను నీకు రాయలేదని నీకు కోపంకదూ?

 

    గబాలున  ఆమెను దగ్గరకు లాక్కున్నాడు . " నెవ్వర్... మళ్లీ ఇలాంటి వాక్యాలని ఎప్పుడూ రిపీట్ చేయకు."

 

     " ఎందుకు?" ఆమె ఎంత గుండెనిబ్బరం గల పోలీసాఫీసరైనా అతని ముందు అప్పటి అడపిల్లే.  " నాకెందుకు తెలియపరచలేదు? నిన్ను ఓదార్చగలిగే శక్తి నాకు లేకపోవచ్చు  మిత్రా! నీ  బాధల్లో పాలుపంచుకోదగ్గ వ్యక్తినీ కానా?"

 

    " బికాజ్ ఐలవ్యూ...."

 

     " మరినెనో?" ఉక్రోషంగా ఆమె కళ్ళనుంచి నీళ్ళు రాలుతున్నాయి- " డూ ఐ నాట్  లవ్యూ?"

 

    " నో!

 

     నిర్విణ్ణిరాలైంది  అతని జవాబు  వింటూ.

 

    "నిజం  మేనకా, నువ్వు నన్ను ప్రేమించడంలేదు."

 

    " మరి?"

 

    "ఆరాధిస్తున్నావు" మృధువుగా నవ్వాడు. "బహుశా నీకన్నా, నీ జీవితం కన్నా నన్ను  ఎక్కువుగా  ఇష్టపడుతున్నావు. ఇది చెప్పడానికి నేనో మేధావిని కానక్కర్లేదు.  అవునా?" నెమ్మదిగా ఆమె తల పైకెత్తి చూశాడు.
    " కనీసం రాజీ పెళ్ళి నాడైనా నాకు రాయొచ్చుగా?"

 

    "మహారాక్షసివైపోయావు మేనకా నీతో నా సంతోషాన్ని మాత్రమే పంచుకునేవాణ్ణి.అయితే రాజీ పెళ్లి గురించైనా ఎందుకు రాయలేదూ  అని నీ ఉద్దేశం కావచ్చుఅంగీకరిస్తున్నాను."

 

    " ఏమిటి?"

 

    "ఐ.పి.యస్.తో నీ ఐక్యూ అసాధారణంగా పెరిగింది."

 

    ఆమె ఏదో చెప్పబయేది.

 

    "నన్ను చెప్పనియ్ మున్నీ. నిజమే .నేను చాలా విషయాలు దాచాను. కాదు. నీకు తెలియకుండా  జాగ్రత్తపడ్డాను. ఎందుకని? మొన్న నీ బాల్యం నువ్వు కోరని పీడకల. తొలిసారి నీలో నాకు కనిపించింది విచ్చిన కలువల్లాంటి కళ్ళూ కాదు. దిగంతాల అంచులదాకా ప్రసరిస్తున్న చూపుల ముళ్ళవి,. అందులో నాకు ఆత్మన్యూనతా భావంతోబాటు దాన్ని అధిగమించాలానే కసి సైతం స్పష్టమయ్యేది.అందుకే... ఓ ప్రయోగం  చేయాలనిపించింది.అలావున్న అందిరిపైనా అలాంటి ఆసక్తి చూపాలని నాకు  ప్రయోగం చెయాలనిపించింది. అలావున్న  అందరిపైనా అలాంటి ఆసక్తి చూపాలని నాకు అనిపించకపోవడానికి కారణం...." క్షణం ఆగాడు హోరైజన్ వేపు చూస్తూ. "కేవలం నీ పైన నాకు ఏర్పడిన ఇష్టమో, అభిమానమో అప్పటికి నాకు తెలీదు.మున్నీ సంజ  ఎరుపు సెలయేటిపైన చల్లిన తొలిసిగ్గులాగే అనిపించావో, లేక చందమామ మోముపైన సంగం కప్పిన విషాదపు తెరలాగే కనిపించావో నీతో నడవాలనిపించింది."

 

       ఇంకా  జీవుల్ని నింపుకుని అప్పటిలాగే కదలాడుతున్న భావుకత అతని గొంతులో  " కల ఎప్పుడూ మనిషికి బలమే మున్నీ. కాబట్టే కొంత కాలం నిన్ను నాస్వస్నంలోకి  బలంగా  మళ్ళించాను. నీతో సరుగుడు చెట్ల నీడలోనూ తిరిగాను.చీకటిలో సైతం నిలబడి నువ్వు ఎక్కాల్సిన వెలుగు శిఖరాలనీ ఊహల్లో నిర్మించుకున్నాను ఎదిగావు నా  ఊహలకి మించి. ఎంత గర్వమనిపించింది! కాని మున్నీ  ... ఇదంతా నేను చేసింది నీమీద జాలితోపాటు .ప్రయోగంలా  అంతకన్నా కాదు అనిపించింది నువ్వు నాకు  దూరమయ్యాకనే. ఎన్నెసార్లు నా  బాధని నీతో పంచుకోవాలనిపించినా నిభాయించుకున్నాను. కారణం నీ ఏకాగ్రత భంగం కాకూడదని. అదొక్కటేకాదు నీకు ధైర్యం చెప్పడమే చేతనైన నేను నీముందు బేలగా తేలిపోకూడదని అనిపించింది. సో... ఇప్పుడ చెప్పు. నీకు తెలిపరచకపోవలడంలో నేనేమన్నా తప్పుచేశానా?"

 

    భుజం పైన  తలానించి చూస్తూవుంది. అతన్నే. సోషియాలజీలో పోస్ట్ గ్రాడ్యుయేట్  అయిన మిత్ర మంచి తెలుగులో మాట్లాడ్డమేకాదు, జీవితాన్ని అద్భుతంగా  విశ్లేషిస్తుంటాడు. ఈ ఎనలైజేషన్ దానిగకి సంబంధించిన మెచ్యూరిటీ మెదడుకి సంబంధించిందా , వయసుకు సంబంధించిందా అన్నది ఆమెకు తోచడంలేదు.