నా వయసు నేను మర్చిపోయి పెన్షన్ కి అప్లై చేసేసాను!
on Jan 24, 2023
జబర్దస్త్ ప్రతీ వారం ఎంతో బాగా ఎంటర్టైన్ చేస్తూ వస్తోంది. ఇక నెక్స్ట్ వీక్ ఎపిసోడ్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. ఇందులో అన్ని స్కిట్స్ హైలైట్ గా నిలువడమే కాదు కడుపుబ్బా నవ్వించాయి. ఇక కమెడియన్ శాంతి కుమార్ ఐతే విడాకులు అనే కాన్సెప్ట్ మీద స్కిట్ చేసి అసలు విడాకులకు ఆ పేరు ఎలా వచ్చిందో అంటూ చెప్పిన థీమ్ చాలా ఫన్నీగా ఉంది. ఫైనల్ గా జడ్జి ఇంద్రజ మాట్లాడుతూ "ఇక్కడున్న అందరి టీమ్ లీడర్స్ లోకి మీరే కదా పెద్దవారు" అని శాంతికుమార్ ని అనేసరికి "రాఘవ గారు నాకంటే పెద్దోళ్ళండి" అంటూ శాంతికుమార్ ఆన్సర్ ఇచ్చాడు.
"నా వయసు మీద పంచ్ లు వేసి వేసి అలవాటైపోయి నాకు తెలియకుండానే పెన్షన్ కి అప్లై చేశా మొన్న" అని కామెడీగా చెప్పాడు రాకెట్ రాఘవ. "ఇంత లేట్ గా వచ్చావేంటి అని వాళ్ళు నిన్ను అడిగారు" కదా అని కృష్ణ భగవాన్ మరో కౌంటర్ వేసేసరికి "ఐతే మీరు వెంటనే వెళ్ళాలి" అని ఇంద్రజ కృష్ణ భగవాన్ మీద కౌంటర్ పంచ్ వేసేసింది. "ఇందాక మేనేజర్ గారు బయట కుర్చీ వేసి కూర్చోండి అంటే లేదు అని నేను లోపలి రావడం నేను చేసిన పెద్ద తప్పు" అని రాఘవ అన్నాడు. ఇలా వయసుల మీద అందరి మధ్యన జరిగిన సంభాషణలు చాలా సరదాగా ఉన్నాయి.
జబర్దస్త్ లో రాకెట్ రాఘవ సీనియర్ మోస్ట్ కమెడియన్ అని చెప్పొచ్చు. అందరి స్కిట్స్ కన్నా రాఘవ స్కిట్స్ చాలా రియాలిటీగా, నాచురల్ కుటుంబ సమేతంగా చూసే విధంగా ట్రెండ్ కి తగ్గట్టు ఉంటాయి. మిగతే కమెడియన్స్ చేసే స్కిట్స్ మీద నెగటివ్ టాక్ వస్తుంది కానీ రాఘవ స్కిట్స్ మీద ఎక్కడ చిన్న నెగటివిటీ కూడా వినిపించదు.