తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు విశ్వనాధ్ గారిని సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం
on Mar 20, 2023
ఉగాది సందర్భంగా స్టార్ మాలో పండగ రోజు ప్రసారం కాబోతున్న "మా ఇంటి పండగ" ఈవెంట్ ఎపిసోడ్ కి చెందిన మరో లేటెస్ట్ ప్రోమో రిలీజ్ అయింది. ఇందులో కొంత భాగం కే.విశ్వనాధ్ గారికి డేడికేట్ చేశారు. ఆయన మూవీస్ లోని సాంగ్స్, డాన్స్ చేసి చూపించారు బుల్లితెర నటులు. "స్వాతిముత్యం" మూవీలో ఎవర్ గ్రీన్ సాంగ్ ఐన "సువ్వి సువ్వి " సాంగ్ కి అవినాష్ కమల్ హాసన్ లా, రాధికా రోల్ లో ప్రియాంక జైన్ చేశారు. ఈ పెర్ఫార్మెన్స్ చూసిన గెస్ట్ నాని "లెజెండ్స్ ఉంటారు కానీ లెజెండ్స్ లోకెల్లా లెజెండ్ ఎవరైనా ఉన్నారు అంటే అది కే.విశ్వనాధ్ గారు" అని చెప్పారు. తర్వాత "శుభసంకల్పం" లో మరో అద్భుతమైన సాంగ్ "సీతమ్మ అందాలు" అంటూ బాలాదిత్య, తేజస్విని గౌడ డాన్స్ చేసి చూపించారు. "మన కల్చర్ ని మనం ఈరోజు వరకు గుర్తుపెట్టుకున్నాం అంటే అలాంటి గొప్ప ఫిలిం మేకర్లు అప్పుడప్పుడు మనకు గుర్తు చేస్తున్నారు కాబట్టి" అని అన్నాడు నాని.
తర్వాత అంబటి అర్జున్ వచ్చి "సిరివెన్నెల" మూవీ నుంచి "ఈ గాలి ఈ నేల" అనే సాంగ్ కి డాన్స్ చేసి చూపించాడు. "తెలుగు వాళ్ళు ఉన్నంతవరకు విశ్వనాధ్ గారిని మనం సెలెబ్రేట్ చేసుకుంటూనే ఉంటాం" అని చెప్పాడు నాని. ఈ షో ఉగాది పండగ రోజు 22 వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ప్రసారం కాబోతోంది. కే విశ్వనాథ్ గారు తీసిన ప్రతి సినిమా ఒక ఆణిముత్యం, ఒక కళాఖండం అని చెప్పొచ్చు. ఆ మూవీస్ లో కనిపించే పాత్రలు, వినిపించే సంగీతం, అర్థవంతమైన మాటలతో ఆయన తీసిన ప్రతి మూవీ ఆడియన్స్ కి ఎప్పటికీ గుర్తుండిపోతాయి.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
