రష్మి పోస్ట్ కి ఎమోషనల్ కామెంట్ చేసిన తన అభిమాని!
on Jan 25, 2023
ప్రముఖ యాంకర్ రష్మి గౌతమ్ పరిచయం అవసరం లేని పేరు. టీవీ షోస్ లో యాంకర్ గా అతి తక్కువ కాలంలోనే ఎంతో మంది అభిమానులను సొంతం చేసుకున్న ఈ భామ... ఎప్పటికప్పుడు తన ఫోటోలని సోషల్ మీడియాలో అప్లోడ్ చేస్తూ తన అభిమానులకు దగ్గరగా ఉంటూ వస్తోంది. అయితే గత వారం రష్మి ఇంట్లో విషాదం నెలకొంది. ఆ విషయాన్ని ఆమె సోషల్ మీడియాలో షేర్ చెయ్యగా... నెటిజన్లు స్టే స్ట్రాంగ్ అంటూ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.
రీసెంట్ గా తన ఫోటో షూట్స్ తో బిజీ అయిపోయిన ఈ భామ... ఆ ఫొటోస్ కి తన ఇన్ స్టాగ్రామ్ లో 'షో మస్ట్ గో ఆన్' అనే క్యాప్షన్ తో పోస్ట్ చేసింది. అయితే ఈ పోస్ట్ కి తన అభిమానులు స్పందించారు. "అన్ని తానై పెంచిన అమ్మమ్మ దూరమై వారం గడవలేదు... కంటి అంచున నీరు ఆగకుండా వస్తున్నా.. కడుపులోపల ఎంత బాధ దాగి ఉన్నా.. వాటన్నిటిని దాచేసి బయటకు అద్దెకు తెచ్చుకున్న నవ్వును మొహంపై చూయిస్తున్న మీ ధైర్యానికి గుండె నిబ్బరానికి హ్యాట్సాఫ్" అంటూ ఒక అభిమాని కామెంట్ చేశాడు. ఈ కామెంట్ కి మరొకరు "ఆమెకు తెలుగు రాదు బ్రో" అని రిప్లై ఇచ్చాడు.
కాగా ఇప్పుడు ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. తెలుగులో రాసిన ఈ కామెంట్లు రష్మీకి అర్థం అవుతాయా? లేదా? అర్థం అవుతే తను ఎలా స్పందిస్తుందో చూడాలి మరి.