సుధీర్‌కు ఫస్ట్ చాన్స్ ఇచ్చింది.. వేణు!
on Jul 4, 2022
'పార్టీ చేద్దాం పుష్ప' షో స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు హిలేరియస్ గా సాగిపోయింది. డ్యాన్సెస్తో, స్కిట్స్‌తో కడుపుబ్బా నవ్వించారు కంటెస్టెంట్స్. స్టేజి మీద కరివేపాకు బాబా స్కిట్ కూడా మస్త్ ఎంటర్టైన్ చేసింది. ఈ స్కిట్ గురించి అందరూ పాజిటివ్ కామెంట్స్ ఇచ్చారు జడ్జెస్. ఈ స్కిట్ లో సుధీర్ కరివేపాకు బాబా దగ్గరకు వచ్చి తన డెస్టినీ ఎలా ఉండబోతోంది అంటూ అడిగాడు. "డిస్నీకి ఇక నీ డెస్టినీ బాగుంటుంది, హాట్ స్టార్ లో బాగా చేసుకో సూపర్ స్టార్‌వి ఐపోతావ్" అంటూ జోస్యం చెప్పాడు ధనరాజ్.
స్కిట్ ఎండింగ్ లో సుధీర్ తన ఫస్ట్ జర్నీ గురించి చెప్పుకొచ్చాడు. "నాకు ఫస్ట్ అవకాశం ఇచ్చింది వేణు అన్న, అవకాశం ఇప్పించింది శీను" అంటూ గుర్తు చేసుకున్నాడు. "ఈరోజు ఈ స్టేజి మీద ఇలా ఇంతలా ఎదిగాను అంటే దానికి కారణం వేణు, శీను.. నా జీవితాంతం వీళ్లిద్దరికీ రుణపడి ఉంటాను" అంటూ స్టేజి మీద వీళ్ళ ఇద్దరితో మొదలైన జర్నీ గురించి ఆనాటి జ్ఞాపకాల గురించి చెప్పుకొచ్చాడు సుధీర్.
"2013 ఫిబ్రవరి 2న ఫస్ట్ టైం నేను స్టేజి మీదకు రావడం.. నాగబాబు గారిని షూటింగ్లో చూడడం తప్ప రియల్ గా చూసింది ఆ రోజే" అని వెల్లడించాడు. ఫస్ట్ స్కిట్ ప్రెజంట్ చేసినప్పుడు జడ్జెస్ చేసిన కామెంట్స్, ఆ స్కిట్ పెర్ఫార్మన్స్ ని రికార్డు చేసుకుని భద్రంగా ఉంచుకున్నానన్నాడు. "ఇక్కడ ఎవరికీ ఏ ప్రాబ్లెమ్ వచ్చినా మేమున్నాం అంటూ ఒక ఫ్యామిలీలా కలిసిపోయేంత అనుబంధం ఏర్పడింది అంటే అది వేణు అన్న వల్లనే" అన్నాడు సుధీర్.. "ఈరోజు నేను, నా ఫ్యామిలీ ఇంత హ్యాపీగా ఉంటూ, ఆడియన్స్ తో నాకు ఇంత అటాచ్మెంట్ పెరిగింది అంటే అది వేణు అన్న నాకు ఇచ్చిన మొదటి అవకాశం" అంటూ వేణుకి, ధనరాజ్ కి థ్యాంక్స్ చెప్పాడు సుధీర్. "ఆనాటి మిత్రులంతా కూడా ఇలా ఈ స్టేజి మీద ఇలా కలవడం సంతోషంగా ఉంది" అంటూ వేణు కూడా ఎమోషన్ అయ్యాడు.
Also Read