ఫొటో ఫీచర్: బేబీ బంప్‌తో బిగ్ బాస్ బ్యూటీ!
on Mar 5, 2021
ఈ మధ్య బేబీ బంప్‌తో ఫొటో షూట్లు చేసుకోవడం ఓ ఫ్యాషన్‌గా మారిపోయింది. స్టార్ హీరోయిన్ల నుంచి రియాలిటీ షో కంటెస్టెంట్ల వరకు బేబీ బంప్ తో ప్రత్యేకంగా ఫొటోలకు పోజులిచ్చేస్తున్నారు. ఇప్పుడిదొక ట్రెండ్‌గా మారిపోయింది. తాజాగా ఈ జాబితాలో నటి, బిగ్‌బాస్ కంటెస్టెంట్ హరితేజ కూడా చేరిపోయింది. అ ఆ, ప్రతిరోజు పండగే, హిట్ వంటి చిత్రాల్లో నటించి తనదైన నటనతో ఆకట్టుకుంది హరితేజ.
బిగ్‌బాస్ సీజన్ 1లో పాల్గొని మరింత పాపులర్ అయింది. ఇటీవలే బిగ్‌బాస్ కంటెస్టెంట్స్ రీయూనియన్‌లో భాగంగా స్టార్ మా చానల్ ఏర్పాటు చేసిన 'బిగ్ బాస్ ఉత్సవం 2'లో పాల్గొన్న హరితేజకు బిగ్‌బాస్ సీజన్ 1 కంటెస్టెంట్స్ వేదికపైనే శ్రీమంతం చేయడం ఆకట్టుకుంది. ఈ సందర్భంగా భావోద్వేగానికి లోనైంది హరితేజ.
ఇదిలా వుంటే త్వరలో పండంటి పాపాయికి జన్మనివ్వబోతున్న ఆమె బేబీ బంప్‌తో బ్లాక్ డ్రెస్‌లో ఫొటోలకు పోజులిచ్చింది.
బిగ్‌బాస్ సీజన్ 1లో టాప్ 5లో నిలిచిన హరితేజ తాజాగా బేబీ బంప్‌తో ప్రత్యేకంగా ఫొటో షూట్ చేయించుకుంది. ఆ ఫొటోలను తన ఇన్స్టాగ్రామ్ హ్యాండిల్లో షేర్ చేసింది. ఒక్క పిక్చర్ మినహా మిగతావాటిని బ్లాక్ అండ్ వైట్‌లో పోస్ట్ చేసింది. వాటికి "Never lose the kid in ur heart" అంటూ క్యాప్షన్ జోడించింది.
ఈ ఫొటోలు నెట్టింట సందడి చేస్తున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ నైస్, క్యూట్ అంటూ కామెంట్లు పెడుతున్నారు.
Also Read