ఈ జన్మకు కష్టం..బెటర్ లక్ నెక్స్ట్ టైం..సౌమ్యకి మంచి ఆఫర్ ఇచ్చిన నాటీ నరేష్
on Dec 2, 2022
రాఘవ ఏ స్కిట్ చేసినా అందులో వెరైటీ కనిపిస్తుంది. ఇక రాబోయే వారం జబర్దస్త్ లో రాఘవ బామ్మ గెటప్ లో బైక్ మీద ఎంట్రీ ఇచ్చాడు. ఈ షో లేటెస్ట్ ప్రోమో రీసెంట్ గా రిలీజ్ అయ్యింది. బండి మీద స్టైల్ గా 16 ఏళ్ళ వయసు సాంగ్ పాడుకుంటూ వచ్చాడు రాఘవ. ఇక ఇంద్రజ రాఘవ గెటప్ ని సాంగ్ ని చూసి కూర్చుంటే లేవలేని వయసులో ఈ పడిపడి లేచే పాటలు అవసరమా అని కౌంటర్ వేసింది. ఈ స్కిట్ భార్య భర్తల మధ్య పుల్లలు పెడితేనే కడుపు నిండుద్ది అన్న కాన్సెప్ట్ తో చేసాడు.
ఇక నూకరాజు టీమ్ మొత్తం విక్రమ్ నటించి అన్ని మూవీస్ లోని క్యారెక్టర్లు చేసి ఎంటర్టైన్ చేశారు. నాటీ నరేష్ టీం అల్లావుద్దీన్ అద్భుత దీపం కాన్సెప్ట్ లో ఒక స్కిట్ వేశారు. ఈ స్కిట్ లో జీని క్యారెక్టర్ ని నరేష్ చేసాడు. సౌమ్య దగ్గరకు వెళ్లి " నేను నీకు నచ్చి ఉండొచ్చు, కానీ ఈ జన్మకు నన్ను దక్కించుకోలేవు ..బెటర్ లక్ నెక్స్ట్ టైంరా నాన్న " అని మంచి ఆఫర్ ఇచ్చాడు నాటీ నరేష్. దానికి కౌంటర్ గా సౌమ్య " ఫస్ట్ టైం ఈ అబ్బాయిని ఇంత దగ్గరగా చూస్తున్నాను..ఇలా వున్నాడేంటి" అనే అర్ధం వచ్చేలా పంచ్ పడేసరికి నరేష్ సైలెంట్ ఐపోయాడు.
Also Read