'బ్రహ్మముడి' సీరియల్ గ్రాండ్ లాంఛ్!
on Jan 25, 2023
'బ్రహ్మముడి' సీరియల్ ఇప్పుడు స్టార్ మాటీవీలో కొత్తగా మొదలు అయ్యింది. బాలీవుడ్ హీరో షారుఖ్ ఖాన్ సైతం దీన్ని ప్రమోట్ చెయ్యడంతో ఈ సీరియల్ పై ప్రేక్షకుల అంచనాలు మరింత పెరిగాయి. ఈ సీరియల్ ఎపిసోడ్ -1 లో... సినిమాని తలపించే రేంజ్ లో ఈ సీరియల్ హీరో, హీరోయిన్ ల ఇంట్రడక్షన్ ఉంది.
దుగ్గిరాల కుటుంబం అంటే గొప్ప పేరున్న ధనవంతుల కుటుంబం. దుగ్గిరాల సీత రామయ్య- ఇందిరాదేవి దంపతులు. వీరికి సంతానంగా ఇద్దరు కొడుకులు, ఒక్క కూతురు, ముగ్గురు మనవళ్ళు, ఇద్దరు మనవరాళ్లు ఉన్నారు.
ఈ సీరియల్ మెయిన్ హీరోగా రాజ్ , హీరోయిన్ గా కావ్య లు నటించారు. ఇద్దరివి విభిన్న మనస్తత్వాలు. వీరిద్దరికి బ్రహ్మ ఎలా ముడి వేస్తాడు అనేదే ఈ సీరియల్ కథ. గాల్లో మేడలు కడుతూ... కోటీశ్వరుల ఇంటికి తన కూతుళ్లను కోడళ్ళుగా చెయ్యాలని కావ్య తల్లి కలలు కంటుంది.
సీతరామయ్య గారి ముగ్గురు మనవాళ్ళది విభిన్న మనస్తత్వం. సీతరామయ్య తన ఇండస్ట్రీస్ పగ్గాలు రాజ్ కి కట్టపెట్టాలాన్న అలోచనలో ఉంటాడు. అయితే రాజ్ కి చేసే ప్రతీ పనిలో క్వాలిటీ ఇంకా పర్ఫెక్షన్ ఉండాలని అనుకుంటాడు. కావ్య మట్టి విగ్రహలకు కలర్ లు వేసుకుంటూ తనలోని కళలకు ప్రాణం పోస్తుంది. ఈ విభిన్న మనస్తత్వాలు కలవారు ఎలా ఒకటి అవుతారనేదే ఈ కథ.

Also Read
Latest News
Video-Gossips
TeluguOne Service
Customer Service
